మహిళలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలి

మహిళలు

• వీర మహిళలు తలచుకుంటే వైసీపీని తుంగలో తొక్కేయొచ్చు
• శ్రీ పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టు
• జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు

       విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో పురుషులతో సరిసమానంగా దూసుకు పోతున్న మహిళలు రాజకీయాల పట్ల కూడా చైతన్యవంతులు కావాలని, రాజకీయాల్లో మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. పిఠాపురంలో బుధవారం శ్రీ నాగబాబు గారిని కలిసిన వీర మహిళలతో ఆయన మాట్లాడారు. వీర మహిళలు తలచుకుంటే వైసీపీని తుంగలో తొక్కేయొచ్చని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టేనని అన్నారు. జాతీయోత్పత్తిలో మహిళల భాగస్వామ్యం పెంచే విధంగా మహిళా సమాజాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు. ఆధునికతలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మన దేశంలో ఇంకా చాలా చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయని, మహిళలను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రానున్నదని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత గౌరవం, మహిళల పట్ల బాధ్యత, రక్షణ పెంచే విధంగా చట్టాలు వస్తాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప , ఉభయ గోదావరి జిల్లాల వీర మహిళల విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీమతి చల్లా లక్ష్మి, శ్రీమతి కడలి ఈశ్వరి, శ్రీమతి తోలేటి శిరీష, కుమారి పిళ్లా రమ్య జ్యోతి, శ్రీమతి కోలా దుర్గ,శ్రీమతి గౌరి, శ్రీమతి కమల తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్