ఉభయ గోదావరి జిల్లాలు పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది
అన్నవరం క్షేత్రాన్ని దేశం మొత్తం వచ్చేలా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ది చేస్తాము
72% పూర్తయిన పోలవరాన్ని పూర్తి చేయకుండా మెట్ట ప్రాంత రైతులను మోసం చేసింది వైసీపీపార్టీ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు ను ఒక నిషేధిత ప్రాంతంగా మార్చింది
ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాఫీయా డాన్ ద్వారంపూడి ఇష్టారాజ్యంగా గ్రావెల్, లాట్రెయిట్ దోచెస్తున్నారు, వీరభద్ర అనే కంపెనీ పేరుతో మట్టి దోపిడి జరుగుతుంది
అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిది పునరుద్ధరిస్తామని, వారి నిధులు వారి సంక్షేమానికి ఉపయోగపడేలా చేస్తాం
వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలను బెదిరించి, వారి ఆస్తులను లాగేసుకునే చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చాక ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలలు పునరుద్ధరించి ప్రతీ ఒక్కరికీ విద్యా అందేలా కృషి చేస్తాం
వంతాడ మైనింగ్ ద్వారంపూడి, వారి తప్పుడు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు, అధికారంలోకి రాగానే వంతాద మైనింగ్ పై స్వయంగా కూటమి ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది, నిర్వాసితులను ఆదుకుంటాను
నాకు లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము అవసరం లేదు, ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయి, కానీ నాకు మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేదే నా ఆశ, మీ భవిష్యత్తు కోసం పనిచేసే వ్యక్తిని
జగన్ లాంటి వ్యక్తులు వారి కేసుల గురించి, ఆనంతబాబు లాంటి హత్య చేసిన వ్యక్తులను కాపాడమని ప్రాదేయపడటానికి నరెంద్రమోదీ గారి దగ్గరకు వెళ్తారు, ఆయన వారికి గౌరవం ఇవ్వరు, కానీ ఆయన నాకు గౌరవం ఇస్తారు, జగన్ లాంటి వ్యక్తులను మోదీ గారు ఖచ్చితంగా శిక్షిస్తారు
చలమలశెట్టి సునీల్ ఓటు వేయమని అడగటానికి బస్తే, దళిత డ్రైవర్ ను చంపిన అనంత బాబును వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నావు అని అడగండి
మన కూటమి నుండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు ఉన్నారు, మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పోరాటం చేసి మీ పక్షాన నిలబడే నేను ఉన్నాను. అండగా నిలబడండి, రాష్ట్రం కోసం పనిచేసే భాధ్యత తీసుకుంటాం
నేను ఓడిపోతే మళ్ళీ పార్టీ నడుపుతాను తప్ప వెనక్కు వెళ్ళను, కానీ మీ భవిష్యత్తు దెబ్బ తింటుంది, మీ భవిష్యత్తు కోసం గళం ఎత్తుతూనే ఉంటాను, మీ కోసం పనిచేస్తూనే ఉంటాను
అరటిపండు తొక్క లాంటి వైయస్ జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని తీసి అవతల పడేయండి, NDA కూటమి అభ్యర్థులను గెలిపించండి
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి, రేపటి రోజున అతను తప్పు చేసినా నిలదీస్తాను, నేను తప్పు చేసినా నన్ను మీరు నిలదీయండి