పిఠాపురం వారాహి విజయ భేరి సభలో జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు
- పొత్తు ధర్మం కోసం బలమైన నాయకులు, టీడీపి ఇన్చార్జి శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారు పోటీ నుండి తప్పుకుని, మన కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు
- నేను ఏరోజు నా గెలుపు కోసం పనిచేయలేదు, మారుమూల ప్రాంతాల సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కారం కోసమే పనిచేశాను, అలాంటి నన్ను ఈరోజు లక్ష మెజారిటీ తో గెలిపిస్తాం అని చెప్పిన పిఠాపురం ప్రజలకు ఎప్పటికీ రుణగ్రస్తుడిని
- మా నియోజకవర్గానికి ఏం చేస్తావ్ అని ప్రజలకు నాపై అనుమానం ఉండి ఉండొచ్చు, కానీ శ్రీ పాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల, అష్టాదశ శక్తి పీఠం అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నేను పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటాను
- నేను నా పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, 54 గ్రామాల ప్రజలను అడుగుతున్నాను, నన్ను గెలిపించండి మీకోసం పనిచేస్తాను
- ఇక్కడ హాస్పిటల్, ప్రసూతి కేంద్రం సమస్య నా దృష్టికి వచ్చింది, నేను అధికారంలోకి రాగానే ముందుగా ఇక్కడ సరైన హాస్పిటల్ ఏర్పాటు చేస్తాను. ఒక వేళ ప్రభుత్వం తరపున ఆలస్యం అయినా నా డాక్టర్ స్నేహితుల ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాను
- ఉప్పాడ తీరప్రాంతం కోతకు గురైతే నా వాడబలిజ, మత్స్యకార సోదరులు నష్టపోతున్నారు, వారి కోసం, వారికి అండగా నిలబడటం కోసం పనిచేస్తాను
- నేను వైసీపీ నాయకుల్లాగా పారిపోను, మీకోసం నిలబడతాను. నేను 2022 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాను, అది చేసి చూపించాను కాకినాడ డాన్ ద్వారంపూడి, చిత్తూరు నుండి ఇక్కడి కి వచ్చిన మిథున్ రెడ్డి, కోట్ల రూపాయలు నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కడిని ఓడించడానికి ఎంతమంది వస్తారు? అంత భయం ఎందుకు వైసీపీ వారికి?
- వైసీపీ నాయకులు ఓట్లు అడగటానికి వస్తే చేబ్రోలు పట్టు రైతులకు ఏం చేసారు, సుద్దగడ్డ ఆధునీకరణకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఇప్పుడు మండలానికి ఒక వైసీపీ నాయకుడు వస్తున్నారు, ఈ 5 యేళ్లు ఎందుకు రాలేదు అని అడగండి
- వైసీపీ J బ్రాండ్ లిక్కర్ లో పవర్ స్టార్ బ్రాండ్ కూడా పెట్టారంట , మద్యపాన నిషేదం చేస్తా అని వైసీపీ చేసే పనులు ఇవి
- మాట్లాడితే పెత్తందారులు – పేదల మధ్య పోరాటం అని వైయస్ జగన్ అంటాడు…
- విశాఖలో మమ్మల్ని అడ్డుకుంది ఎవరు?
- పేదల ఇల్లు కూల్చింది ఎవరు?
- మాస్క్ అడిగిన సుధాకర్ గారి చావుకు కారణం ఎవరు
- డ్రైవర్ ను చంపిన MLC అనంత బాబును వెంటేసుకుని తిరుగుతున్న పెత్తందారీ ఎవరు?
- 100 పైగా లిక్కర్ కంపెనీలు ఉంటే కేవలం వైసీపీ కి చెందిన 16 కంపెనీలకు మాత్రమే లిక్కర్ ఆర్థర్ ఇచ్చి, ఆన్లైన్ పెమెంట్ కాకుండా క్యాష్ తీసుకుంది ఎవరు?
- వేల కోట్ల లిక్కర్ మాఫీయా చేసింది మీరా మేమా? ఎవరు పెత్తందారులు ?
- కొత్తపల్లి లో పరిశ్రమల కోసం భూములు తీసుకున్నారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు చెప్పాలి వైయస్ జగన్
- ఇక్కడ పారిశ్రామిక వ్యర్థాలు సముద్రంలో కలపడం వల్ల మత్స సంపద చనిపోతుంది, దానికి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి
- నేను ఒక ఎన్నిక కోసం పిఠాపురం రావడం లేదు, ఇక్కడే ఒక ఇల్లు తీసుకుని, ఒక పర్మనెంట్ కార్యాలయం తీసుకుని 54 గ్రామాల భాధ్యత తీసుకుంటాను
- నేను పిఠాపురం వచ్చానని తెలిసి నేషనల్ మీడియా వారు వచ్చారు, వారికి ఒక్కటే చెప్పాను, పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది చూపిస్తాను
- పనికిమాలిన బ్రాండ్ల కారణంగా మన రాష్ట్రంలో విపరీతంగా మత్తు బానిసల ఆత్మహత్యలు 2018 – 196 2019 – 302 2020 – 385 2021 – 571 2022 – 380 4 ఏళ్లలో మొత్తం 1638 ఆత్మహత్యలు
- పాతికేళ్ల భవిష్యత్తు కావాలా 5 వేల జీతం కావాలా నిర్ణయించుకోండి, మత్స్యకారులకు జెట్టీల నిర్మాణం కావాలా? లేక 25 కేజీలు బియ్యం కావాలా ఆలోచించండి, నేను సగటు యువత ఆవేదన అర్దం చేసుకుని వచ్చాను
- నేను ఓడిపోయిన ఎక్కడకి వెళ్లకుండా నిలబడి ఉన్నాను, ప్రజల కోసం పనిచేస్తున్నాను, సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్
- చెల్లి షర్మిల గారు పార్టీ పెట్టినా విలీనం చేశారు, నిలబడలేక పోయారు, కానీ నేను నిలబడ్డాను, 10 ఏళ్ల తరవాత కూడా ఒకే మాటపై ఉన్నాను
- నాకు జగన్ లా తాతగారి గనులు లేవు, సాదారణ మధ్యతరగతి కానిస్టేబుల్ కొడుకును, మా అన్నయ్య చిరంజీవి
- గారు ఇప్పించిన యాక్టింగ్ ట్రైనింగ్ ద్వారా కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చాను
- పవన్ కళ్యాణ్ అన్ని కులాల మనిషి, ఒక కులం మనిషి కాదు
- ఒక్క MLA కూడా లేని నేను పెత్తందారీ అంట, వేల కోట్ల లిక్కర్ మాఫీయా, కుంభకోణాలు చేసిన వ్యక్తులు, వేల కోట్ల సంపాదన ఉన్న వ్యాపారస్తులు, మిథున్ రెడ్డి లా 60 నియోజకవర్గాలకు డబ్బులు అందించే ధనవంతులు పేదలు అని చెప్తున్నాడు వైయస్ జగన్
- దాదాపు 300 కోట్ల ఆస్తులు ఉన్న ఎంఎల్ఏ అభ్యర్థి పేద వ్యక్తి మేము పెత్తందారులు అని అంటున్న
- నేను ఇక్కడ ఎంఎల్ఏ అయ్యాక కాకినాడ డాన్ ఎలా పిఠాపురంలో అడుగుపెట్టి దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తాడో చూద్దాం
- వంగా గీత గారూ ఓట్ల కోసం వస్తే 219 దేవాలయాలు కూల్చేశారు, పవిత్రమైన బ్రాహ్మణుల యజ్ఞోపవీతాన్ని టెంపిన వ్యక్తులు వైసీపీ నాయకులు, అలాంటి వారిని ప్రోత్సహించే పార్టీకి ఎందుకు ఓటు వేయాలో అడగండి
- కాకినాడ పోర్ట్ అక్రమ డీజిల్ వ్యాపారానికి అడ్డాగా మార్చేసారు కాకినాడ డాన్
- సనాతన ధర్మానికి, సూఫీ విధానానికి వేదిక పిఠాపురం , నిజమైన భారతీయతకు చిహ్నం పిఠాపురం
- నన్ను మీరు నమ్మి గెలిపిస్తే, పొత్తు ద్వారా నేను చేయాలనుకున్నది
- మన పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్ సిటీగా అభివృద్ది చేస్తాను.
- గొల్లప్రోలు వద్ద ఉన్న సంతను అభివృద్ది చేస్తాను
- ఉప్పాడ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, సూరయ్య మాన్యం రైతులను ఆదుకుంటాను
- ప్రతీ మండలానికి ఆదునిక ఆసుపత్రి నిర్మాణం
- పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం, ఆప్టిమైజింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాను.
- సీడ్ సెంటర్ ను ఇక్కడ అభివృద్ది చేస్తాను
- గొల్లప్రోలు లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను
- దుర్గాడ మిర్చి పంటకు క్రాషింగ్ ఫ్లోర్ ఏర్పాటు చేస్తాను
- కొత్తపల్లి SEZ కు కొత్త పరిశ్రమలు తీసుకొస్తాను, యువతకు ఉపాధి కల్పిస్తాను
- కేంద్రంలో దేవాలయాలకు ప్రత్యేక స్కీం ఉంది, కానీ మన పిఠాపురం కోసం వైసీపీ పార్టీ
ఆ స్కీం ఉపయోగించలేదు, నేను పిఠాపురం దేవాలయాల అభివృద్ది కోసం 70 నుండి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేస్తాను, జాతీయ పర్యాటక ప్రాంతంగా చేస్తాను - పిఠాపురం ప్రాంతానికి జాతీయ రహదారి, పోర్ట్, రైలు మార్గం ఉన్న ప్రాంతం, సంపూర్ణ అభివృద్ది చేసే భాధ్యత తీసుకుంటాను
- 40 రోజుల సమయం మాత్రమే ఉంది, మీ కోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మన యువత భవిష్యత్తు కోసం వచ్చాను, అన్ని వర్గాల కష్టాలు తెలిసిన వాడిని, కౌలు రైతులకు కష్టం వస్తె నా సినిమా డబ్బులు వారికి ఇచ్చాను, అలోచించి ఓటు వేయండి
- ఇక్కడ చెరువుల నుండి అక్రమంగా మట్టి త్రవ్వుకుని దోచుకుంటున్నాడు కాకినాడ డాన్
- కాకినాడ డాన్ కు చెందిన కంపెనీ ఇక్కడ వందల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక, మట్టి త్రవ్వేస్తున్నారు
- MLA గా గెలిచిన వెంటనే ఇంటి కోసం స్థలం తీసుకుంటాను. నేను మీ భావోద్వేగాలు గౌరవించే వ్యక్తిని. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు చేస్తాను
- జనసేనను గెలిపించండి, జనసేనాని ని గెలిపించండి
- పొత్తులో ఉన్న ప్రతీ అభ్యర్థిని గెలిపించాలని పిఠాపురం నుండి పిలుపునిస్తున్నాను
- రాష్ట్రం నుండి 30 వేల మహిళలు అదృశ్యం అయిపోతే అక్కా, చెల్లెమ్మ అనే ఎందుకు మాట్లాడలేదు
- జనసేనకు జయం జయం జనసేన – బీజేపి – టీడీపి కూటమికి జయం, జయం, ప్రజలందరికీ జయం జయం కలగాలని కోరుకుంటున్నాను వైయస్ జగన్