మత్స్యకార గ్రామాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు మేము అనుకూలం

రెసిడెన్షియల్

• జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు
     ప్రతీ పౌరుడికి ఉచిత విద్య, వైద్యం అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో మత్స్యకార గ్రామాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా మేము పని చేస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలం నాయకులు సోమవారం శ్రీ నాగబాబు గారిని ప్రత్యేకంగా కలిశారు. ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల వలన సముద్రం నీరు కలుషితం అవుతోందని, ఓ.ఎన్.జి.సి. ఆయిల్ వెలికితీత కారణంగా మత్స్య సంపద తగ్గిపోతుందని నివారణ చర్యలు తీసుకోవాలని మత్స్యకార వికాస విభాగం నాయకులు శ్రీ నాగబాబు గారిని కోరారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారుల కనీస అవసరాలు, భద్రతా చర్యలు ప్రభుత్వాలు తీసుకోవట్లేదు అని అన్నారు. క్రాప్ హాలిడే సమయంలో సముద్రపు వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు ఉన్న ఆలోచనలో సగం కూడా ప్రభుత్వానికి లేదని అన్నారు. జీ.ఓ. నెం. 217 వచ్చినప్పుడు అది ఖండిస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జీఓ కాపీలు చింపి నిరసన వ్యక్తం చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్రాప్ హాలిడే సమయంలో మత్స్యకారులకు జీవన భృతి చెల్లించాలని అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మత్స్యకార వికాస విభాగం అధ్యక్షులు శ్రీ మల్లాడి రాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వంక కొండబాబు గారు, యు కొత్తపల్లి మండలం మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి అమల, యు కొత్తపల్లి మండలం అధ్యక్షుడు సోదే రవికిరణ్, ఉప్పాడ గ్రామ అధ్యక్షులు సూరాడ శ్రీను, కొనవపేట అధ్యక్షులు పల్లెటి దేవుడు, మూలపేట అధ్యక్షులు సింహాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు ఇజ్రాయిల్, నాగేశ్వరరావు, మైలపల్లి రాజు, నాలుగు గ్రామాల ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, జనసేన నాయకులు శ్రీ సాగర్, శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ శంకర్ గౌడ్, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్