- ఎవరికి అన్యాయం జరిగినా నేనున్నానని అక్కడకు వస్తారో అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు
- నాకు అనుభవం ఉంది – పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది, వైసీపీ పార్టీ కొట్టుకుని పోవడం ఖాయం. ప్రజా గళానికి వారాహి తోడైంది, అహంకారాన్ని బూడిద చేస్తుంది
- రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పిన వ్యక్తి, చేసి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014 లో NDA కూటమి పశ్చిమ గోదావరి జిల్లాలో 15/15 సీట్లు గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుదు మళ్ళీ NDA కూటమిగా కలిసి వచ్చాం, వైసీపీపార్టీ కి డిపాజిట్లు కూడా రాకూడదు
- తణుకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్, బాపు గారు లాంటి గొప్ప చిత్రకారుడు, భారతానికి శ్రీకారం చుట్టిన నన్నయ పుట్టిన నేల, ఇస్రో కు ఫ్యూయల్ అందించిన నేల, అలాంటి నేల నేడు వైసీపీపార్టీ పాలనలో అవినీతికి వేదికైంది
- వారాహి యాత్రలో చెప్పాను, ఒక్క రైతు ధాన్యం తడిచిపోయింది, మొలకలు వచ్చాయి అని మంత్రికి చెప్తే మొలకలు రాక ఏమొస్తాయి అని చీత్కారంగా మాట్లాడిన వ్యక్తి మంత్రి, అన్నం పెట్టే రైతును ఇలా మాట్లాడిన అతను, అతని కొడుకు పూర్తిగా ఇక్కడి రాజకీయాల నుండి నుండి తుడిచిపెట్టుకుపోవాలి
- పోలవరం ప్రాజెక్టు అయిందా అని మంత్రిని అడిగితే డ్యాన్సులు చేస్తాడు, ఓలమ్మి తిక్కరేగిందా అంటాడు, పునరావాసం గురించి అడిగితే అబ్బనీ తియ్యని దెబ్బ అంటాడు మంత్రి అంబటి రాయుడు
- రాష్ట్రంలో వైసీపీపార్టీ పోవడం కోసం ఎన్నో త్యాగాలు చేశాం, తణుకులో అభ్యర్థిని ప్రకటించిన తరవాత కూడా వెనక్కు తగ్గాం, సొంత అన్నయ్య నాగబాబు గారికి టిక్కెట్ ప్రకటించి కూడా క్షమాపణ చెప్పి BJP కోసం తప్పుకున్నాం, ఇదంతా రాష్ట్ర ప్రజల కోసమే
- జిల్లాగా ఏర్పడ్డాక ఇక్కడ ఉన్న హాస్పిటల్ లో రోగుల భోజన బకాయిలు 2 కోట్ల రూపాయల బకాయిలు తీర్చలేదు. దోపిడీ మీద ఆశ ఉన్నోడు ప్రజల అవసరాలు ఏం తీరుస్తాడు
- మాకు అధికారం లేకపోతే ఏం జరగదు, కానీ మేము మీ భవిష్యత్తు కోసం కలిసి వచ్చాం, ఒక రైతుకు ధాన్యం మొలకలు పోతే నష్టపోతాడు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుడ్ని, 5 సంవత్సరాల్లో DSC నోటిఫికేషన్ ఇవ్వలేదు
- జగన్ 70 వేల పోలీస్ కుటుంబాలకు TA,DA లు ఇవ్వలేదు, రోడ్లమీద రక్షణ కల్పించే పోలీసు వారిని రోడ్డున పడేశాడు వైసీపీ
- ఇక్కడ TDR బాండ్ల సొమ్ము దోచుకుని వెళ్లి హైదారాబాద్ బాలా నగర్ లో స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు మంత్రి, కనీసం ఆ అవినీతి సొమ్ము ఇక్కడ పెట్టుబడి పెట్టినా స్థానికులకు ఉపాధి వచ్చేది
- నేను 2021 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడాదు అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు గారు జైల్లో ఉన్నా సరే నేను పొత్తు ప్రకటించి రాష్ట్రం కోసం నిలబడ్డాను
- నేను చాలా తగ్గాను, మన ప్రజలు బాగుపడాలని మన అభ్యర్థులను కూడా వెనక్కి తీసుకున్నాను, కేవలం ప్రజల బాగు కోసమే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా నాకు తెలిసిన వ్యక్తిని
- నాకు చంద్రబాబు గారి మీద, ఆయన అనుభవం మీద గౌరవం ఉంది. నేను ఉద్ధానం సమస్య అయాన్ దగ్గరకు తీసుకెళ్తే 24 గంటల్లో బృందాన్ని పంపించి చర్యలు మొదలు పెట్టారు
- రైతు ఏడుస్తూ ఉంటే రైతును అవమానిస్తావా? నీలాంటి వారిని ఇక్కడి నుండి పంపించేయాలి, కనీసం నా నోటి నుండి పేరు ఉచ్చరించే అర్హత కూడా ఆ మంత్రికి లేదు
- జనసేన రోడ్ల మీదకు వచ్చి ఇక్కడ జరిగిన తప్పులపై పోరాడింది, నా జనసైనికుల మీద పడిన దెబ్బ మర్చిపోలేదు
- తణుకు పారిశ్రామికంగా ఎందుకు వృద్ధి చెందడం లేదు, ఎందుకు యువత గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు? అలా వలసలు వెళ్ళే పరిస్థితులు ఆపాలి
- అందరూ పేదల గురించి, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడతారు తప్ప మధ్యతరగతి వ్యక్తుల గురించి ఎవరూ మాట్లాడరు, నేను ఈ సభా ముఖంగా మధ్యతరగతి ప్రజలను గుర్తించాలని చంద్రబాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను
- CPS ఎంత క్లిష్టమైన అంశం అయినప్పటికీ అసెంబ్లీకి రాగానే దీనిపై మాట్లాడతాను, అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు దానిని పరిష్కరించాలని ఈ సందర్భంగా కూటమి భాగస్వాములకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను
- ఇక్కడున్న మంత్రి, ఆయన కొడుకు వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీ మన అందరికీ తెలుసు, కలుగులో ఎలకల్లా దాకున్న వారిని బయటకు లాగుదాం, పంపించేద్దాం
- సగటు మనిషి ఆవేదన జనసేన
- రాష్ట్రానికి 10 పాయింట్స్ ఫార్ములా గా ప్రజల్లోకి వస్తున్నాం, చిట్టచివరి పొలానికి కూడా నీరు అందాలి, ప్రతీ ఒక్కరికీ న్యాయం జరగాలి, రాష్ట్రం అభివృద్ది జరగాలి అనేదే మా లక్ష్యం