నరసాపురం – హైలెట్స్

నరసాపురం
  • 10 ఏళ్ళ కాలం పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఏరోజూ బలమైన పార్టీగా ఎదిగింది జనసేన
  • జగన్ లాంటి ఇక నియంతను ఎదుర్కోవాలి అంటే ఎంతో బలం, ధైర్యం కావాలి, నరసాపురం లాంటి చిన్న ప్రాంతం నుండి వచ్చిన కుటుంబం మాది, అయినా సరే సగటు మనిషి తాలూకు ఆవేదన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది
  • నేను చాలా కష్టపడి, పెద్దలందరితో మాట్లాడి NDA కూటమి ని తీసుకొచ్చాను, కారణం మనకు కేంద్ర సహకారం కావాలి, వైయస్ జగన్  పాలనలో నాశనం అయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, నేను కేంద్ర నాయకులు అమిత్ షా గారిని, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని కూడా రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి మనం కలిసి పనిచేయాలని కోరాను
  • నరసాపురం పార్లమెంట్ నుండి భూపతిరాజు శ్రీనివాసరాజు గారిని కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను
  • ప్రతీ చేతికి పని – ప్రతీ చేనుకు నీరు ఇదే జనసేన – టీడీపి – బీజేపి కూటమి లక్ష్యం
  • అధికారంలోకి వచ్చాక అభివృద్ధితో పాటు సంక్షేమం అందించే లక్ష్యంతో పనిచేస్తాం, ఏ పథకాన్ని మీకు తగ్గించము, మేము హామీ ఇచ్చిన ప్రతీ పథకాన్ని అందిస్తానని మీకుణామి ఇస్తున్నాను
  • నదుల అనుసందానం ద్వారా నీటి కొరత లేకుండా చూస్తాం, సాధ్యమైనంత త్వరగా ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని పూర్తిచేస్తాం
  • యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతీ చేతికి పని అందించేలా కృషిచేస్తాము. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని మేము చెప్పం, ఇప్పుడు కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇస్తున్నాము
  • రైతులకు సంవత్సరానికి 20 వేలు ఆర్థిక సాయం, మహిళలకు ప్రతీ నెలకు 1,500, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆటో డ్రైవర్ సోదరులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నడిపి పేదల ఆకలి తీర్చుతాం
  • BC వర్గాలకు స్థానిక ఎన్నికల్లో 34 % నుండి 24 శాతానికి రిజర్వేషన్లు తగ్గించింది వైసీపీ పార్టీ ప్రభుత్వం, వాటిని మేము మళ్ళీ 34 శాతానికి పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నాము
  • BC, SC, ST సబ్ ప్లాన్ నిధులు దారి మల్లకుండా వారికే అందిలే చూస్తాం
  • వశిష్ఠ వారధి నరసాపురం – సఖినేటిపల్లి, నరసాపురం నుండి కోనసీమకు నిర్మిస్తాం, నరసాపురం నుండి రైలుకూత కోనసీమకు వెళ్లేలా చేస్తాం
    వశిష్ఠ వారధి నిర్మించకుండా ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకు లేదు అని వైసీపీ పార్టీ ఎంఎల్ఏ కు చెప్పండి
  • ఇక్కడ మహిళలు క్రొయేషియా లేసులు తయారీ చేస్తారు, ఇంట్లో అల్లికలు చేసేవారు, ఒకప్పుడు వేలలో ఉండేవారు, ఇప్పుడు ప్రోత్సాహం లేక వందల్లో ఉన్నారు, వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి మహిళలకు ఆర్థిక సాధికారత కలిగేలా చూస్తాం
  • మత్స్యకారుల అధికంగా ఉండే ఈ ప్రాంతంలో మత్స్యశాఖకు కనీసం పూర్తిస్థాయి అధికారి కూడా లేడు ఈ వైసీపీ ప్రభుత్వంలో
  • గత టీడీపి ప్రభుత్వ హయంలో యూనిట్ ₹1.5 ఉన్న కరెంట్ చార్జీలు ఇప్పుడు ఈ గుదిబండ వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ₹5 కు చేరింది
  • ఆక్వా పరిశ్రమపై ఆధారపడిన నరసాపురంలో హ్యాచరీలకు కరెంట్ యూనిట్ 8 రూపాయలకు పెంచారు, సీడ్ ధర దాదాపు 1,100 పెరిగింది, సీడ్ రైతులు నష్టపోకుండా, లాభసాటి ధర ఉండేలా చూస్తాం
  • గుజరాత్ తరవాత 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ప్రాంతం మన రాష్ట్రం, మత్స్యకారులు అధికంగా ఉన్న ప్రాంతం, బొమ్మిడి నాయకర్ గారుంకెవలం మా పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు ప్రతినిధిగా నేను భావిస్తున్నాను
  • డీప్ సీ ఫిషింగ్ కోసం సముద్రం లోకి వెళ్లి వేరే దేశాల చేతిలో అరెస్టు అయిన ఎంతోమంది మత్స్యకారుల గురించి నాకున్న సత్సంబందాలతో కేంద్రంతో మాట్లాడి వారి విడుదలకు కృషిచేశాను
  • జీవో 217 రద్దు కోసం బొమ్మిడి నాయకర్ గారు పాదయాత్ర చేస్తే మేము ఇక్కడ సభ పెట్టి జీవో 217 చింపేసాం, అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తాం
  • ఇక్కడ దాదాపు 54 సొసైటీలు ఉన్నాయి, ఒక్క సొసైటీకి కూడా లోన్ రాలేదు, మా NDA ప్రభుత్వం రాగానే లోన్ వచ్చేలా చేస్తాం
  • జగన్ ప్యాలెస్ లు కట్టుకుంటున్నాడు కానీ మత్స్యకారులకు హార్బర్లు, జెట్టీలు పూర్తిచేయడం లేదు
  • విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో బొట్లు ధ్వంసం అయితే ఒక్కొక్క బొట్ కి 50 వేల ఆర్థిక సాయం మేము అందిస్తే, మా సాయం తీసుకుంటే మీకు బోట్ ఇవ్వం, సబ్సిడీ డీజిల్ ఇవ్వం అని వైసీపీ పార్టీ నాయకులు భయపెట్టారు, కానీ మత్స్యకారులు మాత్రం మా దగ్గరకు వచ్చి జనసేన మాత్రమే మమ్మల్ని ఆడుకుని భరోసా ఇచ్చింది అని చెప్పారు
  • మత్స్యకారులకు కార్డులు లేవని ఇస్న్సూరెన్స్ ఇవ్వడం మానేసింది వైసీపీ పార్టీ ప్రభుత్వం, 10 లక్షల బీమా ఇస్తాం అని చెప్పి 5 లక్షలు, అది కూడా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. మేము మా పార్టీ కార్యకర్తలకు 5 లక్షలు ఇస్తున్నాం
  • అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు ఖచ్చితంగా 10 లక్షల బీమా కల్పిస్తాం
  • శెట్టి బలిజ ప్రజల మీద ఎక్సైజ్ శాఖ వారు కేసులు బనాయిస్తున్నారు, అధికారంలోకి వచ్చాక ఆ కేసులన్నీ తీసేస్తాం
  • స్థానిక MLA ప్రసాద్ రాజు గారు ఒక్క కులంపై కక్ష గట్టి, దాదాపు 30 మంది అధికారులను ట్రాన్సఫర్ చేశారని తెలిసింది. ఇది సరికాదు, ఎవరు ఏ కులంలో పుట్టాలని ఎవరో నిర్ణయించుకోరు
  • జగన్, నువ్వు శివశివాణి స్కూల్లో 10th పేపర్లు కొట్టేసిన సమయంలో, నేను విప్లవనాయకుడు చే గువేరా గురించి చదువుకున్నాను, నా దగ్గర నీ చిల్లర ఎవారాలు చూపించకు, మీరు నన్ను బూతులు తిట్టినా సరే, నేను తెగిస్తే మీరు ఊహించిన దానికంటే పదింతలు తెగిస్తాను, నా తెగింపు నీకు తెలియదు వైసీపీ పార్టీ
  • నేను ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయను, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తి చేసే రాజకీయం మీకు చూపిస్తాను
  • నేను బయటకు రాగానే వైసీపీ పార్టీ కాపలా కుక్కలు చాలామంది బయటకు వచ్చి మొరుగుతాయి, ఈ కుక్కలన్ని బయటకు వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోను
  • ఈరోజు NDA కూటమిని బలంగా నిలబెట్టి, మీ ముందు బలంగా నిలబడ్డాను అంటే దానికి కారణం చిరంజీవి గారి పుణ్యం, నరసాపురం కాలేజీలో చదువుకునే అత్యున్నత స్థాయికి వెళ్లిన వ్యక్తి, అలాంటి చిరంజీవి గారి గురించి సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ ఎంతమంది వచ్చినా అని తప్పుగా మాట్లాడుతున్నాడు, మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ఇలాంటి మాటలు వస్తున్నాయి
  • సూపర్ స్టార్ రాజనీకాంత్ గారు చంద్రబాబు గారి గురించి మంచిగా మాట్లాడితే ఆయన్ను తిడతారు ఈ వైసీపీ పార్టీ నాయకులు
  • మెగాస్టార్ చిరంజీవి గారు పాలసీల గురించి బాగుంది అంటే ఆయన మంచివారు, కానీ జనసేనకు 5 కోట్లు విరాళం ఇవ్వగానే, NDA కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వగానే చిరంజీవి వచ్చినా ఎవరొచ్చినా ఏం చేయలేరు, సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు వైసీపీ పార్టీ నాయకులు. వైసీపీ నాయకులు సింహాల్లా ఉన్నారా అద్దంలో మొహం చూసుకోండి గుంటనక్కల్లా ఉన్నారు
  • బాబు సజ్జల సజ్జల రామకృష్ణ నీకు నా సంగతి తెలియదు, నేను కులాలను కలుపుకుంటూ వెళ్తున్నాను, మీరు మీ నాయకుడు కులాలను విడదీసుకుంటూ వెళ్తున్నారు
  • సజ్జల సజ్జల రామకృష్ణ మీరు పులివెందుల నుండి వచ్చి ఉండొచ్చు, ఒక విప్లవ నాయకుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను
  • ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు అని కాదు, ప్రతీ సమాజంలో అరాచకానికి ఎదురుతిరిగి ప్రశ్నించే యువత ఉండాలి, పోరాటం చేసే ధైర్యం ఉండాలి
  • ఎన్నికల సమయంలో ఎర్రి గొర్రె వేషాలు వేస్తే అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటాం జాగ్రత్త వైసీపీ పార్టీ నాయకుల్లారా
  • సజ్జల సజ్జల రామకృష్ణ మా అన్నయ్య చిరంజీవి గారి జోలికి రాకు, మా అన్నయ్య అజాత శత్రువు, ఆయన ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మీ పాలసీలకు మద్దతు ఇచ్చిన రోజు కూడా నేను ఆయనను ప్రశ్నించలేదు, అలాంటి వ్యక్తి జోలికి రాకు, నువ్వు మా అందరి ట్యాక్స్ సొమ్ము తింటున్నావు, ఈ మధ్యే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని
  • మా అన్నయ్య జోలికి కానీ, నా ప్రజల జోలికి కానీ, నా శెట్టి బలిజ, మత్స్యకార, కాపు , ఇతర అన్ని వర్గాల జోలికి రాకు చూస్తూ ఊరుకోను సజ్జల రామకృష్ణ
  • సమాజంలో స్వేచ్చ రావాలంటే NDA కూటమి రావాలి. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారు, సూపర్ స్టార్ రాజనీకాంత్ గారు, సామాన్య ప్రజలు ఒక్క మాట మాట్లాడితే స్వేచ్చ లేకుండా చేసింది వైసీపీ పార్టీ ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చాక ప్రజలకు స్వేచ్చ కల్పిస్తాం
  • టీవీ డిబెట్లలో ఇష్టమొచ్చినట్లు మా గురించి మాట్లాడుతున్న ప్రతీ ఒక్కరినీ గుర్తుంచుకుంటాం, అధికారంలోకి వచ్చాక ఎవరిని మర్చిపోను
  • జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు, నువ్వెంత నీ బ్రతుకెంత వైయస్ జగన్, సిఎం కదా అని పొగరెక్కి కొట్టుకుంటున్నావ్, నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకేలా ధైర్యంగా మాట్లాడతా, ఎన్నికల సమయం అని కాదు, జాగ్రత్తగా ఉండు
  • సజ్జల గారు మీరు సింహాలు కాదు కలుగుల్లో దాక్కున్న పందికొక్కులు, మీది సింహాల సమూహం కాదు, పందికొక్కుల సమూహం, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి
  • మార్వాడి, జైన్ వర్గ ప్రజలందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు
  • మత ప్రచారం తప్పు కాదు, ఇతర మతాల ప్రార్థన ప్రదేశాల్లో, తిరుమల లాంటి పవిత్ర ప్రదేశాల్లో మత ప్రచారం చేయడం మాత్రం తప్పు, రాజ్యాంగం మాట స్వేచ్చ ఇచ్చింది ఎవరూ దాన్ని తప్పు పట్టడానికి వీలులేదు
  • గాజు గ్లాస్ పంచే కొద్ది ప్రేమ ఇస్తుంది, శత్రువు ఎదురు తిరిగితే పడునెక్కిద్ది
    వైసీపీ కి వ్యతిరేకంగా పోరాటం భవన నిర్మాణ కార్మికుల సమస్య తో ప్రారంభించా, ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మీ సమస్యలు తీరుస్తాను
  • నేను మీ ప్రేమకు బానిస, మీ సేవకుడిని, మీ ప్రేమ ఉన్నన్ని రోజులు నా ఆరోగ్యానికి ఏమీ కాదు

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్