- ఈరోజు అంబేద్కర్ గారి జయంతి, రాజ్యాంగంపై ఉన్న నమ్మకం, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని నిలబడిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సరే ఆయన మాత్రం బలంగా ప్రజల కోసం నిలబడ్డారు
- నేను శ్రీ పవన్ కళ్యాణ్ గారితో 7 ఏళ్లుగా ఉన్నాను, ఏరోజు మా స్వార్థం కోసం మేము ఆలోచించలేదు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం మాత్రమే ఆలోచించాం
- 10 యేళ్లు తెనాలి శాసన సభ్యునిగా ఉండి నేను చేసిన అభివృద్ది, అందించిన సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మరోసారి ఆ అభివృద్ది చేయడం కోసం వచ్చాను
- మన NDA ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము
- ముస్లిం వర్గాలు ఇప్పటికీ ఎక్కువగా చేతివృత్తులు చేసుకుంటూ ఎదిగే అవకాశాలు లేవని చెప్పారు, వారికి స్కిల్స్ నేర్పించే భాధ్యత తీసుకుంటాను
- SC సోదరులు ఇక్కడ బరియల్ గ్రౌండ్ సమస్య నాకు చెప్పారు, బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసే భాధ్యత నాది
యాదవ, నాయి బ్రాహ్మణ, BC వర్గాల వారు కమ్యూనిటీ భవనం కావాలని అడిగారు, ఏర్పాటు చేసే భాధ్యత నాది అని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో హామీ ఇస్తున్నాను - కొల్లిపర మండల రైతులకు బిల్డింగ్ కట్టిస్తామని చెప్పాడు వైయస్ జగన్ అగ్రికల్చర్ మార్కెట్ కోసం 5 కోట్లు ఇస్తానని చెప్పాడు, షాదీ ఖానా ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను
- తెనాలి లో ఆఖరికి కిల్లి కోట్లలో కూడా గంజాయి లభించే స్థాయికి వెళ్ళింది వైసీపీ పార్టీ ప్రభుత్వ హయంలో, మేము అధికారంలోకి వచ్చాక బలమైన లా & ఆర్థర్ వ్యవస్థ తీసుకొస్తాం
- తెనాలి అభివృద్ది కోసం, మన భవిష్యత్తు కోసం మీరు NDA కూటమికి ఓటు వేయాలి
- విదేశాల్లో సంపాదించి, తన ప్రాంతానికి ఖర్చుపెట్టడానికి వచ్చిన వ్యక్తి మన NDA కూటమి తరపున నిలబడ్డ MP అభ్యర్థి పెమ్మసాని చంద్ర శేఖర్ గారు, ఆయనను గెలిపించాలని కోరుకుంటున్నాను
- తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాంటి నిజాయిపరుడైన వ్యక్తిని తిట్టించింది వైసీపీ ప్రభుత్వం, స్వార్థం లేని మనిషి ఆయన, ఆయన ముందు ప్రమాణం చేస్తున్న వచ్చే 30 ఏళ్లలో కూడా అవినీతి చెయ్యను అని మాటిస్తున్నాను, జై పవన్ కళ్యాణ్ – తెనాలి వారాహి విజయ భేరి సభలో తెలుగుదేశం గుంటూరు MP అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
- Pawan Kalyan speech:
ఆంధ్రా ప్యారిస్ గా పిలవబడే, వెనిస్ నగరంలా కాలువలలో ఉండే తెనాలి పట్టణం వచ్చిన సందర్భంగా దారిపొడవునా స్వాగతం పలికిన ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు, పెద్దలు ఆశీర్వాదాలు అందించారు - వచ్చేనెల ఈ సమయానికి ఎన్నికలు అయిపోయి, వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ఉంటాం
- 2014 నుండి ఈరోజు వరకు దశాబ్ద కాలంలో ఎంతోమంది వచ్చారు, పార్టీలు పెట్టారు, వెళ్లారు, కానీ ఒక్క ఎంఎల్ఏ లేకపోయినా దశాబ్ద కాలం పాటు పార్టీ బలంగా నడపటానికి కారణం నా జనసైనికులు, వీరమహిళలు
- ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, తప్పూ చేసిన వారిని కిందకు దించే హక్కు ఆయన మనకు కల్పించారు, ఆ హక్కును మనం ఉపయోగించడం లేదు, ఈరోజు ఒకరి మోచేతి నీరు తాగడానికి సిద్ధపడుతున్నారు, అందుకు కాదు మనకు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది
- జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు, పేదలకు తానే న్యాయం చేస్తున్నాడు అంటాడు, నిజంగా అదే నిజం అయితే ఈరోజు జనసేన – బీజేపి – టీడీపి కలిసి వచ్చేవి కాదు
- అధికారంలోకి వచ్చిన వెంటనే భావన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు దోచేసిన వ్యక్తి వైయస్ జగన్ఇసుక దొరక్కుండా చేసి 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశాడు
- రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి, మద్యపాన నిషేదం అని చెప్పి, సారా వ్యాపారం చేసుకునే సారా వ్యాపారి, 16 కంపెనీలలో ౩ కంపెనీలు తన వారివే, కల్తీ మద్యాన్ని తాగిస్తున్నాడు వైయస్ జగన్
- అక్కా, చెల్లి అని కబుర్లు చెప్పే వైయస్ జగన్ రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అయితే కనీసం ఒక మీటింగ్ పెట్టి మాట్లాడలేదు
- వైసీపీ ప్రభుత్వం ఇచ్చే కల్తీ మద్యం వల్ల 10 సంవత్సరాల్లో పాడవ్వాల్సిన ఆరోగ్యం సంవత్సరంలో పాడవుతుంది
- జగన్ మనుషులు పెద్దిరెడ్డి కుటుంబం, సజ్జల కుటుంబం ఇసుకను ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తూ బలిసి కొట్టుకుంటున్నారు
- కూటమి ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో CPS పై చర్చ పెట్టాలి, సంవత్సరంలోపు పరిష్కరించాలి అని నేను కూటమి నాయకులు చంద్రబాబు గారితో కూడా చెప్పాను, మీ భవిష్యత్తుకు నేను భరోసా కల్పిస్తాను, ఉద్యోగుల పెన్షన్ మీకు అండగా అందేలా చూస్తామని ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా మాటిస్తున్నాను
- అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా సమస్యల పై డిబేట్లు జరిగేలా చూస్తాము
- పవిత్రమైన టీచర్లను మద్యం షాపులు వద్ద కాపలాకు పెట్టించాడు, అకారణంగా సమస్యల పరిష్కారం గురించి అడిగినందుకు అంగన్వాడీ లను కొట్టించాడు, చిన్నప్పుడు శివ శివాని స్కూల్లో పరీక్షా పేపర్లు కొట్టేసిన వ్యక్తి వైయస్ జగన్
- ఇక్కడ రైతాంగ సంక్షేమం కోసం కృషి చేస్తాం, చెక్ డ్యాముల నిర్మాణం చేస్తాం, అసలైన పాలన ఎలా ఉంటుందో తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా చేసి చూపిస్తాం
- ఓటమి చూడగానే అందరూ పారిపోతారు, కానీ నేను 2 చోట్ల విడిపోయినా బలంగా నిలబడ్డాను, వకీల్ సాబ్ లో చెప్పినట్లుగా, మీరు నాతో ఉన్నా, లేకపోయినా నేను మీకోసం కూలీ లా పనిచేస్తాను, అధికారంలో ఉంటే మరింత బలంగా పనిచేస్తాను
- ఇక్కడున్న బంగారు వ్యాపారులకు అండగా నిలబడతాము, వైశ్య సోదరులపై దాడులు జరగకుండా , వ్యాపారాలు సజావుగా జరిగేలా చూస్తాము
నేను ఈరోజు ఇంత జ్ఞానం సంపాదించాను అంటే చిన్ననాటి నా వైశ్య మిత్రుడు అందించిన పుస్తకాలే కారణం, మీకు అండగా జనసేన ఉంటుంది - ప్రజల పొలాల పాస్ పుస్తకాలపై వైయస్ జగన్ షిక్కటి చిరునవ్వుతో పోటోలు, రాళ్లపై జగన్ బొమ్మలు, రాష్ట్రం తన సొత్తు అనుకుంటున్నాడు, నువ్వు క్రిందపడే రోజు మండలం రోజుల కంటే తక్కువ ఉంది, ఈజిప్ట్ లో హోస్నీ ముబారక్ ను తరిమికొట్టినట్లు తరిమికొడటారు జాగ్రత్త
- తెనాలి డెల్టా పరీవాహక ప్రాంతం, అప్పట్లో నాదెండ్ల మనోహర్ గారు పైప్ లైన్ వేయించారు, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రతీ ఇంటికి త్రాగునీరు అందించే భాధ్యత తీసుకుంటాము
- తెనాలి – విజయవాడ రోడ్లు బాగాలేవు, నందివెలుగు – పెద్దరావూరు 4 లైన్ హైవే పూర్తిచేస్తాము, నాదెండ్ల మనోహర్ గారు పట్టువదలని విక్రమార్కుడు, ఆయన సారథ్యంలో ఖచ్చితంగా ఇది సాధ్యం
- అమరావతి రాజధాని గా ఉండి ఉంటే మంచి అభివృద్ది జరిగేది. అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం
- తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించిన వెంటనే, కొల్లిపర లో కృష్ణా నడిపైన చెక్ డ్యాం నిర్మిస్తాం, ముంపు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం, రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం
- చుట్టూ ఉన్న నీటి కాలువలు అందంగా ఉండాల్సింది పోయి దుర్గంధం వస్తుంది, అధికారంలోకి రాగానే వాటిని బాగుచేస్తాం
- ప్రభుత్వాసుపత్రి సమస్యను పరిష్కరిస్తామని, ఫెసిలిటీలు కల్పిస్తాం, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం
- యువతలో నైపుణ్య గణన జరగాలి, వారికి వారి నైపుణ్యం బట్టి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- పేద, మధ్యతరగతి మహిళలు వచ్చి మా అభిప్రాయం తీసుకోరా అని చాలామంది అడిగారు, రాజకీయాల్లో మా అభిప్రాయానికి అవకాశాలు కల్పించాలి, కూటమికి మద్దతు ఇస్తాం అని చెప్పారు. వారికి ప్రోత్సాహకాలు అందిస్తాం, వంటింటికి పరిమితం కాకుండా మీ ఆర్థిక స్వేచ్చ కోసం మీకు ఇంటికి వచ్చి స్కిల్స్ నేర్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- మహిళలపై ఎవరు దాడులు చేసినా, కించపరిచినా, SC, ST అట్రాసిటీ చట్టం తరహా బలమైన చట్టాలు తీసుకొచ్చి రక్షణ కల్పిస్తాం
- మా అన్నయ్య శ్రీ చిరంజీవి గారు మొన్న నన్ను పిలిచి, నువ్వు ప్రజల కోసం, కౌలు రైతులకు సాయం చేస్తున్నావు, నీ పోరాటం ఆగకూడదు అని 5 కోట్లు ఇచ్చి ఆశీర్వదించారు. అంతేకాకుండా కొడుకు శ్రీ రామ్ చరణ్ ను కూడా సాయం చేయమని చెప్పారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
- వాలంటీర్లకు 5 వెలు ఇచ్చి వదిలేశారు, అదే నేనైతే నీకు ఏం చేయాలని ఉంది, ఏం నేర్చుకుంటావ్, నువ్వు ఎలా అడుగుతావ్, నీకు ఏం సహాయం కావాలి అని అడిగి వారి ప్రతిభ గుర్తించి, వారికి ఎదిగే అవకాశాలు కల్పించేవాడిని, 5 వేల కోసం జీవితాలు తాకట్టు పెట్టకుండా చూసేవాడిని
- మా అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఇప్పించడం వల్ల నేను ఈరోజు ఈ స్తాయికి చేరాను, అలాంటి ప్రోత్సాహం నేను యువతకు ఇవ్వాలని అనుకుంటున్నాను
- 2024 లో వైయస్ జగన్ తన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడు, నేను రాష్ట్ర యువత కోసం, మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను
- క్రికెటర్ అంబటి రాయుడు గారు అండర్ 19 లో డబుల్ సెంచరీ కొట్టిన వ్యక్తి, వారి తల్లితండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగిన వ్యక్తి, అలాంటి ప్రోత్సాహం మీకు ఉండాలి కదా
- మొన్న IPL సాన్ రైజర్స్ టీం నుండి 20 సంవత్సరాల నితీశ్ కుమార్ రెడ్డి అనే కుర్రాడు 37 బంతుల్లో 64 రన్స్ చేశాడు, అలాంటి టాలెంట్ ఉంది, ప్రతిభను ప్రోత్సహిస్తే అలా అవుతారు, మన యువతలో, కానీ వారికి ప్రాక్టీస్ చేసుకోవడానికి సరైన స్టేడియం, జాగింగ్ స్థలాలు కూడా లేవు
- ప్రజలు బాగుండాలి అని కోరుకునే నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్ర శేఖర్ గారు లాంటి వారు గెలవాలి, వారి ద్వారా మనకు మంచి జరిగిద్ది
- దళితులకు 27 పథకాలు రద్దు చేశాడు వైయస్ జగన్, 4,163 కోట్ల రూపాయల నిధులు డైవర్ట్ చేశాడు, ఈరోజు వరకు ఆ నిధులు ఇవ్వలేదు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు జగన్ విదేశీ విద్యా పథకం అని మార్చాడు, అంబేద్కర్ గారి స్ఫూర్తికి తూట్లు పొడిచాడు
- నిజంగా అంబేద్కర్ గారి స్ఫూర్తి వైయస్ జగన్ కు ఉండి ఉంటే దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి అండగా నిలబడేవాడు కాదు
- BC కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇస్తానని చెప్పి నిధులు ఇవ్వలేదు వైయస్ జగన్
- జగన్ కు రాయి తగిలి గాయం అయితే రాష్ట్రానికి గాయం అయినట్లు మాట్లాడుతున్న వైసీపీ పార్టీ నాయకులు, బాపట్ల దగ్గర 15 ఏళ్ల పసివాడు తన అక్కను ఏడిపించద్దు అన్నందుకు చెరుకు తోటలోకి తీసుకెళ్ళి వైసీపీ పార్టీ కార్యకర్త నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపితే అప్పుడు రాష్ట్రానికి గాయం అవ్వలేదా? 30 వేల మహిళలు మిస్సింగ్ అయితే రాష్ట్రానికి గాయం అవ్వాలేదా? మీకు రాయి తగిలితే మాత్రం రాష్ట్రానికి గాయం అయినట్లా
- 34 శాతం ఉన్న BC స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, 24 శాతానికి తగ్గించి బిసి లను అధికారం నుండి దూరం చేసిన వ్యక్తి వైయస్ జగన్
- ఎన్నికలు రాగానే వైయస్ జగన్ కు ఏదో ఒక గాయం అవుతుంది, లేదా ఎవరో ఒకరు చనిపోతారు/చంపేస్తారు, పోయినసారి అత్యంత బలమైన CISF సెక్యూరిటీ ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడి కత్తితో గాయం చేశారట
- జగన్ కు గాయం అవుతుంటే, ఆయన సెక్యూరిటీ ఏం చేస్తుంది? మీ మీద గులకరాయి పడితే రాష్ట్రానికి గాయమా? చంద్రబాబు గారిపై రాళ్ళ వర్షం కురిపిస్తే అప్పుడు ఎమైపోయారు మీరు
- జగన్ పై దాడి గురించి నన్ను స్పందించమని మా నాయకులు అడిగారు, కానీ అసలు నిజంగా దాడి జరిగిందా, ఈయనే దాడి చేసుకున్నాడా, లేదా కోడి కత్తిలా డ్రామానా నాకు తెలియలేదు, కరెంట్ ఎందుకు తీసేసారో అర్దం కాలేదు, అందుకే స్పందించలేదు, నాన్న పులి కథలా ఎన్నిసార్లు నమ్మాలి, నమ్మకం పోయింది, ఈ సింపతీ డ్రామాలు ఆపాలి
- ఇంత ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఉండి ఎందుకు ఎవరు రాయి వేశారో పట్టుకోలేదు? 5 ఏళ్లపాటు కోడి కత్తి కేసులో శ్రీను అనే యువకుడిని జైల్లో పెట్టారు
- వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికేసి చంపేస్తే గుండెపోటు అని చెప్పిన వ్యక్తులు వైసీపీ పార్టీ వాళ్ళు, ఆయన కూతురు డా సునీత గారు, జగన్ సొంత చెల్లి న్యాయం చేయండి అని అడిగితే ఆమెను కూడా కించపరిస్తున్న వ్యక్తి వైయస్ జగన్
- CBI వాళ్ళు వస్తే కనీసం హాస్పిటల్ లోపలికి వెళ్ళనివ్వలేదు వైయస్ జగన్ , అందుకే ఇలాంటి దుర్మార్గుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే కూటమి గా వచ్చాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పేది
- సుగాలి ప్రీతి లాంటి బిడ్డ కు న్యాయం చెయ్యలేని ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం, అలాంటి వారి నుండి రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఆవేదన నాది
- ఇస్లాం సమాజ ప్రజలకు ఒక్కటే విన్నపం, నేను బీజేపి తో ఉన్నానని నాకు ఓటు వెయ్యం అని కొందరు అంటారు, ఎలా ఐతే వైయస్ జగన్ కు రాయి తగిలితే ప్రధాని నరేంద్రమోదీ గారు త్వరగా కోలుకోవాలి అని చెప్పారు, మరి జగన్ కు కూడా ఓటు వెయ్యకూడదు కదా? నేను మిమ్మల్ని ఓటు బ్యాంక్ గా వాడుకునే వ్యక్తిని కాదు, మీకు నిజంగా అండగా నిలబడే వ్యక్తిని, మీకు స్కిల్స్ నేర్పించి ఉపాధి కల్పిస్తామని చెప్తున్నాం, అండగా నిలబడండి
- గుంటూరు MP గా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రబాబు లాంటి వ్యక్తి పార్లమెంటుకు వెళ్ళాలి, విదేశాల్లో సంపాదించి, తన ప్రాంతంపై మమకారంతో వచ్చాడు, ఆయనకు ప్రజల కోసం పనిచేయడం తప్ప వేరే ఆలోచన లేదు, ఆయనకు మన సర్వస్వం ధార పొసైనా సరే గెలుపు ఇవ్వాలి
- తెనాలి అసెంబ్లీ స్థానానికి మన నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించాలని, 10 యేళ్లు ఎంఎల్ఏ గా అనుభవం ఉన్న వ్యక్తి, ఉమంది రాష్ట్రానికి స్పీకర్ గా వ్యవహరించిన వ్యక్తి, నియోజకవర్గంలో సంపూర్ణ అభివృద్ది చేసిన వ్యక్తి ఆయన, 13 వంతెనలు నిర్మించిన వ్యక్తి, నందివెలుగు – పెద్దరావురు హైవే నిర్మించిన వ్యక్తి ఆయన
- మనోహర్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్, అందుకే ఆయన క్రీడలకు, యువతకు ప్రోత్సాహన్నందించే వ్యక్తి ఆయన
- తెనాలి అభివృద్ది కోసం ఎంతో కృషిచేసిన వ్యక్తి, పార్టీకి, నాకు వెన్నుముక గా ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను
- పోలవరం గురించి మాట్లాడకుండా, అబ్బనీ తియ్యని దెబ్బ అని రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే వ్యక్తి మన ఇరిగేషన్ మంత్రిగా ఉండటం దౌర్భాగ్యం, అలాంటి వ్యక్తులు, బూతులు తిట్టే వ్యక్తులను ఓడిద్దాం
- 10 ఏళ్లుగా నేను ఏ విజయం లేకుండా తిట్లు, అవమానాలు పడుతూ ఉన్న వాడిని, ఒక్కసారి గెలుపును చూపించండి, మీకు ఏ స్థాయిలో పని చేయగలనో అర్దం చేసుకోండి