• భద్రత కారణాలను నాయకులు, శ్రేణులు దృష్టిలో ఉంచుకోవాలి
విశాఖ నగరం వేదికగా మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానున్న క్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రతాపరమైన నిబంధనలను నాయకులు, శ్రేణులు పాటించాలని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. ఇందులో భాగంగా వారాహి విజయ యాత్రలో గాని, సభా వేదికల వద్దగాని క్రేన్లతో భారీ దండలు, గజమాలలు వేయడం లాంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టవద్దు. యాత్ర వెళ్లే మార్గంలో భారీ క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల వాహన శ్రేణి సాఫీగా సాగడం లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి భద్రతకు భంగం వాటిల్లకుండా వారాహి విజయ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సహకరించాలని శ్రీ హరిప్రసాద్ కోరారు.