- సినిమాల్లోనే కాకుండా, సమాజంలో కూడా మంచి కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఒక దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని పంపించేందుకు 3 పార్టీలు కలిసి వచ్చాం
- డొక్కా సీతమ్మ పుట్టిన నేల, జగన్నాథ పండిత రాయలు అలంకార, తర్క శాస్త్ర పండితుడు పుట్టిన నేల మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారం
- ఇస్లాం మతాన్ని పాటించే సోదర, సోదరీమణులకు మా కూటమి తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు
- సామాజిక న్యాయం కోసం కృషిచేసిన కృషీవలుడు జ్యోతీ బా పూలే గారి జయంతి సందర్భంగా BC వర్గాలకు న్యాయం చేసేది NDA కూటమి మాత్రమే
- పచ్చని కోనసీమ ను కలహాల సీమ గా మార్చింది వైసీపీ ప్రభుత్వం
- డొక్కా సీతమ్మ పుట్టిన నేల, జగన్నాథ పండిత రాయలు అలంకార, తర్క శాస్త్ర పండితుడు పుట్టిన నేల మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారం
- రెండున్నర లక్షల హెక్టార్ల కొబ్బరి తోటలతో నిండిన కొనసీమను కొట్లాట సీమ, కలహాల సీమగా మారకుండా ఆరోజు మేము అందరం మా వంతు కృషిచేసాం, భవిష్యత్తులో కూడా ప్రేమ సీమగా ఉండేలా, అన్ని కులాల ప్రజలు, సంఖ్యా బలం లేని 120 పైగా BC కులాల ప్రజలు, మైనార్టీ వర్గాలు అందరూ కలిసి అందేలా పనిచేస్తాం
- త్రివేణి సంగమం లాగ జనసేన – టీడీపి – బీజేపి కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, యువతకు భరోసా ఇవ్వడానికి, రెండున్నర లక్షల హెక్టార్ల కొబ్బరి తోటలు రక్షించడానికి, కనీసం కొబ్బరి బోర్డు లేని ప్రాంతానికి అది తీసుకురావడానికి, పరిశ్రమలు తీసుకురావడానికి, కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకుండా ఉండటానికి మేము కృషి చేస్తాం
- నాడు నేడు పనులు ఇక్కడ మొదలుపెట్టారు, ఇప్పటికీ ముందుకు వెళ్ళలేదు, ఆ సభలో జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ఈరోజు అడుగుతున్నాను.
వరదలు వస్తేఅప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు 40 కోట్లు ఇస్తామని చెప్పాడు, 4 వేల ఎకరాలకు నీరు ఇచ్చే దీనికి ఒక్క పైసా ఇవ్వలేదు, వెదురుపిడెం కాజ్ వే నిర్మాణం చేతా అన్నారు చేయలేదు, వరద వస్తే ఇక్కడ ప్రాంతాలు మునిగిపోతున్నాయి, 25 కోట్లు పరిష్కారం కోసం ఇస్తామని చెప్పారు, ఒక్క పైసా ఇవ్వలేదు, గోదావరి వరదల సమయంలో 2023 జూలై 6న లంక గ్రామాల్లో జగన్ పర్యటించి 30కోట్లు ఖర్చుపెడతా అని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదు, గోదావరి వరదలు వస్తే తీర ప్రాంతాలు మునిగిపోకుండా ఉండేందుకు 200 కోట్లతో గట్లు పటిష్ట పరుస్తామని చెప్పి ఈరోజు వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు - గెయిల్ పరిశ్రమ అగ్ని ప్రమాదల నుంచి ప్రజలను కాపాడటానికి CSR క్రింద ఫైరింజన్ కొనిచ్చినా, ప్రభుత్వం కనీసం సిబ్బందిని ఈరోజుకు నియమించలేదు
- వైసీపీ ది ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం, ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వని ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం కావాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి
- కోనసీమలో కొబ్బరి చెట్టును పెద్దకొడుకుగా భావిస్తారు, ఒకప్పుడు ఎకరానికి వెయ్యి కాయలు వచ్చేవి, ఇప్పుడు కనీసం 200 ఖా అలు కూడా రావట్లేదు, ప్రభుత్వ విధానాలతో మరింత నష్టపోతున్నారు, అలాగే వరి రైతులకు కూడా అండగా ఉంటాను
- నేను పిఠాపురం నుండే పోటీ చేస్తున్నాను, మీకు అందుబాటులో ఉంటాను, కాటన్ దొరలా మ కూటమిలో ప్రతీ ఒక్కరం మీకోసం పనిచేస్తాం
- దూరంగా ఉండే పొలాలకి నీరు ఇవ్వడానికి కనీసం 5 కోట్లు కోడియా లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది
- రైతులకు అండగా మేము ఉంటాం, మీ బాగోగులు మేము చూసుకుంటాం
- గంగా బొండాం మొక్కలు కోనసీమ కోసం ఉద్దేశించినవి, కానీ వైసీపీ వారికి తప్ప కోనసీమ రైతులకు ఆ రకం మొక్కలు అందుబాటులో లేవు, అందరికీ అందేలా మేము చర్యలు తీసుకుంటాం
- గంగా బొండాం మొక్కలు కాకినాడ డాన్ మనుషుల దగ్గరకు వెళ్తున్నాయి, వారికి బుద్ధి చెప్పే భాధ్యత మాది
- కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలి, అలాంటప్పుడే మనం రాష్ట్రాన్ని అభివృద్ది చేయగలం
- మమ్మల్ని కులాల నాయకులతో తిట్టిస్తారు, మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, అన్ని కులాలకు న్యాయం జరగాలని ఆలోచించే వ్యక్తిని. అంబేద్కర్ గారు పేరు మీద విదేశీ విద్యా పథకం ఉంటే దానిని జగన్ పేరు పెట్టుకున్నాడు కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక మళ్లీ అంబేద్కర్ గారి పేరు పెట్టి విద్యార్థులకు పథకం అందిస్తాం
- ఇక్కడకు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, కేరళ తరహాలో కొబ్బరి ఉత్పత్తుల వినియోగం జరిగేలా చర్యలు తీసుకోవాలి. అంబాజీపేట లో పరిశోధనా కేంద్రం ఉన్నా సరే, దాని ఫలితాలు వాడుకోలేకపోతున్నాం. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి
- కూటమి అధికారంలోకి వచ్చాక మీరు మీ ఇంట్లో ఉండి వర్క్ ఫ్రం హోం ద్వారా సంపాదించుకొనేలా ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కృషి
- మొన్న మా అన్నయ్య చిరంజీవి గారు, వేలాది కౌలు రైతులకు అండగా నిలబడిన విధానం నచ్చి, మనం బాగుండాలని, కూటమి గెలవాలని ఆకాంక్షించి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయన్ను కదిలించింది మన కౌలు రైతు భరోసా యాత్ర
- యువతలో ఉన్న స్కిల్ ఏంటి అనేది కనుక్కోవాలి, మా అన్నయ్య నాకు యాక్టింగ్ అనే స్కిల్ నేర్పించడం వల్ల మీ అందరి గుండెల్లో స్థానం కల్పించారు. ఓట్లు చీలకుండా బలంగా నిలబడేలా చేసింది, నాకు మా అన్నయ్య నేర్పించిన స్కిల్ నాకు మాత్రమే ఉపయోగపడలేదు, వేలాది మంది కౌలు రైతులను అండగా నిలబడటానికి నాకు ఆ డబ్బు ఉపయోగపడింది
- మా అన్నయ్య చిరంజీవి గారు నేర్పించిన స్కిల్ నన్ను మీ అందరి ముందు నిలబడేలా చేసింది, అలా ప్రతీ యువకుడికి వారిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించి దానికి శిక్షణ ఇవ్వాలని కూటమి నాయకులు చంద్రాబాబు గారికి కూడా చెప్తున్నాను
- బైబిల్ లో చెప్పినట్లుగా చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించాలి అలాగే యువతకు స్కిల్స్ నేర్పించాలి
- కులాల మధ్య గొడవలు పెట్టే ప్రభుత్వాన్ని చూసారు, పచ్చని కోనసీమ తగలబెట్టిన ప్రభుత్వాన్ని చూసారు, సొంత కుటుంబాన్ని తన్ని తరిమేసిన ప్రభుత్వాన్ని చూసారు, కూటమి అధికారంలోకి వచ్చాక బలమైన లా & ఆర్థర్ తీసుకొస్తాం, అందరికీ ఒకే రకంగా చట్టాలు అమలయ్యే పరిస్థితి తీసుకొస్తాం
- కూటమి నుండి పి గన్నవరం నుండి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారిని, అమలాపురం MP గా TDP అభ్యర్థి GMC బాలయోగి గారి అబ్బాయి హరీష్ గారిని గెలిపించాలని కోరుతున్నాను
- బాలయోగి గారి వాంఛ అన్ని బ్రిడ్జీలు కలవాలి, కోనసీమ వాసులకు రైలు కూత వినిపించాలి అనే ఆశ, దాని కోసం అహర్నిశలు కృషిచేస్తాం. కొబ్బరి తోటల మధ్య రైలు వెళ్లేలా మేము భాధ్యత తీసుకుంటాం