- ఇక్కడ స్థానిక MLA కన్నబాబుకు డొక్కు స్కూటర్ లో తిరిగేవాడు, కన్నబాబు ఇలారా అంటే వచ్చేవాడు, కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు? రాజకీయంగా ఎదగటం తప్పు లేదు, కానీ ఎలా ఎదుగుతున్నాం అనేది ముఖ్యం
- జగన్ ఎన్నో మాటలు ఇచ్చి, అవి మర్చిపోయిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి
- ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేను అన్ని కులాలను సమానంగా చూస్తాను, అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను
- డొక్కు స్కూటర్ మీద తిరిగే కన్నబాబు ఈరోజు వెయ్యి కోట్ల ఆస్తి సంపాదించాడు. ఇక్కడ వాకలపూడి లో 4.86 ఎకరాల భూమి లే అవుట్ వేసి, 20 మందికి స్థలాలు అమ్మాడు, తరవాత కడప నాయకుడు ఒకరు వచ్చి స్థలం నాది అని గోడ కట్టేసుకుంటే భూములు కొన్నవారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు
- కాకినాడ రూరల్ లో ఎవరైనా అప్రూవుడ్ లే అవుట్ వేయాలంటే 20లక్షలు, అన్ అప్రూవునడ్ అయితే 30 లక్షలు, ఆక్రమించుకున్నాడు అయితే వేరే రేటు కన్నాబాబుకు ఇవ్వాలని రూల్ పెట్టాడంట
- కన్నబాబు తమ్ముడు కు డా. కిరణ్ చౌదరి అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తే, ఆస్తి పాత్రలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా, వేధించి వేధించి పురుగులు మందు తాగి చనిపోయాడు. ఇంతలా కన్నబాబు తయారవుతాడు అనుకోలేదు, జగన్, ద్వారంపూడి లాంటి వ్యక్తులతో తిరిగి ఇలా తయారయ్యాడు
- మీరు ఎన్ని హారతులు ఇచ్చినా జగన్ అనే వ్యక్తిని అధికారంలోకి దించకుండా, వారికే ఓటు వేస్తే నిష్ప్రయోజనం. వైసీపీ నాయకుల వేధింపులకు ఎంతదూరం పారిపోతారు? ఎదురు తిరగండి
- నేను జూ.ఎన్‌టిఆర్, ప్రభాస్ , చిరంజీవి గారు, రామ్ చరణ్ లాంటి పెద్దనటుడుని కాకపోవచ్చు, కానీ నాకంటూ మార్కెట్ ఉంది, దాదాపు 200 కోట్లు గత 5 ఏళ్లలో సంపాదించి, 70 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టగలిగే శక్తి ఉన్న వ్యక్తిని, అయినా సరే నేను మీ కోసం రాజకీయాల్లోకి వచ్చాను
- గంజాయి వల్ల మీ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ద్వారంపూడి, కన్నబాబు ఆస్తులు పెరిగిపోతున్నాయి
అధికారంలోకి వచ్చాక గంజాయి పై ఉక్కుపాదం మోపుతాము, ద్వారంపూడి, కన్నబాబు లకు నరకం స్పెల్లింగ్ రాయిస్తా, అందుకే పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను - సూర్యారావు పేటలో అన్యాయంగా మత్స్యకారుల గుడిసెలు ఖాళీ చేయించి 750 ప్లాట్లు వేసి, కేవలం 30 మందికి మాత్రమే ఇచ్చి మిగతావి కన్నబాబు వాళ్ళే ఉంచుకున్నారు, మేము అధికారంలోకి వచ్చాక పంతం నానాజీ గారు భాధ్యత తీసుకుని అందరికీ స్థలాలు వచ్చేలా చూస్తాం
- కమీషన్ కు కకృత్తి పడి కొంగోడు గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం జరగకుండా చేశాడు కన్నబాబు
- కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషిన్ ద్వారా ఇంటింటికీ త్రాగు నీరు ఇవ్వాలని పథకం ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చుపెట్టకుండా మీకు మంచినీరు రాకుండా చేస్తుంది, మేము అధికారంలోకి వచ్చాక ప్రతీ ఇంటికి త్రాగునీరు అందించే చర్యలు తీసుకుంటాం
- అవినీతి చెయ్యకుండా ఉంటే పథకాలకు డబ్బులు ఉంటాయి, ఈ విషయం వైయస్ జగన్ తెలుసుకోవాలి
- మద్యపాన నిషేదం అని చెప్పి దాదాపు 41 వేల కోట్లు సంపాదించిన సారా వ్యాపారి వైయస్ జగన్ , ఆదాన్ డిస్టిలరీస్, SPY ఆగ్రో అనే కంపెనీలు వైసీపీ వాళ్ళవి, Spy ఆగ్రో మిథున్ రెడ్డి చెందింది. రేట్లు పెంచి మిమ్మల్ని దోపిడీ చేస్తుంది
- చిరంజీవి భిక్ష కన్నబాబు రాజకీయ చరిత్ర, అలాంటి చిరంజీవి గారిని, మహేష్ బాబు, ప్రభాస్ గార్లను వైయస్ జగన్ఇంటికి పిలిచి అవమానిస్తే సిగ్గుగా అనిపించలేదా నీకు, చిరంజీవి గారి బిక్షతో రాజకీయంలో ఉన్నావు అనేది గుర్తురాలేదా కన్నబాబు
- దళిత డ్రైవర్ ను చంపిన MLC అనంతబాబు వైసీపీ ఎంపి అభ్యర్థి సునీల్ తో కలిసి తిరుగుతున్నాడు. దళితుల ప్రాణాలకు విలువలేదా
- ప్రతీ 5 సంవత్సరాలకు పార్టీ మారే వ్యక్తి చలమలశెట్టి సునీల్, తన పార్టీకే న్యాయంగా ఉందని వాడు, మీకు ఎలా నయం చేస్తాడు అనేది ఆలోచించాలి
- ద్వారంపూడి అన్న మాటలు నేను మర్చిపోలేదు, నాకు అన్నం గుర్తున్నాయి, పక్కనే ఉన్న కన్నబాబు కూడా గుర్తున్నాడు
- జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మీ భూములు దోచేసే ప్రయత్నం మొదలు పెట్టాడు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసేసి జగన్ ఫోటో వేసుకున్నాడు, మీ ఆస్తులు మీవే అని మీరు నిరూపించుకోవటానికి తిరగాలి
- ఈ నెల 30నా విడుదల చేయనున్న NDA కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రతీ వర్గానికి అభివృద్ది, సంక్షేమం జరిగేలా పొందుపరిచాం