- రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి బొండాం ఎంత తీయగా ఉంటుందో అంత తియ్యగా ఉంటుంది, మబ్బులు కమ్మిన చోట, వెలుతురు లేని, గాడాంధకారం ఉన్న చోట వెలుగురేఖ రాజోలు
- ఇంకా మనకు 18 రోజులు మిగిలి ఉంది, 5 ఏళ్లుగా రోడ్ల మీద ఉన్నాం, మనవల్ల రాజకీయం అవ్వదు అని అందరూ అన్నా సరే మీ మీద నమ్మకంతో నేను 10 ఏళ్లుగా జనసేనను నిలబెట్టాను, గెలిపించుకోవాలి
- 2022 లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు, రైతులు ఎకరానికి 25 వేలు, కౌలు రైతులు 50 వేలు నష్టపోతున్నాం అని చెప్పారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరిగా అమ్మకాలు జరగట్లేదు, అమ్మినా డబ్బులు సకాలంలో ఇవ్వడం లేదు, పంట కాలవల పూడిక తీయడం లేదు, మరమ్మత్తులు చేయడం లేదు, కాలవ గట్టులను డంపింగ్ యార్డు గా మార్చింది వైసీపీ ప్రభుత్వం
- అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, దేవర వరప్రసాద్ గారు ఎంఎల్ఏ అభ్యర్థి అయినప్పటికీ, రాజోలు రైతుల సమస్యల పరిష్కారానికి నేను భాధ్యత తీసుకుంటాను
- ధవళేశ్వరం నుండి అంతర్వేది వరకు ఉన్న నీటి కాలవల్లోకి వ్యర్థాలు చేరి పూడిక పెరిగిపోయింది, ఈ సమస్య మేము పరిష్కరించి రైతులకు అండగా ఉంటాం
- ఇక్కడ MLA రాపాక 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు తప్ప రైతుల కష్టాలు తీర్చలేకపోయాడు
- రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే కో ఆపరేటివ్ సంస్థలను నిర్వీర్యం చేశారు, రైతాంగానికి సంబంధం లేని MLC అనంత బాబును చైర్మన్ గా చేసారు, అతను దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తాడు
- వైసీపీ ప్రజల మధ్య గొడవలు పెట్టడం కోసమే అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో అవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టింది వైసీపీపార్టీ, ఆ గొడవల్లో కీలక వ్యక్తి ఇప్పుడు మంత్రి విశ్వరూప్ వెనుక ఉన్నాడు
- అంతర్వేది లో రథాన్ని తగలబెడితే తేనెటీగల పేరు చెప్పాడు వైయస్ జగన్, చిన్న గులకరాయి వేస్తే నిందితుడిని 2 రోజుల్లో పట్టుకున్నారు, అంతర్వేది రథం విషయంలో ఈరోజుకు నిందితులను పట్టుకోలేదు
- భీమ్లా నాయక్ సినిమా, వకీల్ సాబ్ సినిమా అడ్డుకోవాలని చూసిన వ్యక్తి వైయస్ జగన్, నేను వెళ్లి జగన్ ను బ్రతిమిలాడతాను అనుకున్నాడు, అవసరమైతే ఉచితంగా ఇంటర్నెట్ లో వదిలేసే వ్యక్తిని నేను, నా ఆత్మగౌరవాన్ని తగ్గించుకోను
- సఖినేటిపల్లి – నరసాపురం మధ్యలో వశిష్ఠ వారధి నిర్మిస్తాం, కోనసీమకు రైల్వే మార్గం తీసుకొస్తాం, టూరిజం అభివృద్ది చేస్తాం
- ప్రభుత్వం సంపద సృష్టించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అప్పుడే ప్రజలకు అప్పు చేయకుండా పథకాలు అందించగలం, మేము సంపద సృష్టించే విధానాలు తీసుకొస్తాం, సంక్షేమం తో పాటుగా అభివృద్ది చేసి చూపిస్తాం
- కేంద్రంలో మాట్లాడి DCI డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసేలా చూస్తాను, దిండి రిసార్ట్స్ కేరళ తరహా టూరిజం డెవలప్ చేస్తాం, అన్నా చెల్లెలు గట్టు టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం
- రాజోలు ను ONGC స్మార్ట్ సిటీగా చేస్తాం అని ముందుకు వచ్చినా సరే వైసీపీపార్టీ ప్రభుత్వం ముందుకు రాలేదు, మేము అధికారంలోకి వచ్చాక రాజోలు ను స్మార్ట్ సిటీ గా చేస్తాం
- ONGC, GAIL సంస్థల గ్యాస్ పైపు లైన్లు లీకేజి వల్ల విస్పోటనలు జరుగుతున్నాయి, వైసీపీ నాయకులు వారి నుండి కోట్లు తీసుకుని పట్టించుకోవడం మానేశారు, మేము ఈ సంస్థల ప్రతినిధులతో, కేంద్రంలో అమిత్ షా గారు, ప్రధాని మోదీ గారితో మాట్లాడి వీటికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం
- రాజోలు ఎంఎల్ఏ రాపాక అవినీతి
5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు, పేదల ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వం చేత అధిక ధరకు స్థలాలు కొనేలా చేసి డబ్బులు నొక్కేసాడు, ముంపు ప్రాంతాల్లో భూమి పేదలకు కేటాయించాడు, ఇసుక దోచేస్తున్నాడు, ఇనుమును వ్యాపారులను బెదిరించి తీసుకుంటున్నాడు, అంతర్వేది రథం దగ్దమైతే ఒక్క మాట మాట్లాడలేదు - 2019 లో ఫైర్ స్టేషన్ కావాలి అన్న వ్యక్తి వైసీపీపార్టీ లో చేరాక దాని గురించి మర్చిపోయాడు, కళాశాల భూములను 500 కోట్ల దోపిడీకి సిద్ధమయ్యాడు రాపాక
- బాబాయ్ ను గొడ్డలితో నరికించిన వాడిని భుజాన వేసుకుని తిరిగే వ్యక్తి వైయస్ జగన్, సొంత చెల్లి బట్టల ను చూసి వాటిపై కామెంట్స్ చేసే వ్యక్తి జగన్, సొంత చెల్లిపై నీచంగా మాట్లాడే వ్యక్తి జగన్, సొంత తల్లినే ఉపేక్షించనివాడు జగన్
- జగన్ అధికారంలోకి వస్తే మీ భూములు లాగేసుకుంటాడు, ఇప్పటికే పాస్ పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసేసి జగన్ ఫోటో వేసుకున్నాడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు, ఈసారి మీ భూములు తాకట్టు పెట్టేస్తాడు జాగ్రత్త
- ఈ నెల 30 న కూటమి మ్యానిఫెస్టో విడుదల
సూపర్ సిక్స్ లో 2 పథకాలు జనసేన ప్రతిపాదించినవే, మరో 4 పథకాలు మేము ప్రతిపాదించాం, అన్ని కలిపి 30నా మ్యానిఫెస్టో విడుదల చేసి అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తాం - అమలాపురం MP గా GMC బాలయోగి గారి అబ్బాయి హరీష్ గారికి సైకిల్ గుర్తు మీద, రాజోలు ఎంఎల్ఏ అభ్యర్థిగా దేవర వరప్రసాద్ గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అద్భుతమైన మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తున్నాను
- నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను, అక్కడ నుండి వైసీపీ కోటను బద్దలు కొడదాం, రాజోలు మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు పోటీ చేసిన ప్రతీ చోటా జనసేన – టీడీపి – బీజేపి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తున్నాను