వైసీపీ రేబిస్ వచ్చిన కుక్క… అందరూ కలిసి తన్ని తరిమేయాలి

వైసీపీ

• జగన్ బొక్కేస్తోంది ప్రజాధనం.. మన ధనం అని గుర్తించండి
• జగన్ అవినీతి వల్ల నాకేం నష్టం అనుకోకండి
• వైసీపీ అనేది కోడి కాదు.. కట్ల పాము
• సాక్షి పత్రికకు దోచిపెట్టిన రూ.930 కోట్లతో మత్స్యకారులకు హార్బర్లు నిర్మించవచ్చు
• పిఠాపురాన్ని వ్యవసాయ, ఉపాధి, ఆధ్యాత్మిక సిరుల కేంద్రంగా తీర్చిదిద్దుతా
• ఉప్పాడ వారాహి విజయభేరి యాత్ర సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘జగన్ చేస్తున్న అవినీతి వల్ల నేను వ్యక్తిగతంగా నష్టపోయేది ఏంటీ..? ఆయన అవినీతి ప్రభావంతో నాకేం సంబంధం… అది నాకెలా నష్టమవుతుంది అని చాలామంది అనాలోచితంగా మాట్లాడుతున్నారు. దీనికి ఉదాహరణగా పిఠాపురం నియోజకవర్గంలో అమీనాబాద్ లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని తీసుకోండి. ఈ హార్బర్ నిర్మాణ ప్రతిపాదనలు రూ.422 కోట్లు. దీనివల్ల 20 వేల కుటుంబాలకు బతుకు భరోసా ఏర్పడుతుంది. కానీ జగన్ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదు. తప్పుడు ప్లాన్ తో నిర్మాణం మొదలుపెట్టడం వల్ల ఇద్దరు మృతి చెందారు. ఎన్నో పడవలు నాశనం అయ్యాయి. హార్బర్ నిర్మాణం అటకెక్కింది. రూ.422 కోట్లు ఉంటే ఎన్నో మత్స్యకార కుటుంబాలకు జీవితం ఇచ్చే హార్బర్ కు జగన్ ప్రభుత్వం రూపాయి విదిలించలేదు. కానీ అదే సమయంలో తన సొంత పత్రిక సాక్షి కోసం జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లలో వెచ్చించిన సొమ్ము ఎంతో తెలుసా… అక్షరాలా రూ.930 కోట్లు. అంటే ప్రజల పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును వారి కోసం, వారి జీవనం కోసం వెచ్చించడం మానేసి, తన జేబులు నింపుకొన్న వ్యక్తి జగన్’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వారాహి విజయభేరీ యాత్రలో భాగంగా మంగళవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జగన్ నియమించిన వాలంటీర్లతో సాక్షి పేపర్ కొనాలని ప్రతి ఒక్కరికీ రూ.200 చొప్పున అదనపు ఛార్జీలు ఇచ్చాడు. అయిదేళ్లలో దీని ద్వారా రూ.330 కోట్లు కొల్లగొట్టాడు. ఇక సాక్షి పత్రికలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల ఖర్చు రూ.600 కోట్లు మేర పక్కదారి పట్టింది. మొత్తంగా అయిదేళ్లలో రూ. 930 కోట్లు పైబడి ప్రజల సొమ్ముకు గండి కొట్టారు. 40 మంది సాక్షి ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకొచ్చి వారికి ప్రజాధనం దోచి పెట్టాడు. ఇదంతా ప్రజలకు సంబంధించిన సొమ్ము. వారి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు. అంతా ఎక్కడికి వెళ్తోందనేది ప్రజలు స్థిమితంగా ఆలోచించాలి. నా వ్యక్తిగత సొమ్ము పోలేదు అనుకుంటే తప్పు.
* బీసీ, ఎస్సీ, ఎస్టీల నిధులు మళ్లించేశాడు
ఓ బ్యాంకులో మేనేజర్ గా ఉన్న వ్యక్తి మనం దాచుకున్న డబ్బును సొంతానికి వాడుకుంటే ఊరుకుంటామా..? మన ఆస్తులను తనఖాపెడితే ఊపేక్షిస్తామా..? ప్రజలు జగన్ అవినీతి మీద జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. మాట్లాడితే నా బీసీలు, నా ఎస్సీలు అనే జగన్… వారి డబ్బులే పక్కదారి పట్టించాడు. దీనిపై ప్రజలంతా చర్చించాలి. అన్న వచ్చాడు.. అంతా ఇచ్చాడు.. అన్నొచ్చాక జరిగింది.. అని గుడ్డిగా అనుకోకుండా వెనుకున్న అసలు అవినీతిని గుర్తించాలి.
* ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే అనేలా పనిచేస్తా
నాకు వ్యవసాయం అన్నా, ఆధ్యాత్మికత అన్నా ఎంతో ఆసక్తి. పిఠాపురం నేలలో ఉన్న గొప్పదనం నన్ను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ మత్స్యకారులున్నారు… వరి రైతులున్నారు.. ఉద్యాన రైతులున్నారు… సెరీకల్చర్ ఉంది. అన్ని రకాల వ్యవసాయం ఉన్న నేల ఇది. అలాగే శ్రీ పూరుహుతిక అమ్మవారి శక్తి పీఠం, అటు శ్రీ పాద శ్రీ వల్లభుడి పీఠంతో పాటు ప్రసిద్ధి చెందిన బంగారు పాప దర్గా, చరిత్ర కలిగిన ఆంధ్రా బాప్టిస్టు చర్చిల మేలు కలయిన ఈ నేల. అద్భుతమైన సముద్ర తీరం, మరోవైపు పచ్చటి పంటల మణిహారంగా కనిపించే పిఠాపురాన్ని అని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాను. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది. అన్ని ధర్మాల మీద గౌరవం ఉంది. ఈ రోజు నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు ఓ తల్లి క్రీస్తు ప్రార్థన చేసింది. ‘‘నీవు యెహోవా శిరసున భూషణ కిరీటముగానూ… నీ దేవుడి చేతిలో రాజకీయ మకుటముగానూ ఉందువు’’ అంటూ చేసిన ప్రార్థన ఎంతో అపురూపం అనిపించింది. ఆ తల్లికి పాదాభివందనం చేసి బయలుదేరాను. సర్వధర్మాలు, సర్వ మతాలు బాగుండాలి అనుకుంటాను. ఏ భారతీయుడైనా అలాగే అనుకోవాలి. పిఠాపురాన్ని సైతం వ్యవసాయ, ఆధ్యాత్మిక కలబోతల గొప్ప ప్రాంతంగా తయారు చేస్తాను. ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలనేలా… నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలా ఉండాలనేలా తయారు చేస్తాను. అందంగా ఉప్పాడ బీచ్ కారిడార్ ను తయారు చేస్తాను. అలాగే గత వందేళ్లలో ఉప్పాడ సముద్ర తీరం 320 మీటర్ల మేర కోసుకుపోయింది. దీనికి నిపుణులతో కలిసి సమగ్రంగా కోతను ఆపేలా, ముంబయి తరహాలో పటిష్టమైన గట్లను నిర్మించేలా చూస్తాను. దేశమంతా పిఠాపురం వైపు తిరిగి చూసేలా చేస్తాను.
• కాకినాడ ఎస్ఈజడ్ అసలు లక్ష్యాన్ని నెరవేరుస్తాం
అంబేద్కర్ వంటి మహనీయులు, జై భీం నినాదం నాకు గుండెల్లో ఉంటాయి. అదే నాకు స్ఫూర్తి. ఎస్ఈజడ్ లు నా రాజకీయ పోరాటానికి అసలు కారణం. ఓ రైతు రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ‘‘ఊళ్ల కోసం రోడ్లు వేయడం చూశాం కానీ.. రోడ్ల కోసం ఊళ్లను తీసేయడం చూడలేదు’’ అన్న మాట నన్ను ఎంతగానో కదిలించింది. నేను సోషలిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాడిని. కాకినాడ ఎస్ఈజడ్ లో నష్టపోయిన ప్రతి రైతుకు కచ్చితంగా పరిహారం అందేలా చూస్తాను. 2009లో ప్రారంభించిన ఎస్ఈజడ్ లో ఇప్పటి వరకు పరిశ్రమలు రాలేదు. రైతులు మాత్రం బలయ్యారు. యాజమాన్యం చేతులు మారి, ఇప్పుడు అరబిందో చేతిలో ఉంది. నేను కాకినాడ ఎస్ఈజడ్ రైతుల కోసం నిలబడతాను. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలా బాధ్యత తీసుకుంటాం. నేను మధ్య తరగతి నుంచి వచ్చినవాడిని.. వారి కష్టాలు తెలుసు. మీ కష్టాలకు భుజం కాస్తాను. ఎస్ఈజడ్ పేరుతో రైతుల వద్ద నుంచి నామమాత్రపు ధరకు సేకరించిన 10 వేల ఎకరాలు ధారధత్తం చేశారు. ఎంతో మంది రైతుల కన్నీళ్లు చూశాను. రైతులకు ఒకటే చెబుతున్నా మన పిల్లలకు కచ్చితంగా ఇక్కడే ఉపాధి తీసుకొస్తాను. నన్ను నమ్మి గెలిపించండి.. రైతులు, చేనేత కళకారులు, మత్స్సకారులు, సగటు కూలీల గళం అవుతాను. వారి గొంతునై అసెంబ్లీలో పోరాడుతాను.
* నా పోటీ జగన్ తోనే…
ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతున్న జగన్ తోనే నా పోటీ. ఆయన ప్రజాధనాన్ని మింగేస్తున్న తీరు, వ్యవస్థలను నాశనం చేస్తున్న విధానంపైనే పోరాడుతాను. మత్స్యకారులకు హార్బర్ కట్టిస్తానన్నాడు. జెట్టీలన్నాడు. అయిదేళ్ల విలువైన కాలాన్ని ఇస్తే ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. కేవలం మత్స్యకారులకే కాదు అన్ని వర్గాలకు తీరని ద్రోహం చేసిన జగన్ మీదనే నా పోరాటం. అతడి మీదనే నా పోటీ. వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రాత్రి వేళల్లో వచ్చి భయపెట్టడం కాదు.. పగలు రావాలి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గంలోని నాగులపల్లి గ్రామంలో యువత ప్రభుత్వ టీచర్లు కావాలని కల కన్నారు. అలాంటి వేలాది మంది యువతకు వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ వేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్ట మొదటిగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తాం. యువత ఏదైనా అడిగితే కోడి గుడ్డు పొదుగుతోంది అని చెప్పే వైసీపీ నాయకులు వారిని నిలువునా మోసం చేశారు. వైసీపీ అనేది కోడి కాదు.. అదో పెద్ద కట్ల పాము. తన గుడ్లను తానే తినే పెద్ద కట్లపాము. కేంద్రానికి వెళ్లి బలంగా మాట్లాడాలి అంటే శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లాంటి వ్యక్తి కావాలి. ఎంతో కష్టపడి బ్రాండ్ క్రియేట్ చేయగల సమర్ధుడు. ఉప్పాడ చీరకు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ తీసుకురావాలంటే ఉదయ్ శ్రీనివాస్ లాంటి యువకుడితోనే సాధ్యం అవుతుంది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అందరికీ ఓట్ల బదిలీ జరగాలి. జనసేనకు తెలుగుదేశం బలం అయితే, తెలుగుదేశానికి జనసేన బలం కావాలి. మనకు బీజేపీ పెద్ద బలం అవుతుంది.
* రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు… కక్షలు ఉండకూడదు
నేను దశాబ్దంపాటు రాజకీయాల్లో ఉన్నాను. వర్మ గారు రెండు దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల్లో పాలసీలపరంగా విభేదాలు ఉండొచ్చు. అంతే తప్ప వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. జగన్ అధికారంలోకి రాగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించి జైల్లోపెట్టాడు. నేను ఆయన్ను కలవడానికి వెళితే మీ మీద రాజకీయ రంగు పులుముతారని అంతా మాట్లాడితే …. అలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని రాజమండ్రిలో చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చిన వెంటనే మద్దతు తెలిపి అండగా నిలబడ్డాను.
* తోడబుట్టిన చెల్లినే వదల్లేదు… మన ఇంట్లో ఆడవాళ్లు ఒక లెక్కా
ఈ మధ్య ఒక ఇంగ్లీష్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్లు నన్ను అడుగుతూ జనసేన పార్టీని చంద్రబాబుకు అమ్మేశారని జగన్ విమర్శిస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటని అడిగారు. జగన్ ఏమీ లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజపేయి కాదు. 32 అవినీతి కేసుల్లో నిందితుడు. ఐదేళ్లుగా బెయిల్ పై బయట తిరుగుతున్నాడు అని చెప్పాను. అతను కూడా మాట్లాడుతున్నాడు అన్నాను. ఆడబిడ్డలకు ఒకటే చెబుతున్నాను.. ఈ ఎన్నికలు చాలా కీలకం. మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి. జగన్ తన సొంత చెల్లెళ్లకే గౌరవం ఇవ్వని వ్యక్తి. వారి వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియాలో పెట్టి తిట్టించాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత దాదాపు 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. అటువంటి వ్యక్తికి మరోసారి ఛాన్స్ ఇస్తే మన ఇళ్లల్లో ఆడవాళ్లకు రక్షణ ఉంటుందని గ్యారెంటీ లేదు. ఈ ఎన్నికల్లో ఓటుకు రూ. 10 వేలు అయినా ఇచ్చి ప్రజల్ని కొనాలని చూస్తారు. అవి మన దగ్గర దోచుకున్న డబ్బులే అని గుర్తుంచుకోండి.
* మమ్మల్ని తిట్టేటపుడు సంతోషపడకండి… అది రేపు మీదాకా వస్తుంది
నేను రైతాంగ సమస్యలు, మత్స్యకారుల కష్టాలు, చేనేతల బాధలు, ప్రభుత్వ పాలసీల గురించే మాట్లాడాను.. మాట్లాడతాను. అంతే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయను. నేను యాడ్స్ లో నటిస్తే కోట్ల రూపాయలు వస్తాయి. కానీ చేయలేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే వాడు గొంతు విప్పితే అది ప్రజలకు మంచి జరగాలన్నదే ఆకాంక్ష. నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది కేవలం చేనేత వస్ర్తాలకు మాత్రమే. నేను ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడితే వైసీపీ అధినాయకుడు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. రాజకీయాలతో సంబంధం లేని నా భార్యను తూలనాడుతాడు. నాతో విడిపోయి గుట్టుగా బతుకుతున్న వాళ్లను రాజకీయాల్లోకి తీసుకొస్తాడు. జగన్ సతీమణిని నేను భారతీ గారు అనే సంబోధిస్తాను. అది నా సంస్కారం. చంద్రబాబు గారి సతీమణిని శాసనసభ సాక్షిగా దుర్బాషలాడారు. నన్ను, చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు సంతోషపడకండి. మీకు రేపు అలా జరుగకూడదంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓట్లు వేయండి.
* మత్స్యకారుల భవిష్యత్తకు మాదీ గ్యారెంటీ
మత్స్యకారులకు సంబంధించి అరబిందో, ఓఎన్జీసీ, రిలయన్స్ పైప్ లైన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో, కంపెనీలతో మాట్లాడి మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తాం. పరిశ్రమల వల్ల తీర ప్రాంతాలు కాలుష్యం బారిన పడకుండా చూసుకుంటాం. వ్యర్థజలాలు శుద్ధి చేసిన తరువాతే సముద్రంలోకి వదిలేలా చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కోసం నిర్మించిన సామాజిక భవనాలను వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలుగా మార్చేసింది. పెళ్లిళ్లు, వేడుకలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే సామాజిక భవనాలు నిర్మిస్తాం. ఆధునిక సదుపాయాలతో తుపాను పునరావాస కేంద్రాలను నిర్మిస్తాం. ఆహారం, మందులు, తాగునీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటాం. ఉప్పాడ సముద్ర కోత సమస్యలకు నిపుణులతో మాట్లాడి జియో ట్యూబ్ ఏర్పాటు చేస్తాం. మత్స్యకారులకు సురక్షిత ప్రాంతాల్లో పక్కా ఇళ్లు నిర్మిస్తాం. బోట్లకు బీమా సౌకర్యం కల్పిస్తాం. మత్స్యకారులకు ప్రమాద బీమా రూ.పది లక్షలు ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. కానీ కేవలం రూ. 5 లక్షలే ఇస్తుంది. అది కూడా కేంద్ర ఇస్తున్న రూ. 5 లక్షలు ఇస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదు. మేము అధికారంలోకి రాగానే ప్రమాద బీమా రూ. 10 లక్షలు అందిస్తాం. డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయని మత్స్యకారులు నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోతే … మూడు నెలల్లో మృతదేహం దొరకకపోతే వారు చనిపోయినట్లు భావించి బీమా డబ్బులు ఆ కుటుంబానికి వచ్చేలా చేస్తాం. వలలు, బోట్లు, ఇంజన్ల మీద గతంలో 80 శాతం రాయితీ ఉండేది వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిలిపివేసింది. ఈ ఐదేళ్లలో ఒక్క రాయితీ కూడా ఇవ్వలేదు. సబ్సిడీ మీద ఇచ్చే డీజిల్ కూడా మత్స్యకారులకు దూరంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఇస్తున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. వేట విరామ సమయంలో అర్హులైన వారందరికీ రూ. 10వేలు అందిస్తాం. ఓటరు గుర్తింపు కార్డుల మాదిరి వేటకు వెళ్లే మత్స్యకారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. మత్స్యసంపదను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. మత్స్యకారుల నుంచి భూములు సేకరిస్తే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. మత్స్యకార గ్రామాల్లో విద్య, వైద్యం మెరుగుపరుస్తాం.
* హామీలు ఇచ్చామంటే… అమలు చేసి తీరుతాం
ప్రతి చేతికి పని… ప్రతి చేనుకు నీరు లక్ష్యంతో జనసేన- తెలుగుదేశం- బీజేపీ కూటమి పనిచేస్తుంది. అధికారంలోకి రాగానే అర్హులైన అందరికీ కోతలు లేకుండా వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తాం. రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరాన్ని సకాలంలో పూర్తి చేస్తాం. నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాను పచ్చగా మారుస్తాం. చేతి వృత్తులు, కుల వృత్తులకు పెద్దపీట వేస్తాం. 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీకి ఒకటో తేదీనే రూ. 4 వేలు ఫించన్ అందిస్తాం. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఎంతమంది స్కూలుకు వెళితే అంతమందికి అందిస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకు రూ. 1500 ఇస్తాం. ఆటో డ్రైవర్ల జీవనభృతికి ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాం. పేదలకు కడుపునింపడానికి అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. బీసీల రిజర్వేషన్లను తిరిగి 34 శాతానికి పెంచుతాం. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 27 పథకాలను కూటమి అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య పేరును తిరిగి అదే పేరుతో ప్రవేశ పెడతాం. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గెలిచిన తరువాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరుగుతాను. ప్రతి సమస్యను అర్థం చేసుకుంటాను. ప్రతి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటాను.
* సజ్జల గారిది ఆధిపత్య అహంకారం
కూటమి అభ్యర్థులైన అనకాపల్లి ఎంపీ శ్రీ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పంచకర్ల రమేష్ లకు మద్దతుగా చిరంజీవి గారు మాట్లాడితే … సజ్జల రామకృష్ణా రెడ్డి గారు తెగ బాధపడిపోతున్నారు. నక్కలు, తోడేళ్లు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. సింహం సింగిల్ గా వస్తుందని అంటున్నారు. ఆయన గుర్తుంచుకోవాల్సింది మనం మానవ సమాజంలో ఉన్నాం. జంతు ప్రపంచంలో కాదు. చిరంజీవి గారు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. రజనీకాంత్ గారు దాదాఫాల్కే అవార్డు గ్రహీత. అలాంటి వారిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గురించి రజనీకాంత్ గారు రెండు ముక్కలు మంచిగా మాట్లాడితే దూషించారు. ఇప్పుడు చిరంజీవి గారిని దూషిస్తున్నారు. ఆధిపత్య, అహంకారం అంటే ఇదే. ఎవరూ ఎవరిని మెచ్చుకోకూడదు. వీళ్లకు మాత్రమే బాకాలు ఊదాలి. మేము ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేము. అణగారిన వర్గాల పల్లకీ మోయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాం. సజ్జల గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఆయనది ఆధిపత్య అహంకారం. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక కుక్కకు రేబిస్ వైరస్ సోకి అందరిని కరుస్తుంటే … గుంపులుగా వచ్చి దాన్ని బంధిస్తారు. వైసీపీ అనే కుక్కకు రేబిస్ వచ్చింది.. దానిని అందరం కలిసి తన్ని తరిమేయాలి. నేను నా వ్యక్తిగత స్వార్థం చూసుకుంటే నీచుల చేత నా భార్య ను తిట్టించుకునేవాడిని కాదు. నేను ప్రజల కోసం మాటలు పడుతున్నాను. గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు బలంగా గుద్దండి… కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి’’ అని కోరారు.
* శ్రీ పవన్ కళ్యాణ్ కి రాష్ట్రం మొత్తం లోకలే : శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ
పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ శ్రీ ఎన్.వి.ఎస్.ఎన్. వర్మ గారు మాట్లాడుతూ.. ‘‘పిఠాపురం నియోజకవర్గం సమస్యల నిలయంగా మారింది. గడచిన ఐదేళ్లలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఓఎన్జీసీ, రిలయన్స్ వేస్తున్న రిగ్గులకు మత్స్య సంపద దూరమై మత్స్యకారులు నష్టపోతుంటే ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదు. వైసీపీ నాయకులు మాత్రం ఆ సంస్థల నుంచి రూ. వెయ్యి కోట్లు దోచుకు తింటున్నారు. గడచిన ఐదేళ్లలో మత్స్యకారులకు కొత్త బోట్లు ఇచ్చింది లేదు, వలలు, ఆయిల్ ఇంజిన్లు ఇచ్చింది లేదు. తుపాన్లు వస్తే బియ్యం కూడా ఇవ్వలేదు. ఎన్డీఏ కూటమి మన మత్స్యకారులను ఇంట్లో బిడ్డల్లా చూసుకుంటుంది. శ్రీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మన కోసం పని చేసే ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఎంపీగా శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించాలి. వంగా గీత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షులకు రాష్ట్రం మొత్తం లోకలే. ఆ మాటకు వస్తే గీతకు ఇక్కడ ఇల్లు ఉందా? ఓట్ల కోసం వెళితే జనం ముఖం మీదే తలుపులు వేస్తుంటే సింపతీ కోసం జ్వరం డ్రామా ఆడుతున్నారు. గడచిన ఐదేళ్లలో రైతుల పంటలు పోయినా రాలేదు. బోట్లు పోయినా రాలేదు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో హార్బర్ నిర్మాణం పూర్తి చేసి కోల్డు స్టోరేజీలు పెడతాం. మత్స్యకారులు, చేనేతలు, శెట్టి బలిజలకు అందుబాటులో ఉంటాం. మత్స్యకారులకు పోయిన బోట్లు, వలలు తిరిగి ఇస్తాం’’ అన్నారు.
* పిఠాపురం ఎంచుకున్న రోజే శ్రీ పవన్ కళ్యాణ్ విజయం ఖాయమైంది : శ్రీ కృష్ణంరాజు
పిఠాపురం నియోజకవర్గం బీజేపీ ఇంఛార్జ్ శ్రీ కృష్ణంరాజు మాట్లాడుతూ.. “శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్న రోజే విజయం ఖాయం అయిపోయింది. ఈ రోజు నామినేషన్ రోజు నియోజకవర్గ ప్రజలంతా కదిలి వచ్చి పట్టాభిషేకం చేశారు. మనం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మోదీ గారు మూడో సారి అధికారంలోకి రావాలి. రాష్ట్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి రావాలి” అన్నారు.
* అభివృద్ధి చేసి చూపుతా : శ్రీ ఉదయ్ శ్రీనివాస్
కాకినాడ ఎంపీ అభ్యర్ధి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేసింది. సంక్షేమం ఇవ్వడానికి అప్పులు చేశామని చెబుతున్నారు. మరి సంపద ఏమయ్యింది..? సంక్షేమం ముసుగులో బీసీలకు, ఎస్సీలకు ఈ ముఖ్యమంత్రి లక్షల కోట్లు దక్కకుండా చేశాడు. కాకినాడ పార్లమెంటు పరిధిలో పోర్టు ఉంది. 60 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్టు ఉంది. రెండింటికీ కనెక్టివిటీ రోడ్డు లేదు. మేము అధికారంలోకి వచ్చాక పోర్టు టూ ఎయిర్ పోర్టు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం. కాకినాడ సెజ్ పేరిట 11 వేల ఎకరాల భూములు రైతుల నుంచి లాక్కున్నారు. పరిశ్రమలు పెట్టింది లేదు. మా ప్రభుత్వంలో పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తాం. ఉప్పాడ చీరలకు బ్రాండ్ వాల్యూ పెంచుతాం. ఎన్డీఏ ప్రభుత్వంలో మత్స్య సంపద జాడ తెలిపి వేట లాభదాయకం చేస్తాం. ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఎన్నికల ముందు నెల రోజులు ట్రిప్ వేసి గెస్ట్ హౌసుల్లో గడిపి వెళ్లిపోతారు. మూడుసార్లు ఓడినా ఆయన దగ్గర డబ్బుకి కొదవ లేదు. అందుకు కారణం కాకినాడ ఏరియాలో మైనింగ్ డాన్ అతనే. అదే డబ్బుతో ఓట్లు కొందామని చూస్తున్నాడు. నన్ను గెలిపించండి. కాకినాడ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేసి చూపుతా’’ అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్