జనసేన ప్రస్థానంలో ప్రవాసాంధ్రుల ప్రోత్సాహం చాలా విలువైనది

జనసేన

• ఎన్.ఆర్.ఐ. జనసేన వర్చువల్ సమావేశంలో శ్రీ కె. నాగబాబు
జనసేన పార్టీ ప్రస్థానంలో ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళల ప్రోత్సాహం చాలా విలువైనదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం మనందరం గత పదేళ్లుగా పడుతున్న కష్టానికి తగిన ఫలితాలు చూడ బోతున్నామని అన్నారు. ఎన్.ఆర్.ఐ. జనసేన వర్చువల్ సమావేశంలో పిఠాపురం నుండి శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయని అన్నారు. వైసీపీ నాయకుల చేష్టలకు, దుశ్చర్యలకు విసిగి పోయినట్లు ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తున్నారని తెలిపారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని అఖండ మెజారిటీ సాధించడంలో భాగస్వాములు అవ్వాలని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్