ఒక్క ఛాన్స్ జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్

జగన్

• ప్రజల చేతిలో వైసీపీకి శవ యాత్ర తప్పదు
• ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు నిద్రపోము
• జగన్ చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మొద్దు
• ఇప్పుడు ఓటుకి పది వేలు ఇస్తాడు.. గెలిచాక లక్ష దోచేస్తాడు
• దోపిడి ఆగాలంటే దగాకోరు ప్రభుత్వం పోవాలి
• విజయనగరం ప్రజాగళం సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు

‘ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు శవయాత్ర చేయబోతున్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి సిద్ధం అంటూ ఊళ్ల మీద పడిన సైకో జగన్ ని ఓడించడానికి జనం సిద్ధమైపోయార’ని టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసక దోపిడీలకు కారణం అయిన ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు వదలమన్నారు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికే భారం అని అన్నారు. ప్రజలకు మంచి చేయడం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకత్వంతోనే సాధ్యమని తెలిపారు. బుధవారం రాత్రి విజయనగరంలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ “ఈ ముఖ్యమంత్రి గత రెండు ఎన్నికల్లో శవ రాజకీయంతో ప్రజల ముందుకు వచ్చాడు. ఈసారి గులకరాయి డ్రామా మొదలుపెట్టాడు. ఈ ప్రభుత్వానికి పాడె కట్టించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. జగన్.. నీ రాజకీయాలు అయిపోయాయి. రాబోయేది కూటమి ప్రభుత్వమే. ప్రమాణస్వీకారానికి ముహుర్తం కూడా సిద్ధం చేస్తున్నాం. గత ఎన్నికల్లో పాదయాత్రగా వచ్చాడు. బుగ్గులు నిమిరాడు, ముద్దులు పెడితే ఐసైపోయి ఓటు వేశారు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చింది లేదు. ఉత్తరాంధ్రకు ఒక్క ఇండస్ట్రీ తెచ్చింది లేదు. నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. మీ అరాచక పాలనకు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. విజయనగరం రాజ కుటుంబం సింహాచలం ట్రస్ట్ బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారు. మాన్సాస్ ట్రస్ట్ మీదే అవినీతి ఆరోపణలు చేశారు. శ్రీ అశోకగజపతి రాజుని వేధించినందుకు జగన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నా మీద నమ్మకానికి శ్రీ మోదీ గారి భరోసా తోడుంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కలిశాం.
• ఉత్తరాంధ్రను వంచించారు
ఉత్తరాంధ్రను జగన్ ఘోరంగా వంచించారు. టీడీపీ హయాంలో సాగు నీటి ప్రాజెక్టులకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ఐదేళ్లలో జగన్ చేసిన ఖర్చెంతో చెప్పగలడా? వంశధార, నాగావళి అనుసంధానానికి వెళ్లాం. పోలవరం పూర్తి చేసి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రను సస్య శ్యామలం చేయాలనుకున్నాం. గత ఐదేళ్లలో నిత్యవసర ధరలు పెరిగాయి. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు. మద్యం ధర పెంచేశారు. ఆర్టీసీ రేట్లు పెంచేశాడు. పన్నులు విపరీతంగా వేశాడు. రాష్ట్రంలో పేదవాడి బతుకు భారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. జగన్ జలగ్గా మారి మీ జీవితాలు నాశనం చేశాడు. ఎన్నికలకు 18 రోజుల సమయమే ఉంది. ప్రజలంతా జనసేన, టీడీపీ, బీజేపీ జెండాలు పట్టుకుని కూటమి గెలుపు కోసం పని చేయండి. మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసి రుణం తీర్చుకుంటాం. బాదుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తాం. రెండు రోజుల్లో మేనిఫెస్టో ఇవ్వబోతున్నాం. మీ జీవితాల్లో వెలుగులు తెస్తాం. దగా కోరు ప్రభుత్వం పోవాలి. దోపిడి ఆగాలి.
• ప్రజల్ని దోచుకున్న ప్రతి ఒక్కరినీ ప్రజా కోర్టులోనే శిక్షిస్తాం
జగన్ ది క్లాస్ వార్ కాదు క్యాష్ వార్. డబ్బు మొత్తం ఆయన దగ్గరే ఉంది. పేదలు మాత్రం నిరుపేదలు అయ్యారు. జగన్ ఆయన దళారులు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రజల్ని దోచుకున్న ప్రతి ఒక్కరినీ అదే ప్రజా కోర్టులో పెట్టి శిక్షిస్తాం. మేము సమర్ధవంతంగా, నీతివంతంగా పని చేసి మీ కష్టాలు తీరుస్తాం. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెరగవు. ఎలాంటి పన్నులు పెంచం. రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ అహంకారి, సైకో జగన్ చివరికి పోలీసులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. పోలీసులకు పీఎఫ్, టీఏ, డీఏలు ఇచ్చింది లేదు. పోలీసులకు జీతాలు, పీఆర్సీ రావాలంటే కూటమి ప్రభుత్వమే రావాలి. కూటమి వస్తేనే ఉద్యోగస్తులకు భవిష్యత్తు. జగన్ ఉద్యోగులను భయకంపితుల్ని చేశాడు. ఆరు లక్షల మంది ఉద్యోగులు పీఆర్సీ కూడా తీసుకోలేకపోయారు. వచ్చే జీతాలు కూడా తగ్గించేందుకు ప్రయత్నం చేసే వ్యక్తి జగన్. నార్త కొరియా అధ్యక్షుడు కిమ్ సోదరుడు జిమ్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు నవ్వినా సహించలేడు. ఎవరి దగ్గర డబ్బులున్నా ఓర్చలేడు. అంతా ఏడుస్తూ ఉండాలి ఆయనొక్కడే ఆనందంగా ఉండాలి. అందర్నీ బాధ పెట్టడం భయబ్రాంతుల్ని చేయడం వేధించడం ఈ జగన్ నైజం.
• బొత్స కుటుంబం దోచేస్తే.. వీరభద్రస్వామి ఊడ్చేశారు
విజయనగరం జిల్లాను బొత్స కుటుంబం దోచేసింది. ఎమ్మెల్యేలు., ఎంపీలు, మంత్రులు ఒకే కుటుంబానికి దక్కించుకుని ఏకచత్రాధిపత్యం చేయాలనుకున్నారు. మేము సాధారణ కుటుంబాల నుంచి సమర్ధ నాయకత్వాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బొత్స దోచుకోగా మిగిలింది ఊడ్చేయడానికి వీరభద్రస్వామి వచ్చాడు. ఈ ఎమ్మల్యే బినామీలు సెంటు భూమి దొరికినా వాలిపోతారు. అపార్టమెంట్లు కడితే కమిషన్ల కోసం వాలిపోతారు. లే అవుట్లు వేయాలన్నా వాటాలు ఇవ్వాలి. ఇప్పుడు మీ పాసుపుస్తకాల మీద జగన్ ఫోటో చేరింది. కొత్త చట్టంలో మీ దగ్గర మీ భూమి రికార్డులు ఉండవు. అంతా ఆన్ లైనే. జగన్ రికార్డులు మార్చేస్తే మీ జీవితాలు తారుమారైపోతాయి. విజయనగరంకి అంతా మంచి చేస్తాం. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యలో నడిచే మహారాజ కళాశాల ప్రైవేటుపరం కానీయం. మహారాజ ఆసుపత్రి పేరు మా ప్రభుత్వం రాగానే పునరుద్దరిస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత మంచినీరిస్తాం.అధికారంలోకి రాగానే టిడ్కోఇళ్లు అందరికీ ఉచితంగా ఇస్తాం. పేద వారికి రెండు మూడు సెంట్లు భూమిచ్చి ఇళ్లు కట్టిస్తా. శ్రీ మోదీ గారి అండతో పేదరికం లేని మొదటి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జగన్ తండ్రే అతన్ని భరించలేక బెంగళూరు పంపేశాడు. తల్లికి అన్నం పెట్టని ఈ వ్యక్తి ఆడబిడ్డల్ని ఆదుకుంటాడా? తల్లిని ఎన్నికల ముందు వాడుకుని వదిలేశాడు. చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకపోగా అప్పు రాసి చెల్లిని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు. చివరికి చెల్లి పుట్టుకనే ప్రశ్నించిన ఇంత నీచుడ్ని ఎన్నడూ చూడలేదు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా ప్రజలు ఆలోచించుకోవాలి. తెలుగు కళామతల్లికి అందించిన సేవలకు గాను కేంద్రం నుంచి పద్మవిభూషణ్ అందుకున్న శ్రీ చిరంజీవిగారు, శ్రీ రాజమౌళి లాంటి వారికి అవమానం చేశారు. ఎవరైనా నోరువిప్పితే తిరగనివ్వం అనే పరిస్థితికి తెచ్చారు. వీరి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. వచ్చే ఎన్నికల్లో కౌరవ వధ తప్పదు. కౌరవ సభను గౌరవ సభగా మార్చాకే తిరిగి వస్తానన్న మాట నెరవేర్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఓటుకి పది వేలు అయినా ఇచ్చి ఓటు వేయించుకుంటాడు. గెలిచాక లక్ష దోచుకుంటాడు. ఈ జగన్ ని చిత్తుగా ఓడించండి. కూటమి అభ్యర్ధులను గెలిపించండి” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్