నిడదవోలు – హైలెట్స్

  • ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక 5 మంది వ్యక్తుల చేతులోకి రాష్ట్రం నలిగిపోతుంది, అధికారం, పెత్తనం అంతా వారి చేతిలోని ఉంది
  • 5 మంది వ్యక్తులు 5 కోట్ల మంది ప్రజలను అణచివేస్తుంటే అందరూ కలిసి రావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని డిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్రమోది గారి నాయకత్వం, ఇక్కడ చంద్రబాబు గారి అనుభవం, 5 సంవత్సరాలుగా వైసీపీ దాడులు, బెదిరింపులు తట్టుకుని నిలబడి జనసైనికులు, వీరమహిళలు కలుపుకుని వైసీపీ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చాం
  • ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి దిశగా వెళ్ళాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకరికొకరం తగ్గించుకుని, సంస్థాగతంగా బలంగా ఉన్న చంద్రబాబు గారి టీడీపి కూడా తగ్గించుకుని ఉమ్మడిగా నిలబడ్డాం
  • రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి
  • నిడదవోలు నియోజకవర్గ సమస్యలను మన అభ్యర్థి కందుల దుర్గేష్ గారు గెలిచిన వెంటనే సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం.
    నిడదవోలు అభివృద్ధికై జనసేన ప్రణాళికలు:
    చిన్న కాశీ రేవుకు వెళ్ళే మార్గం పునరుద్ధరణ చేయడం, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడం, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, గోదావరి జలాలు నిడదవోలు పట్టణ ప్రజలకు అందించడం, యువతకు ఇండోర్ స్టేడియం నిర్మాణం, కొత్త వంతెన నిర్మాణం, కంసాలి పాలెం – మాధవరం మధ్య బ్రిడ్జి పునరుద్ధరించడం, అంజనేయపురం – సింగవరం గ్రామాల్లో నిర్మించిన TIDCO ఇళ్లు అందించడం, పెరవల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హైవే వద్ద ఉన్న ఇబ్బంది పరిష్కరిస్తాం, కాలూరు – తణుకు – నడుపల్లి రోడ్డు ఆధునీకరణ, ముక్కాల నుండి పెదవలూరు వరకు రోడ్డు ఆధునీకరణ, మర్రి పాలెం బ్రిడ్జి వెడల్పు, నిడదవోలు నియోజకవర్గంలో 3 నెలల్లో రోడ్ల మరమ్మత్తులు, తరవాత కొత్త రోడ్లు వేస్తామని మాటిస్తున్నాం
  • ప్రతీ చేతికి పని – ప్రతీ చేనుకు నీరు అందించడం, బీసీల భవిష్యత్తుకు అండగా నిలబడటం మా కూటమి లక్ష్యం
  • పోలవరం గురించి అడిగితే రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే మంత్రులు ఉన్నారు, ఏదైనా అడిగితే మాపై, చంద్రబాబు గరియాపి, పురంధరేశ్వరి గారిపై భూతులతో విమర్శలు చేస్తారు వైసీపీ పార్టీ నాయకులు
  • ప్రజా సమస్యలపై మనం ప్రశ్నిస్తే ఏ ఒక్క దానిపై కూడా సమాధానం చెప్పే ధైర్యం లేదు, బూతులు తిడతా ఉంటారు, గుర్తుపెట్టుకోండి వచ్చేది మా కూటమి ప్రభుత్వమే, ప్రతీ ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటాం జాగ్రత్త
  • వివేకానంద రెడ్డి హత్యకేసు నిందితులను వెనకేసుకుని వస్తున్నాడు, సొంత చెల్లెళ్ళకే గౌరవం లేదు, గోడకేసి కొట్టినోడు, సగటు ఆడపిల్లలు లెక్కా? 3 వేల మంది ఆడబిడ్డలు మిస్సింగ్ అయితే ఈరోజు వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 
  • 151 మంది ఎంఎల్ఏ లు, 30కి పైగా పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ జరపలేదు ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు చూడని ప్రజా సమస్యలపై అద్భుతమైన డిబేట్లు జరుగుతాయి
  • జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సమస్యలపై బలంగా, రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేస్తామని మాటిస్తున్నాను

 

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్