- ఈరోజు మంగళవారం, పౌర్ణమి, చిత్తా నక్షత్రం, హనుమాన్ జయంతి, పైగా శ్రీ పాద శ్రీ వల్లభుడు నక్షత్రం ఇది, అలాంటి రోజున దాదాపు 70 వేల మంది ప్రజలు రోడ్ల పైకి వచ్చి నాకు నామినేషన్ ర్యాలీ విజయవంతం చేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు
- తన గెలుపు కోసం కష్టపడినట్లుగా నా గెలుపు కోసం కష్టపడుతున్నారు టీడీపి ఇన్చార్జి SVSN వర్మ గారు. NDA కూటమి ఎంత బలంగా ఉందో దానికి ఇదే నిదర్శనం
- ఒకవైపు సముద్రతీరం, మరోవైపు పచ్చని పొలాలు, గుండెల్లో పెట్టుకునే యువత ఉండి కూడా ఇంకా పిఠాపురం వెనుకబడి ఉండటం నాకు నచ్చలేదు
- మూడు మతాల సమ్మేళనం పిఠాపురం, అలాంటి పిఠాపురం నన్ను గుండెల్లో పెట్టుకుంది. ఉదయం నేను పూజ చేసి బయలుదేరుతుంటే, ఒక క్రిస్టియన్ పెద్దావిడ వచ్చి నాకు ప్రార్థన చేసి ఆశీర్వదించింది, ఆవిడకు పాదాభివందనం చేసి బయలుదేరాను
- అంబేద్కర్ గారు ప్రతీ వ్యక్తికి సమాన హక్కులు ఉండాలి అనుకే వ్యక్తి, అలాంటి వ్యక్తి నాకు రాజకీయాల్లోకి రావడానికి కారణం
- ఊర్ల కోసం రోడ్లు వేయడం చూసాను కానీ, రోడ్ల కోసం ఊర్లు తీసేయడం చూడలేదు అని వకీల్ సాబ్ సినిమాలో డైలాగ్ పెట్టడానికి కారణం SEZ లు, అభివృద్ది చేస్తాం అని ప్రజల భూములు తీసుకుని అభివృద్ది చేయకుండా, ఉపాధి ఇవ్వకుండా భూము లాగేస్తున్నారు
- ఇక్కడ అరబిందో సంస్థ మన పార్టీకి విరాళం ఇస్తామని చెప్పినా నేను తీసుకోలేదు, కారణం మీకు న్యాయం చేయాలి, నాకు మీకు న్యాయం జరగడం ముఖ్యం, దేని కోసమైతే భూములు తీసుకున్నారో అది నెరవేర్చాల్సిన భాధ్యత వారిపై ఉంది
- దశాబ్దం పాటు ఏ ఒక్క పదవి లేకుండా, ఉన్న ఒక్క ఎంఎల్ఏ వెళ్ళిపోయినా రాజకీయ పార్టీ నడిపింది ఈ దేశంలో నేనొక్కడినే
- గత దశాబ్ద కాలం పాటు నేను నా శ్రమంతా రాష్ట్ర క్షేమం కోసం వెచ్చించాను
- నా మీద వంగా గీత గారిని పోటీకి పెట్టి ఉండొచ్చు, కానీ నా పోటీ మాత్రం వైయస్ జగన్ తోనే
- హార్బర్ కట్టిస్తామని అధికారంలోకి వచ్చి 5 ఏళ్లుగా కనీసం జెట్టి కూడా కట్టించలేకపోయాడు వైయస్ జగన్
- ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం అమీనాబాద్ వద్ద హార్బర్ నిర్మిస్తే మనకు అన్నం పెట్టే బోట్లను కాపాడుకోవచ్చు, 422 కోట్ల బడ్జెట్ పెడితే 20 వేల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించచ్చు, కానీ చేయలేదు వైయస్ జగన్
- మీకు 422 కోట్లతో హార్బర్ కట్టాల్సిన డబ్బు మీకు ఇవ్వకుండా, వైయస్ జగన్ వాళ్ళ సాక్షి పేపర్ కు దాదాపు e 5 ఏళ్లలో 330 కోట్లు ఇచ్చింది వైసీపీ పార్టీ ప్రభుత్వం
- లోతు తెలియని తీరంలోకి ప్రాణాలకు తెగించి వెళ్ళే మత్స్యకారులు , అలాంటి వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం కనీసం ప్రోత్సాహం ఇవ్వట్లేదు, జెట్టీలు, హార్బర్ నిర్మించడం లేదు
- 41 మంది సాక్షి ఉద్యోగులను సలహాదారులుగా చెప్పి మీ హార్బర్ కు ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఇస్తున్నాడు, 930 కోట్లు సాక్షి పేపర్ కు ప్రకటనలు ఇచ్చాడు. కానీ 422 కోట్లు హార్బర్ నిర్మాణానికి ఇవ్వాలేడా, మీ జీవనోపాధి పొట్ట కొట్టాడు జగన్
- వంగా గీత గారు వస్తె అడగండి 330 కోట్లు సాక్షి పేపర్ కు ఇచ్చారు, కనీసం 100 కోట్లు మా జెట్టి నిర్మాణం కోసం ఎందుకు ఇవ్వట్లేదు అని అడగండి
- MP అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అర్థరాత్రి రావడం కాదు, దమ్ముంటే మధ్యాహ్నం వచ్చి ఓట్లు అడుగు
- అధికారంలోకి రాగానే మొట్టమొదట మెగా DSC విడుదల చేస్తాం
- SEZ లో పరిశ్రమలు రావు, తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వరు, వ్యవసాయం చేసుకొనివ్వరు, వైసీపీ నాయకులను గట్టిగా నిలదీయండి
- దాదాపు 300 ఎకరాల భూమి కోతకు గురైంది, ఉప్పెన సినిమాలో చూపెట్టిన ఇల్లు కూడా కోతకు గురైంది
- మన మత్స్యకారులకు న్యాయం జరగాలంటే, సముద్ర కొత్త జరగకుండా బలమైన నిర్మాణం జరగాలంటే బలమైన గొంతు వినిపించే ఉదయ్ తంగెళ్ళ గారిని లోక్ సభ కు పంపించాలి
- ఉప్పాడ చీరకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చి భాధ్యత మేము తీసుకుంటాం
- నన్ను గెలిపించండి, MLA అంటే పిఠాపురం MLA లా ఉండాలి అనేలా దేశమంతా మాట్లాడేలా, నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి అనేలా చేసి చూపిస్తా
- పిఠాపురం గొప్పతనం, సర్వమత పర్యాటక ప్రాంతంగా ప్రపంచానికి పరిచయం చేస్తాను
- ఇంత సముద్ర తీరం ఉంచుకుని సాయంత్రాలు నడవడానికి పర్యాటక ప్రాంతంగా లేదు, మీరు మమ్మల్ని గెలిపించండి అద్భుతమైన బీచ్ కారిడార్ గా ఉప్పాడ బీచ్ ను తయారు చేస్తాను
- 10 వేల ఎకరాల భూమి SEZ ల కోసం దారాదత్తం చేసారు, మన యువతకు ఉపయోగపడకుండా ఉంది, మన యువత భవిష్యత్తుకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకొస్తాను
- నేను సోషలిస్టును, నేను వకీల్ సాబ్ లో చెప్పింది అది నా నిజజీవిత విధానం
- మత్స్యకారుల గళం, చేనేత కష్టాలు నేను అసెంబ్లీలో వినిపిస్తాను, మీకు అండగా నిలబడతాను
- మీ సమస్యల పరిష్కారం నేను, మీ చేతిలో ఆయుధం నేను
- జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రి గారా? లేకపోతే వాజ్ పాయ్ గారా? 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి వైయస్ జగన్, సొంత చెల్లి జీవితం రోడ్డున పడేసిన వ్యక్తి, తన మనుషులతో తన చెల్లిని తిట్టించిన వ్యక్తి, 30 వేల మహిళలు అదృశ్యమైతే కనీసం మాట్లాడని వ్యక్తి జగన్
- మహిళలు ఆలోచించాలి, మహిళలను అగౌరవ పరిచే సంస్కృతి వైయస్ జగన్, ఆఖరికి తన సొంత చెల్లి శర్మిల గారిని అవమానించే దాక వచ్చాడు, రేపు మీ ఇంటి ఆడబిడ్డల వరకు వస్తాడు
- నేను మత్స్యకారుల గురించి, నా చేనేత కార్మికుల గురించి మాట్లాడాను, కానీ వైయస్ జగన్ వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేస్తాడు
- నేను ఒక పెద్ద హీరో స్థాయిలో ఉండి, కావాలంటే ప్రకటనల్లో నటిస్తే కోట్లు సంపాదించవచ్చు, కానీ నేను నా సంపాదన కంటే కూడా ప్రజల సమస్యల మీద మాట్లాడుతాను, చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను
- నా వ్యక్తిగత జీవితం గురించి ఈ మధ్య నా నాలుగో పెళ్ళాం వైయస్ జగన్ మాట్లాడుతున్నాడు, నా వ్యక్తిగత జీవితం గురించి నేను ఏరోజు అబద్ధాలు చెప్పలేదు, ఇబ్బందులు వచ్చాయి, విడిపోయాం, ఎవరి జీవితం వారు చూసుకుంటున్నాం, ఒకరు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని బిడ్డతో ఉన్నారు, ఇంకొకరు బిడ్డల భవిష్యత్తు చూసుకుంటూ ఉన్నారు, రాజకీయాలతో సంబంధం లేని వారి గురించి మాట్లాడకూడదు అనే సంస్కారం లేని వ్యక్తి జగన్
- నాకు కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి, మన ఉదయ్ తంగెళ్ళ జనసేన MP అని చెప్తే అమిత్ షా గారిని, ప్రధాని మోదీ గారిని కలవగలడు, కానీ చలమలశెట్టి సునీల్ కాదు కదా, వైయస్ జగన్ కూడా కలవలేడు, నేను కలిసి మాట్లడగలను
- గత ప్రభుత్వం సామాజిక భవనాలు నిర్మిస్తే, వైసీపీ పార్టీ ప్రభుత్వం వాటిని సచివాలయం భవనాలుగా మార్చారు, మేము అధికారంలోకి వచ్చాక మీకు సామాజిక భవనాలు పునర్నిర్మాణం చేస్తాం
- మత్స్యకార వలలు, బోట్లు, ఇంజన్ల పై గతంలో సబ్సిడీ ఉండేది, సరిగ్గా డీజిల్ సబ్సిడీ ఇవ్వట్లేదు, వేట నిషేదం సమయం లో భృతి సరిగ్గా ఇవ్వడం లేదు, మేము వచ్చాక ఎంతమంది వేటకు వెళ్తే ఎంతమందికి నిషేదం సమయంలో భృతి ఇస్తాం
- గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదట ఉప్పాడ వచ్చి ఇక్కడ సమస్యలపై ఫీల్డ్ విజిట్ చేస్తాను
- జగన్ బటన్ నొక్కా అంటాడు, మరి ఉప్పాడ హార్బర్ బటన్ ఏమైంది
- అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు జగన్ పేరు పెట్టుకున్నాడు, జై భీమ్ అంటారా జై జగన్ అంటారా ఆలోచించండి
- ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతీ ఒక్క అంశం నెరవేర్చేలా చూసే భాధ్యత నాది, నేను హామీ ఇస్తున్నాను
- అధికారంలోకి రాగానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 57 గ్రామాలు ఒక వారం పాటు తిరిగి సమస్యలు అర్దం చేసుకుని, పరిష్కారానికి ప్రణాళిక తీసుకొస్తాను
- ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, చదువుకునే ప్రతీ బిడ్డకు 15 వేలు చొప్పున ఇస్తాం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, రైతుకు 20 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, మెగా DSC విడుదల, BC లకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 24 నుండి 34 శాతానికి తీసుకొస్తాం
- చిరంజీవి గారి జోలికి రాకు సజ్జల రామకృష్ణ .. చిరంజీవి గారు పద్మవిభూషణ్ గ్రహీత, రాజనీకాంత్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అలాంటి వ్యక్తులను అనే అర్హత నీకు లేదు
- ఆధిపత్య అహంకార ధోరణి మంచిది కాదు సజ్జల రామకృష్ణ, చిరంజీవి గారి గురించి మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు
- ర్యాబిస్ వచ్చిన కుక్కల్లా వైసీపీ పార్టీ వాళ్ళు తయారయ్యారు, మమ్మల్ని తోడేళ్ళు అనేవారు ర్యాబీస్ వచ్చిన కుక్కలు
- నేను నా వ్యక్తిగత స్వార్థం చూసుకుంటే, వైసీపీ పార్టీ నీచుల చేత నా భార్య ను తిట్టించుకునేవాడిని కాదు, నేను ప్రజల కోసం మాటలు పడుతున్నాను
- గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు గుద్దేయండి, కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి