- పరదాలరాణి వైయస్ జగన్ ను నిన్న కాకినాడ ఆదిత్య కాలేజ్ విద్యార్థులు ఇబ్బంది పెట్టారట, మన రాష్ట్రాన్ని ఏలే మహారాణి ఇవన్నీ మనసులో పెట్టేసుకుంటుంది, కొంచెం విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి, మహారాణి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది
- దేశంలో , రాష్ట్రంలో NDA ప్రభుత్వం రానుంది, యువత బంగారు భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తాం
- రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా NDA కూటమి తరపున బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, రాజానగరం అసెంబ్లీ అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, వారిని బలమైన మెజారిటీతో గెలిపించాలి
- అన్ని పార్టీల్లో నా అభిమానులు ఉన్నారు, మంచి స్థానాల్లో ఉన్నారు, వారు అంటే గౌరవం ఉంటుంది, కానీ వారు తప్పులు చేస్తుంటే, దౌర్జన్యాలు చేస్తుంటే, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం నేను సహించను, వారు నా అభిమానులైన సరే తప్పు అనే చెబుతాను
- రాజానగరం ఎంఎల్ఏ జక్కంపూడి రాజా పాలన ఎలా ఉంది? ఇక్కడకు విచ్చలవిడిగా గంజాయి, ఇసుక దోపిడీ, బ్లేడ్ బ్యాచ్ దాడులు జరుగుతున్నాయి, పచ్చని గోదావరి జిల్లాలోని బ్లేడ్ బ్యాచ్ రావడం అనేది స్థానిక MLA వైఫల్యం
- రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి ఇసుక తిన్నెలు ఎంతో అందంగా ఉండేవి, అనేక సినిమాల్లో ఇక్కడ పాటల షూటింగ్ జరిగేది, కానీ అవన్నీ కూడా ఇప్పుడు దోపిడీకి గురైపోయాయి, అడ్డగోలుగా డొచ్చేస్తున్నారు, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది
- నేను మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాను, ఇక్కడ మనకి చాలా చోట 27% పైగా ఓటింగ్ ఉంది, కొన్ని చోట్ల నెంబర్ 1 స్థానంలో ఉన్నా సరే ఇక్కడ తగ్గలో తెలిసిన వాడిగా తగ్గి కూటమిగా వచ్చాము. కారణం ఇంకోసారి వైసీపీపార్టీ ను భరించే స్థితిలో రాష్ట్రం లేదు, ఇంకో సారి రాకూడదు
- ఇంతమంది యువత ఇక్కడ ఉంటే కనీసం పారిశ్రామిక వాడ లేదు, మొన్న ఎన్నికలు వస్తున్నాయి అని శంకుస్థాపన చేసారు, 5 ఏళ్లుగా వైసీపీపార్టీ వారికి గుర్తు రాలేదు
- మేము యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాము, చాలా మంది ఇక్కడ తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు ఉన్నారు, వచ్చే ఎన్నికల సమయానికి దాదాపు 25 యేళ్లు వస్తాయి, వారికి ఉపాధి అవకాశాలు కావాలి, సరైన ఉద్యోగాలు కావాలి, అందుకోసం భాధ్యత ఉన్న ప్రభుత్వం రావాలి, మీరు మా కులం, మా వాడు అని ఎమోషనల్ గా వైసీపీపార్టీ వారికి ఓటు వేస్తే వారు మీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు
- ఈ మధ్య వైయస్ జగన్ బాగా నన్ను తిట్టేస్తున్నాడు, బాగా కోపం వస్తుంది, నన్ను తిడితే, రెచ్చగొడితే నేను తిడతాను అనుకుంటున్నాడు, జగన్ నన్ను తిడితే కోపం రాదు నాకు, నా వారి మీద ఒక్క ఈగ వాలినా, దళిత డ్రైవర్ ను చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కోపం వస్తుంది
- ఒక దళిత డ్రైవర్ ను చంపేసి, శవాన్ని డోర్ డెలివరీ చేస్తే నాకు భయంకరమైన కోపం వచ్చింది, అందరూ దూరం పెట్టే రెల్లి కులస్తులను గుండెలో పెట్టుకున్నాను
- రాజానగరం అనగానే రాష్ట్రంలోనే అత్యంత గంజాయి వ్యాపారం, అత్యధికంగా క్రికెట్ బెట్టింగ్ ఇక్కడ జరుగుతుంది అని తెలిసింది, ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ ల ఆగడాలు జరుగుతున్నాయి అని తెలిసింది. ఐతే ఇవన్నీ జక్కంపూడి రామ్మోహనరావు లాంటి గొప్ప వ్యక్తుల పిల్లలు చేయడం దురదృష్టకరం. అలాంటి వ్యక్తి కొడుకులు ఎంతో భాద్యతగా ఉండాలి కానీ బ్లేడ్ బ్యాచ్ ను నడపడం ఏంటి
- జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుకులు గంజాయి వ్యాపారం, ఇసుక దోపిడీ, బ్లేడ్ బ్యాచ్, గూండా బ్యాచ్ నడిపే స్థాయికి వెళ్తే ఇంకా ఎవరి దగ్గరకు వెళ్తాం
- మన రాజానగరం నేల మీద పుట్టినవాడు, స్థానిక సమస్యలు తెలిసిన వాడు, ప్రజల కషలకు తోడుండే వాడు, కౌలు రైతుల కష్టాలు తెలిసిన వాడు మన బలరామకృష్ణుడు, ఆయన్ని మన మొదటి అభ్యర్థిగా ప్రకటించాను
- జక్కంపూడి రామ్మోహనరావు గారు అంటే నాకు చాల గౌరవం, కానీ వారి పిల్లలు వైయస్ జగన్ సహవాసం చేసి చెడిపోయారు
- గాదాల లో 46 ఎకరాల లే అవుట్, రాజానగరం లో 30 ఎకరాల లే అవుట్, రాజమండ్రి ఎయిర్ పోర్ట్ దగ్గర్లో 72 ఎకరాల లే అవుట్ వేశారు, వారు లే అవుట్ వేయడం తప్పు కాదు, కానీ వేరేవారు లే అవుట్ వేయాలంటే 15 శాతం కమిషన్ ఇవ్వాలి అంటున్నారు, అది తప్పు
- వీళ్ళు వేసిన 150 ఎకరాల పైన లే ఔట్లకు మౌలిక సదుపాయాలు ప్రజలకు ఖర్చుపెట్టాల్సిన డబ్బుతో వేసుకున్నారు
- నన్నయ యూనివర్శిటీ VC పదవికి కోట్ల రూపాయలు వసూలు చేశారు, డెంటల్ కాలేజ్ దగ్గర అవినీతి జరుగుతుంది
- జక్కంపూడి రామ్మోహనరావు గారు గొప్ప కార్మిక నాయకుడు, కానీ ఆయన పిల్లలు ఇసుక దోపిడీ చేసి, కార్మికుల పొట్ట కొట్టి సంపాదిస్తున్నారు ఇది చాల భాదాకరం
- కోరుకొండ దగ్గర ప్రభుత్వం చేత 600 ఎకరాల కొనిచ్చారు, ఎకరం 15 లక్షల విలువ అయితే 45 నుండి 60 లక్షల డబ్బు వసూలు చేసి, యజమానులకు 20 లక్షలు ఇచ్చి మిగతావి వీళ్ళు తీసుకున్నారు, విలువైన ఫ్లాట్లు బినామీల పేరుతో తీసుకున్నారు, ఆవ భూములు పేదలకు కేటాయించారు
- కేవలం రాజానగరం ఎంఎల్ఏ ఇసుక మాఫీయా ద్వారా దాదాపు 100 కోట్లు అవినీతి సొమ్ము తీసుకున్నారు, అందులో జగన్ కు ఎంత ఇస్తున్నారో వారికే తెలియాలి
- తోట త్రిమూర్తులు గారు 28 ఏళ్ళ క్రితం దళితులకు శిరో ముందనం చేస్తే మొన్న కోర్టు శిక్ష వేసింది, అలాంటి ఘటన మొన్నీమధ్య రాజానగరం లో జరిగింది
- రాజానగరం లో అరాచకాలు ఆగాలంటే బత్తుల బలరామకృష్ణ గారు గెలవాలి
- కేవలం ఇళ్ల పట్టాల మీద 300 కోట్ల అవినీతి జరిగింది ఇక్కడ
- కొండలు, కొనలు, వాగులు, వంకలు అనేవి మన సంపద, వాటిని ఎవరూ ధ్వంసం చేయడానికి వీల్లేదు, కానీ కేశవరం, కోటి, మునగాల, కాటవరం, కూనవరం, నాగంపల్లి, రాజానగరం లో కొండలు త్రవ్వేశారు, గ్రావెల్, మట్టి తవ్వేశారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3.35 కోట్ల ఫైన్ వేసినా దోపిడీ ఆగలేదు, ఇవి ఆగాలంటే కూటమి గెలవాలి
- నేను కులాలను దాటి ఆలోచించేవాడిని, సినిమాల్లో కానీ అని ఒక క్రిస్టియన్ యువకుడి సినిమా తీశాను, రెల్లి వర్గాన్ని గుండెల్లో పెట్టుకున్న వాడిని, ఎవరైనా సరే రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అని అనుకునే వ్యక్తిని
- నా వ్యక్తిగత జీవితం, మిత్రులు కూడా కులాలను దాటి ఉంటారు, నా భార్య కూడా ఒక క్రిస్టియన్
- ఒక చర్చ కు వెళ్లి హిందూ మత ప్రచారం చెయ్యడం, మసీదు కు వెళ్లి అన్యమత ప్రచారం చెయ్యడం, అలాగే తిరుమల వెళ్లి క్రిస్టియన్ మతం ప్రచారం చెయ్యడం తప్పు, అంతే తప్ప నేను ఏరోజు క్రిస్టియన్ మతానికి వ్యతిరేకం కాదు, మొన్న పిఠాపురంలో 110 ఏళ్ల చరిత్ర ఉన్న చర్చ్ కు వెళ్ళాను, జెరూసలేం వెళ్ళాను, యేసు ప్రభు నడిచిన దారిలో నడిచి వచ్చినవాడిని, కానీ వైసీపీపార్టీ నాయకులు నేను క్రిస్టియన్లకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు
- నా మీద కూడా వైఎస్ఆర్ హయంలోనే రాళ్ళ దాడి జరిగింది కానీ ఏరోజు వైయస్ జగన్ లా డ్రామా వేయలేదు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చాను
- 30 వేల మంది మహిళలు అదృశ్యం అయితే పరదాల మహారాణి పరదాలు చుట్టుకుని తిరుగుతుంది, ఆ మహారాణి వైయస్ జగన్ నా మీద ఏడుస్తాడు
- ప్రశ్నిస్తే కడప కోర్టుకు వెళ్లి బాబాయ్ హత్య గురించి, కత్తిపోట్ల గురించి మాట్లాడకూడదు అని స్టే తెచ్చుకుంటాడు, సభాముఖంగా వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడను అని సెలవిస్తున్నాను
- జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ చైర్మన్, మీరు అందరూ కూర్చొని కేవలం కాపు నాయకులతో ఎందుకు తిట్టిస్తున్నారు, ఇతర కులస్థుల ఎందుకు తిట్టించలేదు? విభేదాలు సృష్టించడానికా
- పాయకరావు పేటలో నా ఫ్లెక్సీలు కడుతూ 2018 లో ఇద్దరు యువకులు చనిపోయారు, ఒకరు రజక, ఇంకొకరు శెట్టి బలిజ కులానికి చెందిన యువకులు. నేను ఒక వర్గానికి చెందిన వాడిని కాదు, అందరివాడిని
- నేను అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, అలాగే కాపు వర్గాలకు కూడా జరగాలి అనే వ్యక్తిని
- జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేం అన్నారు, సంవత్సరానికి 2వేల కోట్లు ఇస్తామన్నారు, నిధులు ఇవ్వడం కాదు కదా, కనీసం ఆఫీస్ లో టైపిస్ట్ కు జీతాలు కొడియా ఇవ్వలేని పరిస్థితికి తీసుకెళ్ళారు
- కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు, ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు EBC రిజర్వేషన్లు కల్పించారు, అందులో 5% కాపులకు ఇస్తాం అని చంద్రబాబు గారు చెప్పారు, కానీ జగన్ అది కూడా ఇవ్వకుండా తీసేసాడు, అలాంటి వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారు అనేది కాపు ప్రజలు ఆలోచించాలి
- పార్లమెంట్ లో GVL నరసింహారావు గారు కాపు రిజర్వేషన్లు కేంద్ర పరిధిలో ఉన్నాయా, లేక రాష్ట్ర పరిధా అని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి అని స్పష్టం చేసింది. అలాంటిది కేంద్ర పరిధిలో ఉన్నాయి అని కాపులను మోసం చేసిన వ్యక్తి వైయస్ జగన్
- కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపుల కోసం ఏం చేసారు? కాపు నాయకులు అందరూ నన్ను తిట్టడం తప్ప ఏం చేసారు? వెళ్లి వైసీపీపార్టీ గుంపులో దూరారు, పొగ బెట్టగానే అందరూ బయటకు వచ్చేశారు, వీరి గురించి నాకు ముందే తెలుసు
- పిఠాపురంలో నాకు ఓటు వేస్తే అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తాం అని ప్రజలను బెదిరిస్తున్నారు, అసలు వైసీపీపార్టీ అధికారంలోకి వస్తే కదా, మేము అధికారం స్ధాపిస్తున్నాం, సింహాసనం చేజిక్కించుకుంటున్నాం
- రాజమండ్రి లో పురందేశ్వరి గారిని గెలిపించుకోవాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వలంటే కేంద్రంలో బలంగా మాట్లాడే వ్యక్తులు ఉండాలి, అందుకే ఆమెను గెలిపించాలని కోరుతున్నాను
- గంగా ప్రక్షాళన ఎలా జరిగిందో, పురందేశ్వరి గారు గెలిచి కేంద్ర మంత్రి అయ్యాక గోదావరి ప్రక్షాళన చేద్దాం, రాజమండ్రి పాపికొండల టూరిజం డెవలప్మెంట్ చేస్తాం
- కాపు నేస్తానికి 65 లక్షల మంది అర్హులు అయితే కేవలం 2 లక్షల 36 వేల మందికి ఇచ్చి 62 లక్షల 65 వేల మందికి ఇవ్వలేదు. వారు ఇచ్చిన వారు కంటే రాజమండ్రి పరిధిలో అర్హులు ఎక్కువమంది ఉన్నారు
- కాపు నేస్తం పథకానికి 354 కోట్లు ఇచ్చి, ప్రచారానికి 200 కోట్లు ఖర్చుపెట్టారు. ఆ డబ్బు లబ్ధిదారులకు ఇవ్వచ్చు కదా? అనవసరంగా అర్హుల నుండి అప్లికేషన్లు సేకరించి ఆశలు పెట్టి మోసం చేశారు
- రజకులకు, నాయి బ్రాహ్మణ వర్గాలకు, దళితులకు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది వైసీపీపార్టీ ప్రభుత్వం
- జగన్ మహారాణి, నిన్న చాల మంది నాతో చెప్పారు, సార్ నిన్న మీ నాలుగో పెళ్ళాం వైయస్ జగన్ కు చాలా అవమానం జరిగింది అని చెప్పారు, నువ్వు నా గురించి పెళ్ళాం అని మాట్లాడితే జగన్ నా నాలుగో పెళ్ళాం అని జనాలు మాట్లాడతారు జాగ్రత్త
- నేను నియోజకవర్గం మార్చాను అని వైయస్ జగన్ అంటాడు, 70 మంది ఎంఎల్ఏ లను ఈ దుకు మార్చవు, నెల్లూరు వ్యక్తి ని తీసుకెళ్ళి, నరసరావు పేటలో ఎందుకు నిలబెట్టావు
- మీ భవిష్యత్తు నిర్ణయించే వ్యక్తి 5 ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉన్నాడు వైయస్ జగన్, చిన్న కేసు అంటే పాస్ పోర్ట్ ఇవ్వరు, అలాంటిది అలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారు
- ఖైదీ నెంబర్ 6093 మీ ముఖ్యమంత్రి, 38 కేసులు, 16 నెలలు చంచల్ గూడా జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తి, వైయస్ జగన్ బ్రతుకు ఎలాంటిది అంటే, ప్రతీ శుక్రవారం రాగానే వణుకు వస్తది, ఈరోజు ఎలా ఎగ్గొట్టాలి అని, మేము వచ్చాక నువ్వు ఎక్కడ కావాలి అంటే అక్కడ జైలుకు పంపిస్తాం
- మోదీ కీ గ్యారెంటీ అని నరేంద్రమోదీ గారు అన్నారు, తప్పూ చేసిన వారిని జైలుకు పంపిస్తా అన్నారు, ఖచ్చితంగా గ్యారంటీగా నిన్ను జైలుకు పంపిస్తాం వైయస్ జగన్
- మెగాస్టార్ చిరంజీవి గారి, రామ్ చరణ్ గారు, జూ. ఎన్‌టిఆర్ గారు, ప్రభాస్ గారు, మన గుంటూరు కారం మహేశ్ బాబు గారు, పుష్ప అల్లు అర్జున్ గారు, ఇతర అందరి హీరోల అభిమానులకు చెప్తున్నా, ఎప్పుడైనా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ, NTR గారు అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఆయనకు సహకరించలేదు, సూపర్ స్టార్ కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. కానీ ఏరోజు ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని ఏమనలేదు. చంద్రబాబు గారితో నాకు వ్యక్తిగతంగా కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నా నా సినిమాలు ఆయన ఏరోజు ఆపలేదు
- మీరు అభిమానించే చిరంజీవి గారిని, ప్రభాస్ గారిని మహేశ్ బాబు గారిని నడిపించి, కనీసం భోజనం కూడా పెట్టకుండా, సంబంధం లేని అంశంపై పిలిపించి ఒక శాడిస్ట్ లాగా, సీక్రెట్ కెమెరాలు పెట్టి, అందరి తరపున మాట్లాడినందుకు అవమానించాడు ఈ వైయస్ జగన్
- లక్షలాది మంది అభిమానించే చిరంజీవి గారు అజాత శత్రువు, ఎన్ని మాటలు అన్నా సరే ఆయన మాత్రం ప్రేమిస్తాడు, అలాంటి వ్యక్తిని అవమానించిన వ్యక్తి వైయస్ జగన్
- జక్కంపూడి రామ్మోహనరావు గారు అంటే నాకు గౌరవం ఐనా సరే జక్కంపూడి రాజా గారు ఓడిపోతున్నారు, ఆయనకు అనుకూలంగా ఉండి మా నాయకులు, జనసైనికుల మీద అక్రమ కేసులు పెడుతూ, బెదిరిస్తున్న వారు ప్రవర్తన మార్చుకోవాలి, ప్రభుత్వం మారిపోతుంది, మీరు పారదర్శకంగా లేకపోతే మేము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం జాగ్రత్త
- అధికారంలోకి వచ్చాక కుల గణాంకాల తో పాటు ప్రతిభా గణాంకాలు తీసుకోవాలి అని చంద్రబాబు గారికి చెప్పాను, దాని ప్రకారం మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి 2047 నాటికి భారత్ సూపర్ పవర్ గా ఎదగటానికి భాగస్వాములు గా చేస్తాం
- నేను ఒక స్టార్ హీరోగా ఉండి కూడా నేను మీకోసం వచ్చి మాట్లాడుతున్నాను, నాకోసం కాదు, మీ భవిషత్తు కోసం ఆలోచించేవాడు ఉండాలి అని వచ్చాను
- మేము నాయకులం కాదు, మీ సేవకులం, మీకు సేవ చేయడం కోసం కూటమిగా ముందుకు వచ్చాం, ఆశీర్వదించండి
- అధికారంలోకి వచ్చాక కోరుకొండ లో రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆగిపోయిన భూములను ఎండోమెంట్ నుండి విడిపించి ప్రజలకు అందేలా చేస్తాను
- రానున్నది మన ప్రభుత్వం – బద్దలు కొడతాం వైసీపీ ప్రభుత్వాన్ని