- జనసంద్రంగా మారిన రైల్వే కోడూరు, ఊహించిన దానికంటే రెట్టింపుగా సభకు విచ్చేసిన జనం
- నేల ఈనిందా, విస్పోటనం జరిగిందా అన్నట్లుగా రైల్వే కోడూరు సభకు జనం వచ్చారు
- ఈ బచ్చా మిథున్ రెడ్డి పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడంట , పుడింగి పెద్దిరెడ్డి నన్ను కుప్పంలో ఓడిస్తాడంట, జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా
- YSR బ్రతికున్న రోజుల్లో కనీసం రాష్ట్రానికి వైయస్ జగన్ ను రానిచ్చేవాడు కాదు, తండ్రే దగ్గరకు రానివ్వలేదు ఈ సైకో జగన్ ను
- మీరు ఇచ్చే హారతులు నాకోసం కాదు, మార్పు కోసం, రాష్ట్ర నలుమూలల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, విసిగిపోయారు, వైసీపీపార్టీ ని గెలిపించి తప్పు చేశాం అని బాధపడుతున్నారు
- 2009 లో పార్టీ పెట్టి మీరు నడపలేరు అని అందరూ అంటే, అది తప్పు మేము నడపగలం అని 10 ఏళ్లుగా నడిపి చూపిస్తున్నాం
- కష్టాలు ప్రజలకు, సంపద పెద్దిరెడ్డి కుటుంబానికి అన్నట్లుగా ప్రజల సంపద దోచేస్తున్నారు పెద్దిరెడ్డి
- ప్రతీ పనికిమాలిన వెదవ చేత తిట్టించుకోవడం నాకేం సరదా కాదు, కేవలం ప్రజల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం తిట్లు పడుతున్నాను
- రాయలసీమ 5మంది. వ్యక్తుల గుత్తాధిపత్యం కాదు, వైయస్ జగన్ గుత్తాధిపత్యం కాదు. ఎర్రచందనం వీళ్ళకు ఇందనంలా మారింది, ఎవరైనా ఎదురుతిరిగితే రాళ్ళతో కొట్టి చంపుతారు, హాస్పిటల్లో ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తారు, గంగిరెడ్డి లాంటి ఎర్ర చందనం స్మగ్లర్, డాన్, అలిపిరి ఘటనలో నిందితుడు, అతన్ని గతంలో అరెస్టు చేస్తే ఇప్పుడు మిథున్ రెడ్డి తో కలిసి తిరుగుతున్నాడు
- రైల్వే కోడూరు నడిబొడ్డున చెబుతున్నా, తప్పుచేసిన ప్రతీ ఒక్కరినీ లాక్కొచ్చి శిక్షిస్తాం
- మనకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు, మూడున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కేవలం 5 ఏళ్లు పనిచేసి, తండ్రి చనిపోయిన రోజు నుండి ముఖ్యమంత్రి కావాలి అని కలలు కన్న వ్యక్తిని చూసి భయపడతారా
- రైల్వే కోడూరు MLA గా జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్ గారికి గాజు గ్లాస్ గుర్తుపై, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను
- అధికారంలోకి వచ్చాక జిల్లాల పునర్విభజన అంశం సరిచేస్తాం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాం
- ఆడబిడ్డలు సమాజంలో ధైర్యం నింపాలి, రాయలసీమ ప్రజలకు మళ్ళీ ధైర్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది, రాయలు వారు పాలించిన నేల మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు
- రాష్ట్రమంతా ఒకటే మాట కూటమి గెలుస్తుంది, ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. గెలుపు భారీ మెజారిటీతో ఉండాలి, వైసీపీపార్టీ కోతలు బద్దలు కొట్టాలి