• ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలనే కూటమి కట్టాం
• మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది.. మీ అభివృద్ధి బాధ్యత మాది
• మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘సైకో జగన్ ఒక్కో జిల్లాకి ఒక్కో సైకోని తయారు చేశాడు. మమ్మల్ని మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నాడు. కృష్ణా జిల్లాలో ఇద్దరు నానిలు మంత్రులుగా పదవులు వెలగబెట్టారు. ఒకరు బూతుల నాని, ఇంకొకరు నీతుల నాని. బందరులో ఉన్న నీతుల నాని మాట్లాడితే చెప్పులు చూపుతూ కథలు చెబుతాడు. ఆ కథలు చెప్పే ముందు బందరుకు ఏం చేశావో చెప్పే ధైర్యం ఉందా?’ అని టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. జగన్ నీకు మంత్రి పదవి ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, నన్ను తిట్టడానికా అని నిలదీశారు. బుల్లెట్లకే భయపడని మేము వీళ్లకు భయపడతామా? అన్నారు. బందరు అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పలేని నీతుల నాని మాటలకు విలువెక్కడుందన్నారు. బుధవారం రాత్రి మచిలీపట్నం లో జరిగిన వారాహి విజయభేరీ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ “వారాహి నుంచి నీతుల నానికి సవాలు విసురుతున్నా.. బందరుకి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పు. బందరులో అభివృద్ధి ఉందో లేదో గాని ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ఉన్నాయి. బందరు బైపాస్ లో శ్రీ నితీష్ అనే వ్యక్తి రూ. 150 కోట్లతో మాల్ కడితే ఎన్ఓసీ ఇవ్వకుండా ఈ నీతుల నాని అడ్డుపడ్డాడు. ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడదామంటే ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు ఈ నీతుల నాని. వారాహి నుంచి మాటిస్తున్నాం మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే మెమోరియల్ కు ఎన్ఓసీ ఇస్తాం. బందరు తమ్మనవారి సత్రం భూమి వెయ్యి గజాలు కబ్జా చేసింది ఎవరు? రంగనాయకస్వామి ఆలయలో గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెబుతాడు ఈ నాని.
• నాని పోయి బుల్లి కిట్టు వచ్చాడు
ఇప్పుడు నీతుల నాని పోయి బుల్లి కిట్టు వచ్చాడు. పెద్ద సైకో జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే పిల్ల సైకో కిట్టు ఇక్కడ తయారయ్యాడు. బందరులో గంజాయి బ్యాచ్ లు, రౌడీలు, గొడవలు, సెటిల్మెంట్ల వ్యవహారం మొత్తం కిట్టూనే చూస్తాడు. చివరికి ఆడబిడ్డలపై అఘాయిత్యం చేసే పరిస్థితికి వచ్చారు. నీతుల నాని ముందు వీటికి సమాధానం చెప్పాలి. మాట్లాడితే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అంటారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు, శిరో ముండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెట్టిన వ్యక్తి. ఎనిమిది మందిని సామూహికంగా శిరోముండనం చేసిన వ్యక్తికి శిక్ష పడింది. అతను ఎమ్మెల్యే అభ్యర్ధి. జడ్జిలను తిట్టిన కేసులో ఇంటర్ పోల్ వెతుకుతున్న నింధితుల్ని పక్కన పెట్టుకుని తిరిగే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్రానికి తీవ్ర గాయం చేసిన వ్యక్తి జగన్. విధ్వంసం, రౌడీయిజం, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. శ్రీ కొల్లు రవీంద్ర మీద మీ శాసనసభ్యుడు పెట్టిన తప్పుడు కేసును మర్చిపోం. ఏదో ఓక రోజున మీకు అదే జరుగుతుంది.
• గంజాయి కావాలా? అభివృద్ధి కావాలా?
ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. దాని కోసమే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా మీ ముందుకు వచ్చాం. మీరంతా మా వెంట నడవాలని కోరుతున్నాం. మా స్వార్ధం కోసం మేము కూటమి కట్టలేదు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటోంది. మందుబాబుల బలహీనతలను ఆసరాగా తీసుకుని రూ. 60 ఉండే క్వార్టర్ ని రూ. 200 చేశాడు. ఈ డబ్బు జగన్ జేబులోకి పోతోందా? లేదా? ఇంత అవినీతి ప్రభుత్వాన్ని జీవితంలో చూడలేదు. కృష్ణా నది పక్కన ఉన్నా ఇసుక దొరకదు. వెయ్యి రూపాయిలకు దొరికిన ట్రాక్టర్ ఇసుక రూ. 5 వేలు అయ్యింది. ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతోంది. మా ప్రభుత్వంలో బందరు పోర్టు పీపీపీ మోడల్ లో పూర్తి చేసే కార్యక్రమం చేశాం. లంచాల కోసం ఆ ప్రాజెక్టు రద్దు చేసి ఈపీసీ అని మొదలు పెట్టాడు. వచ్చే ప్రభుత్వంలో బందరు పోర్టు పూర్తి చేసే బాధ్యత మాది. పరిశ్రమలు తెచ్చే బాధ్యత బాది. జాబు రావాలి అంటే కూటమి రావాలి. గంజాయి రావాలంటే జగన్ రావాలి. గంజాయి కావాలా? అభివృద్ధి కావాలా తేల్చుకోండి. మళ్లీ బందరుకి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ఓటు అడిగే ముందు మీ చెల్లెళ్లు విసిరే సవాలుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. బాబాయ్ మీద గొడ్డలి వేటు ఎవరు వేశారో సమాధానం చెప్పి ఓటు అడుగు. ఒకప్పుడు బాబాయ్ గొడ్డలి డ్రామా మన మీదకు నెట్టాడు. కోడి కత్తి డ్రామా ఆడాడు. నిన్న గులక రాయి డ్రామా మొదలు పెట్టాడు. ఎవరో గులకరాయి వేస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను హత్యాయత్నం చేశామంట. కరెంటు పోతే మేము బాధ్యులమా? చేతకాకపోతే రాజీనామా చేసి రా.. మీటింగు పెట్టుకో కరెంటు కోత లేకుండా మేము సరఫరా చేస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం టాప్ టెన్ తో మీ ముందుకు వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఎన్నికల మేనిఫెస్టో తెచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడి ఇచ్చి ఆదుకుంటాం. 217 జీవో రద్దు చేసి మత్స్యకారులను ఆదుకుంటాం. వలలు, బోట్ల మీద మెరైన సబ్సిడి తెస్తాం. మచిలీపట్నం పోర్టు పూర్తి చేసి బందరుకు పూర్వ వైభవం తెస్తాం. అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యత మాది.. మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది” అని అన్నారు.