సార్వత్రిక ఎన్నికల నియమావళిని మార్చేసిన పిఠాపురం అధికారులు

పిఠాపురం

• స్క్రూటినీ పూర్తయ్యాక నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసే ప్రయత్నం
• గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తు కేటాయించేందుకు సిద్ధం
పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ అధికారులు సార్వత్రిక ఎన్నికల నియమావళిని మార్చేసే ప్రయత్నం చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసి స్క్రూటినీ కూడా పూర్తయ్యాక మళ్ళీ నామినేషన్ పత్రాలు తెరచి సదరు నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసే ప్రయత్నం పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది. “తెలుగు జాతీయ పార్టీ తరపున పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అనే అభ్యర్థి పిఠాపురంలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు.. నామినేషన్ దాఖలు చేసే సందర్భంలోనే బ్యాట్ గుర్తుతో పాటుగా మరొక రెండు గుర్తులు తమకు కేటాయించాల్సిందిగా ఎన్నికల కమిషన్ అధికారులను అభ్యర్థించారు. అభ్యర్థి స్క్రూటినీ పూర్తయిన తరువాత ఎన్నికల గుర్తును అభ్యర్తించే విషయంలో పొరపాటు జరిగిందని తెలుపుతూ, తనకు గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని చెప్తూ నామినేషన్ పత్రాల్లో అనుమానాస్పద పత్రాలు జత చేసే ప్రయత్నం పిఠాపురం అధికారులు చేశారు…” అంతటితో ఆగకుండా సంబంధిత అభ్యర్థికి పెన్ స్టాండ్ గుర్తును కేటాయించే ప్రయత్నం కూడా ఎన్నికల కమిషన్ అధికారులు చేపట్టారు.
• గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుకు ఓట్లు బదలాయించే కుట్ర జరుగుతోందా..?
నామినేషన్ పత్రాలు అందజేసే విషయంలో పొరపాటు చేశాను అని స్వయంగా లిఖిత పూర్వకంగా రాసిచ్చిన అభ్యర్థి నామినేషన్ పత్రాలను తిరస్కరించకుండా, దానిలో మరో అనుమానాస్పద పత్రాలు జత చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అడిగిన వెంటనే గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించే ప్రయత్నం చేయడం అనుమానాలకు తావిస్తోంది. గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తును కేటాయించడం ద్వారా జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేసే ఓట్లను గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుకు బదలాయించే కుట్ర జరుగుతోందనే అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్వయంగా కార్యాలయంకు వెళ్లి పిఠాపురం అధికారులను సంభందిత అంశం గురించి వాకబు చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్