ప్రజల ఆశీర్వాదంతో రామరాజ్యం స్థాపిస్తాం

రామరాజ్యం

• ఎన్నికల ముందు గులక రాయి డ్రామాతో జగన్ సరికొత్త మోసం
• వైసీపీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టే
• రాష్ట్ర ప్రజల గెలుపు కోసమే కూటమి కట్టాం
• తెలుగు ప్రజల వెలుగే మా ధ్యేయం
• పెడన ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘శ్రీ రామ నవమి రోజున గ్రామ గ్రామాన పందిళ్లు వేసి రాములవారి పెళ్లి చేసి అంతా చల్లగా ఉండాలని కోరుకుంటాం. సుపరిపాలన అంటే రామ రాజ్యమే. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలోనూ రామరాజ్యం స్థాపిస్తాం. అది జరగాలి అంటే రాముడు రావణున్ని చంపాడు. మీరు జగనాసురుడ్ని వదిలించుకోవాలి’ అని టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నంత కాలం పరదాలు కట్టుకుని తిరిగిన దుర్మార్గుడు జగన్ ఎన్నికల ముందు మళ్లీ కొత్త బిచ్చగాడిలా బయలుదేరాడు. అప్పుడు బాబాయ్ గొడ్డలి పోటు, కోడి కత్తి డ్రామాలతో వచ్చాడు. ఇప్పుడు గులక రాయి డ్రామాతో మోసం చేసేందుకు వస్తున్నాడు. ప్రజలు దీన్ని నమ్మొద్దని కోరారు. బుధవారం సాయంత్రం పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశేష జనవాహినిని ఉద్దేశించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ “ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆనందంగా లేరు. అందర్ని నట్టేట ముంచిన వ్యక్తి సైకో జగన్. అన్ని వర్గాలను ముంచాడు. అందుకే ఈ ముఖ్యమంత్రికి ‘‘జె’’ గన్ రెడ్డి సైకో అని పేరు మార్చేశాం. నిన్నటి రోజున వచ్చిన సర్వేలన్నీ ఎన్డీఏ కూటమి గెలపు ఖాయమని చెప్పాయి.
* బాదుడే బాదుడు
గత ఎన్నికల ముందు ఊరూరా తిరిగాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు. ప్రజలు కరిగిపోయి ఓటు వేస్తే ఐదేళ్లుగా చేసింది బాదుడే బాదుడు.. గుద్దుడే గుద్దుడు. దెబ్బలు తిని అలసిపోయిన జనం ఈ జగనాసురుడిని సాగనంపేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల ముందు గొడ్డలితో బాబాయ్ ని లేపేసి డ్రామా ఆడాడు. ఆ నేరం మా మీద పెట్టాడు. కోడికత్తి డ్రామా ఆడాడు. ఇప్పుడు గులక రాయి డ్రామా ఆడుతున్నాడు. మీటింగ్ పెడితే కరెంటు పోయిందంట. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గులకరాయి వేశారు అంట. చంద్రబాబు హత్యాయత్నం చేశాడంట. రేపల్లెలో సోదరిని కాపాడుకునేందుకు వెళ్లిన అమర్నాథ్ గౌడ్ హత్యకు గురైనప్పుడు జగన్ రెడ్డి ఏమయ్యాడు. నా మీద, శ్రీ పపవ్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు ఒక్కసారి అయినా ఖండించాడా..? మేము ఖండించాం. మేము మాట్లాడకపోయినా మా మీద నెపం వేయడానికి ఈ డ్రామాల రాయుడు మీ ముందుకు వచ్చారు. ఎవ్వరూ నమ్మవద్దు. నా మీద, శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లు వేయిస్తాడు. విచిత్రం ఏంటంటే మా మీద వేయించిన రాళ్లు దొరికాయి. ఈ డ్రామాల రాయుడు మీద వేసిన గులక రాయి దొరకలేదు. అదే జగన్మోహన్ రెడ్డి నాటకం.
• రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎన్డీఏ కూటమిలో చేరండి
పరదాలు కట్టుకుని తిరిగాడు. మద్యం, ఇసుక, భూదందాల రూపంలో వేల కోట్లు దోచేసి అదే డబ్బుతో మిమ్మల్ని కొనాలని చూస్తున్నాడు. మీరు అమ్ముడు పోతారా? మా దగ్గర డబ్బు లేదు. నీతి, నిజాయితీ, మీ జీవితాల్లో వెలుగులు నింపే సామర్ధ్యం ఉన్నాయి. మా జెండాలు మూడు అయినా అజెండా ఒక్కటే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ, సంక్షేమం, తెలుగు ప్రజల వెలుగే మా ధ్యేయం. ఈ ముఖ్యమంత్రి శవాలతో మరోసారి వస్తున్నాడు. 2014లో తండ్రిని చంపేశారని వచ్చాడు. 2019లో బాబాయ్ ని చంపేశారని చెప్పి వచ్చాడు. ఇప్పుడు పింఛనర్ల శవాలతో వస్తున్నాడు. మీ సానుభూతి కోసం వస్తున్నాడు. ఇతన్ని చూసి సొంత పార్టీ నాయకులే పారిపోతున్నారు. 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలిపోయారు. ఎంపీలు పోతున్నారు. పదవుల్లో ఉన్న ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వస్తున్నారు. గుంటూరు జడ్పీ ఛైర్మన్ రాజీనామా చేసి వచ్చాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తులు ఎన్డీఏలో చేరండి.
• మద్యం ముసుగులో మీ రక్తం తాగిన దుర్మార్గుడు
ఐదేళ్ల పాలనలో అహంకారం, లెక్కలేని తనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. మా పాలనలో పట్టి సీమ ద్వారా కృష్టా డెల్టాకి నీరిచ్చాం. పోలవరం 72 శాతం పూర్తి చేశాం. మళ్లీ మేము వచ్చి ఉంటే 2020కే పోలవరం పూర్తి అయ్యేది. జగన్ రెడ్డి పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. సంపద సృష్టితో ఆదాయం పెరగుతుంది. సంక్షేమ కార్యక్రమాలకు అవకాశం దక్కుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరా లక్ష ఉండేది. హైటెక్ సిటీ కట్టాక రూ. 100 కోట్లకు వెళ్లింది. అది సంపద సృష్టించే పద్దతి. రోడ్డు వేస్తే పరిశ్రమలు వస్తాయి. గిట్టుబాటు ఇస్తే రైతు ఆదాయం పెరుగుతుంది. బందరు పోర్టు, అమరావతి రాజధాని వస్తే పెడన శాటిలైట్ టౌన్ షిప్ గా మారి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. అది మా కల. ఆలోచన. ఈ ముఖ్యమంత్రి ఏం చేయకుండా సంక్షేమం అని చెబుతాడు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతా అన్నాడు. మన ప్రభుత్వంలో రూ. 60 ఉన్న క్వార్టర్ రూ. 200కి పెంచాడు. మద్యం అమ్మకాల్లో అవినీతికి పాల్పడి మీ రక్తం తాగిన దుర్మార్గుడు జగన్. ఐదేళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టాడు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అందర్నీ బానిసలుగా చేసుకుని భయపెట్టి పని చేయిస్తున్నాడు. మెడ మీద కత్తి పెట్టి అందరి ఆస్తులు రాయించుకుంటున్నాడు. ఇప్పుడు భూ పరిరక్షణ చట్టం తెచ్చాడు. మీ పత్రాలు మీ దగ్గర ఉండవు. జగన్ బటన్ నొక్కితే మీ పేరు, రాత మారిపోతాయి. 20 రోజులు కష్టపడండి. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు, ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మూడు పార్టీలు తీసుకుంటాం.
• జోగి రమేష్ అరాచకాలు అనంతం
జోగి రమేష్ విషయానికి వస్తే.. మైలవరంలో పుట్టాడు. అక్కడ తంతే పెడన వచ్చాడు. పెడనలో తంతే తిరిగి మైలవరం వెళ్లాడు. మళ్లీ పెడన వచ్చాడు. ఇప్పుడు పెనమలూరు పోయాడు. ఈసారి తంతే సముద్రంలో పడతాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు జాగ్రత్త. గులకరాయి పడిందని బాధపడుతున్న ముఖ్యమంత్రి ఇదే జోగిని మా ఇంటి మీదకు కర్రలు, రాళ్లు ఇచ్చి పంపాడు. మీవే ప్రాణాలా? ఇక జోగి అరాచకాలు, భూకబ్జాలు, కమిషన్లు, సెటిల్మెంట్ల మీద సినిమా కూడా తీయొచ్చు. పెడనలో ఉన్న చేనేతలు ఇబ్బందుల్లో ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. కలంకారిల కోసం పదెకరాల్లో ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. చేనేత నేస్తం రద్దు కాదు. బీసీ సబ్ ప్లాన్ తీసుకువచ్చి మరింత ఎక్కువ ఇస్తాం. వైసీపీకి 22 ఎంపీలను ఇస్తే బాబాయ్ ని హత్య చేసిన అవినాష్ అరెస్టు ఆపడం మినహా చేసిందేమీ లేదు. మరోసారి వైసీపీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టే. కూటమికి 25 ఎంపీలు, 160కి పైగా ఎమ్మెల్యేలు గెలిపించండి. శ్రీ బాలశౌరి గారికి, శ్రీ కృష్ణ ప్రసాద్ కి అఖండ మెజారిటీ రావాలి” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్