- చంద్రబాబు గారిని చాలా కఠినమైన పరిస్థితుల్లో చూసా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో.. కానీ ఎలాంటి బెరుకు లేకుండా కనపడ్డారు.
- జగన్ సైకోపాత్ తో పాటు సోసియో పాత్.. ఎవ్వరు నవ్వినా, తెల్లబట్టలు వేసుకున్నా, సంతోషంగా ఉన్నా చూడలేడు
- ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు.. ఇది కూటమి లక్ష్యం
- లా & ఆర్డర్ బలంగా చూసుకునే ప్రభుత్వాలు రావాలి.. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు దేవాలయాలపై ఇలాంటి దాడులు, దుర్ఘటనలు జరగలేదు.
- చంద్రబాబు గారు ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్ అంటే, జగన్ అసలు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోనే ఈగలు తోలుకునే పరిస్థితి ఇంకో ఎయిర్ పోర్ట్ అవసరమా అని, అధికారంలోకి వచ్చాక ఎయిర్ పోర్ట్ క్యాన్సల్ అయింది అని భూముల ధరలు పడిపోయేలా చేసి, బినామీలతో ఆ భూములు చేజిక్కిచ్చుకుని మళ్ళీ అక్కడే ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన చేసాడు
- నవనందులు చేసే తలతిక్క పనులు చేస్తాడు జగన్..
- ఇంటి నుండి బయటకు రాని మా ఇంటి ఆడపడుచులని కూడా తిట్టారు. ప్రజలకోసం భరించాం..
- చిన్న గులకరాయి పెట్టుకుని, పెద్ద ప్లాస్టర్ వేయించుకున్నాడు జగన్. ఎక్సిబిషన్ చేస్తూ ఉన్నాడు, రామతీర్థం లో రాములవారి విగ్రహం నరికేస్తే దానికి బాధ లేదు, గొడ్డలి వేటు పడితే అది గాయం కాదు.
- సొంత చెల్లె అంటుంది.. కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలీదు కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రమంతా సమస్యా, గొడ్డలి వేటు పడితే సమస్య లేదా అని
- వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణాలో దేశంలోనే 3వ స్థానంలో ఏపీ.
- పేదలకు చెల్లించే కేంద్ర జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్ళించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ.
- వైసీపీ దోపిడీ వల్ల స్థానికులు నెల్లిమర్లలో ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం దొరకని పరిస్థితి.
- రామతీర్థంలో శ్రీరామ చంద్రులవారి విగ్రహం తల నరికేస్తే పూజారి గారు పట్టుకుని ఏడుస్తున్న చిత్రం నాకు మనసులో ఉండిపోయింది
- ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బ తింటున్నాయి, విజయనగరం వలసలకు మారు పేరయింది. విజయనగరం, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, పరిశ్రమలు రావాలి, యువతీ యువకులకు ఉపాధి హామీలు రావాలి. అదే ఆలోచనతో నేను పొత్తుని ప్రకటించాను.
- అమరావతికి 35 వేల ఎకరాలు కాదు 55 వేల ఎకరాలు కావాలన్న జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నాడు, ఉత్తరాంధ్ర వెనుకబడుతుందన్నాడు కానీ ఈ రోజుకి మన రాష్ట్రానికి రాజధాని లేదు.
- క్లాస్ వార్ అంటాడు జగన్.. అరె కోట్ల రూపాయల కష్టార్జితాన్ని కౌలురైతులకి ఇచ్చే నాకు పేదల పొట్ట కొట్టే అవసరం ఏముంది!
- ఓటు చీలకుండా ఉంటే జగన్ అనే గుండాని బంగాళాఖాతంలో కలిపేయొచ్చు.. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల్లో ఉంది, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనుకబడిపోయింది. ఒక్క గంజాయిలోనే నం 1 గా ఉంది.
- విజయం ఖాయం అని విజయనగరం ఘన స్వాగతం చూసాకా అర్థమయ్యింది. కడపలో జగన్ కి వెన్నుపూస నుండి చలి వస్తా ఉంది.
- వైసిపి అవినీతి కోటని బద్దలు కొడుతున్నాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం