- వైసీపీ ప్రభుత్వాన్ని అధః పాతాళానికి తొక్కేస్తున్నాం, మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం
- జగన్ ఓడిపోతున్నాడు అని తెలిసి 70 మంది అభ్యర్థులను మార్చాడు, అందులో రాజంపేట మొదటిది, ఇక్కడ వైసీపీ పార్టీ ఓడిపోబోతుంది
- సారా వ్యాపారం చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేసే పిఠాపురంలో నన్ను ఓడిస్తాడంట, తన ప్రాంతంలోకి మాత్రం బయటవారిని రానివ్వను అని నాతో ఒకసారి కలిసినప్పుడు చెప్పాడు. ఇక్కడ ఉన్న యువతకు గుండెబలం ఉంది, వారు పెద్దిరెడ్డి , మిథున్ రెడ్డి లను ఓడించనున్నారు
- వైసీపీ ఇసుక దోపిడీకి నిదర్శనం అన్నమయ్య డ్యాం దుర్ఘటన. అడ్డగోలుగా ఇసుక దయచేసి డ్యాం గేట్లు తెగిపోతున్నా పట్టించుకోలేదు, 39 నిండు ప్రాణాలు బలయ్యాయి, వేలాది పశువులు చనిపోయాయి, 9 గ్రామాలు కొట్టుకుపోయాయి, డ్యాం నిండిపోయిందని లష్కర్ రామయ్య అనే వ్యక్తి చెప్పినా సరే పట్టించుకోలేదు, అతని హెచ్చరిక వల్ల మిగతా ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు, జనసేన తరపున లష్కర్ రామయ్య గారికి 2 లక్షలు ఇచ్చి ఆయనను గుర్తించాం
- ఈ జిల్లాలో సంపద అంతా కేవలం ముగ్గురు వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది. పెద్దిరెడ్డి , ఆయన తమ్ముడు, మిథున్ రెడ్డి వీరి ముగ్గురు చేతుల్లో సంపద ఉండిపోయింది
- అమర్ రాజా లాంటి వేలాది మందికి ఉపాధి కల్పించే సంస్థలను తరిమేశారు, పెట్టుబడులు లేకుండా చేసింది వైసీపీ పార్టీ ప్రభుత్వం
- క్లాస్ వార్ అని మాట్లాడే వైయస్ జగన్ , ఇక్కడ శ్రీజా డైరీ అని మహిళలు నడిపే పాల పరిశ్రమను, తన శివశక్తి డైరీ కోసం మూసేయించి, మహిళల కడుపు కొట్టాడు. అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని క్లాస్ వార్ అని ఎలా అంటాడు
- ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి రావాలి, పరిశ్రమలు రావాలంటే కూటమి రావాలి, మీ గళం అసెంబ్లీలో, పార్లమెంట్ లో వినిపిస్తాం
- రాజంపేట ఎంపీ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించండి, కేంద్ర ప్రభుత్వ ప్రశాద్ స్కీం ద్వారా ఒంటిమిట్ట రామాలయం అభివృద్ది చేసి, ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం గా చేసే భాధ్యత కూటమి తీసుకుంటుంది
- కోస్తాంధ్ర జిల్లాల్లో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది, మీరు కూడా వైసీపీ ని ఓడించండి, వైయస్ జగన్ ను అదః పాతాళానికి తొక్కండి