వారాహి యాత్ర సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో శ్రీ లక్ష్మణరావు అనే పారిశుద్ధ్య కార్మికుడు జీవీఎంసీ 37వ డివిజన్ లో చెత్త సేకరించే సందర్భంలో వారాహి యాత్ర గురించి ప్రచారం చేశాడు. ఈ అంశాన్ని సాకుగా చూపి జీవీఎంసీ అధికారి శ్రీ లక్ష్మణరావును విధులు నుంచి తొలగించారు. విషయం తెలుసుకున్న శ్రీ పవన కళ్యాణ్ గారు విశాఖ జనవాణి కార్యక్రమంలో శ్రీ లక్ష్మణరావుకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు. మరో ఉద్యోగం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.