- మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారిని గాజుగ్లాస్ గుర్తుపై, పెడన ఎంఎల్ఏ అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను
- నిన్న వైయస్ జగన్ భీమవరంలో మాట్లాడుతూ, నేను భీమవరం నుండి వెళ్ళిపోయాను అని మాట్లాడుతున్నాడు, పడన ఎంఎల్ఏ ను ఎందుకు వేరే ప్రాంతానికి పంపించావు? 70మంది ఎంఎల్ఏ లను ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకు జగన్
- క్లాస్ వార్ అని వైయస్ జగన్ మాట్లాడుతాడు, క్లాస్ వార్ అంటే డబ్బున్నోళ్ళు పేదోళ్ళని దోచుకోవడం, మేము దోచుకుంటున్నామా లేక జగన్ దోచుకుంటున్నాడా అనేది ఆలోచించాలి.
- అధికారంలోకి రాగానే జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 337 కోట్ల నిధులు దారి మళ్లించి వారి పొట్ట కొట్టాడు, ఇది కేంద్రం లోక్ సభలో చెప్పిన సమాధానం
జాతీయ ఉపాధి హామీ పథకం లో అత్యంత అవకతవకలు జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అని సాధ్వి నిరంజన్ గారు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు - పెడన లో అత్యధికంగా మత్స్యకారులు ఉన్నారు. వారి పొట్ట కొట్టేలా జీవో 217 తీసుకొచ్చింది వైసీపీ పార్టీ ప్రభుత్వం. నరసాపురంలో ఆ జీవో కాపీ చించేసీ మత్స్యకారుల పక్షాన నిలబడింది జనసేన
- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిది నుండి 450 కోట్ల నిధులు దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి, ఆప్కో వారికి దాదాపు 80 లక్షల నుండి కోటి రూపాయల బకాయి ఉండి వారిని ఇబ్బంది పెట్టింది ఎవరు
- అధికారంలోకి రాగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేసిన వ్యక్తి వైయస్ జగన్ , 5 రూపాయలు యూనిట్ కు ఒప్పందం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేసుకుంటే అది రద్దు చేసి , దాదాపు 18 రూపాయలకు కొన్నాడు వైయస్ జగన్ , తద్వారా 5 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు, ఇది దోపిడీ కాదా
- ఇక్కడ MLA దోపిడీ నేను గతంలో కూడా చెప్పాను, పాస్ బుక్ కావాలంటే 10 వేలు, చేపల చెరువుకు 1.5 లక్ష, దాణా షాప్ పెట్టాలంటే 2 లక్షలు, మోటార్ ఆయన చెప్పిన షాప్ లో కొనాలి ఇలా అవినీతి చేసే వ్యక్తి జోగిరమేష్
- డ్రైనేజీ సమస్య పరిష్కరించమంటే నోటిని డ్రైనేజీ గా చేసుకున్న వ్యక్తి జోగిరమేష్
- ఈ జోగిరమేష్ కు ప్రతీ ఒక్కరూ నమస్కారం పెట్టాలంట, లేకపోతే వారిపై గంజాయి కేసులు పెడతాడు
- మట్టి మాఫీయా గురించి యువత పిర్యాదు చేస్తే వారిని చెట్టుకు కట్టేసి కొట్టాడు, ఆఖరికి జడ్జ్ కుటుంబ ఆస్తులను కూడా దోచేశారు స్థానిక ఎంఎల్ఏ అనుచరులు
- ఇక్కడ దాదాపు 18 వేల మంది కలంకారీ చేనేత కార్మికులు ఉన్నారు, ఇకక్డ పద్మనాభం, నాగ లీలావతి అనే వారి ప్రభుత్వం నుండి బకాయిలు రాకపోవడంతో బయట అప్పులు తీర్చలేక బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకున్నారు, అలాంటి చావులు ఉండకూడదు అనేదే మా కూటమి లక్ష్యం, కలంకారీ, చేనేత కార్మికులకు అండగా ఉంటాం
- పెడన కలంకారీ కళకు GI మార్క్ గుర్తింపు ఉంది, వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందేలా ప్రోత్సాహం అందిస్తాం
- మనకు 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. మత్స్యకారులకు అండగా ఉండేలా NDA మ్యానిఫెస్టోలో నీలి విప్లవం అని మత్స్యకారులకు జెట్టీల నిర్మాణం, మత్స్య సంపద పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ బలంగా మత్స్యకారులకు అండగా పనిచేస్తాం
- ఈరోజు మా ఎంఎల్ఏ, ఎంపీ అభ్యర్థులతో ప్రమాణం చేయించాను, రాష్ట్ర భవిష్యత్తు కోసం బలంగా పనిచేసేలా కృషి చేస్తామని మాటిచ్చారు. మేము రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకుంటాం, మా అభ్యర్థులను గెలిపించండి, జగన్ భయపడేంత బలమైన మెజారిటీ తొ గెలిపించండి
- కలంకారీ కార్మికులు నా దృష్టికి రన్నింగ్ వాటర్ సమస్య తీసుకొచ్చారు, చంద్రబాబు గారి సమక్షంలో 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తామని కలంకారీ కార్మికులకు హాని ఇస్తున్నాను
- ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉండాలి అనేది జనసేన ఆలోచన, అధికారంలోకి రాగానే 13 జెట్టీలతో మొదలుపెట్టి మత్స్యకారుల కు అండగా ఉంటాం
- యువత ఈరోజు ఉపాధి లేక, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు, వారికి అండగా మేము ఉంటాం, ఒక్కసారి నమ్మితే వైయస్ జగన్ ఏం చేశాడో చూసారు, ఆలోచించి ఓటు వేయండి
- మద్యపానం నిషేదం అని చెప్పి వచ్చిన వైయస్ జగన్ , ఈరోజు సారా వ్యాపారి గా మారాడు, లక్ష కోట్ల ఆదాయం మద్యం ద్వారా సంపాదించాడు, కల్తీ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తుంది
- కల్తీ మద్యం అమ్మి, ఆడబిడ్డల పసుపు, కుంకుమ తీసేసి 40 వేల కోట్ల దోచేశాడు వైయస్ జగన్ , ఈ వ్యక్తిని తరిమేయ్యాలి
- రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఉద్యోగులు, ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదు, సకాలంలో జీతాలు పడాలి, యువతకు ఉపాధి రావాలి, రైతులు సంతోషంగా ఉండాలి అందుకోసమే కూటమి లోని 3 పార్టీలు త్యాగాలు చేసి ముందుకు వచ్చాం
- ఉద్దానం తరహా కిడ్నీ వ్యాధులు మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా కేసులు వస్తున్నాయి, ఆ సమస్యను పరిష్కరిస్తామని, స్వఛ్చమైన త్రాగునీరు అందిస్తాం
- పోలీసుల శ్రమ దోచేస్తున్నాడు వైయస్ జగన్ , వారికి TA, DA లు ఇవ్వటం లేదు, వారంతపు సెలవ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, సకాలంలో జీతాలు ఇవ్వలేదు, పోలీసుల శ్రమ దోచేస్తున్నాడు జగన్
- మేము అధికారంలోకి వచ్చాక టీచర్లను మద్యం షాపుల దగ్గర వైయస్ జగన్ కూర్చోపెట్టం, గురువులను గౌరవిస్తాం
- జగన్ నువ్వు చాలా భాదపడుతున్నావు, నా మీద చాలా కోపంగా ఉన్నావని తెలుసు, నీ కోసం భాద నువ్వు ఓడిపోతున్నావని, మేము వచ్చాక ఒక్కొక్క వైసీపీ పార్టీ రౌడీలను , ప్రకృతి వనరులను దోచేసిన ఎంఎల్ఏ లను, ఆడపడుచులను అగౌరవ పరచిన ప్రతీ ఒక్కరికీ బుద్ధి చెప్తాం
- సినిమాల్లో నే కాదు, ప్రజా జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న వ్యక్తి మన జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు