జనసేనానికి నరసాపురం బ్రహ్మరథం

జనసేనా

• వారాహి విజయభేరి యాత్రకు తరలి వచ్చిన ప్రజావాహిని
• హారతులతో స్వాగతం పలికిన వీర మహిళలు, జన సైనికులు
• జనప్రభంజనం మధ్య భారీ రోడ్ షో
నరసాపురం పట్టణాన్ని జనసైన్యం ముంచెత్తింది. రహదారుల వెంట వీర మహిళలు బారులు తీరారు. హారతులు, జేజేలతో వారాహి విజయభేరీ యాత్రకు తరలివచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అఖండ స్వాగతం పలికారు. జన సైనికుల కేరింతలు, ఆడపడుచుల ఆత్మీయ స్వాగతం మధ్య సుమారు ఐదు కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. స్వర్ణాంధ్ర కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి మున్సిపల్ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభ వరకు రహదారులు జనంతో కిక్కిరిశాయి. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. స్వర్ణాంధ్ర కళాశాల ప్రాంగణంలోనే పలువురు యువకులు తమ సమస్యలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. తమ సమస్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు గళం విప్పాలని కోరగా, ఆయన ప్లకార్డులను స్వీకరించారు. రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన ఆడపడుచులు హారతులు పట్టగా వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగారు. జాతీయ రహదారికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో బైకులతో యువత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించారు. యర్రంశెట్టివారిపాలెం, రుస్తుంబాద, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా సభా వేదికకు చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వేదిక పైకి వచ్చిన దగ్గర నుంచి ప్రసంగం ముగిసేంత వరకు ఆడపడుచులు హారతులతో ఆయనకు దిష్టి తీస్తూ కనబడడం గమనార్హం.
• తాపీ బహూకరించిన భవన నిర్మాణ కార్మికులు
భవన నిర్మాణ కార్మికుల తరఫున ప్రతి సభలో గళం విప్పుతూ.. మొదటి రోజు నుంచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారాహి విజయ భేరీ సభ వద్ద భవన నిర్మాణ కార్మికులు జనసేన ముద్రతో కూడిన తాపీ, సిమెంటు పనికి ఉపయోగించే ఇనుప గమేలాను జ్ఞాపికలుగా అందచేశారు. కూటమి ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
• జిల్లా కేంద్రం పోయింది.. అవినీతి పెరిగింది: శ్రీ బొమ్మిడి నాయకర్
ఐదేళ్ల వైసీపీ పాలన నమ్మి ఓటు వేసిన అన్ని వర్గాలను నాశనం చేసింది. నరసాపురానికి రావాల్సిన జిల్లా కేంద్రం పోయింది. ఇక్కడ ఎమ్మెల్యే అవినీతి తారా స్థాయికి చేరిందని కూటమి బలపర్చిన నరసాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్ధి శ్రీ బొమ్మిడి నాయకర్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ “స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు ప్రశ్నించిన ప్రతిపక్షాల మీద కేసులు పెట్టించాడు.. కులాల మధ్య చిచ్చుపెట్టాడు. ఇక్కడ మెడికల్ కాలేజీ తేలేకపోయాడు. తాగునీటి కటకట. కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి సమస్యా పరిష్కరిస్తాం. 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులకు మద్దతు పలకాలి” అని అన్నారు. కూటమి బలపర్చిన బీజేపీ పార్లమెంటు అభ్యర్ధి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, విధ్వంసకర పాలనను తరిమికొట్టాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో, శ్రీ మోదీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీ మోదీ గారికి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన శ్రీ చంద్రబాబు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఛరిష్మా తోడయ్యింది. వీరిని ఢీ కొట్టే ప్రయత్నం చేసిన జగన్ ఎన్నికల తర్వాత బెంగళూరుకి వలస పోకతప్పద”ని అన్నారు. సభలో జనసేన నేత, మాజీ మంత్రి శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ బండారు మాధవనాయుడు, జనసేన రాష్ర్ట కార్యదర్శి శ్రీ చాగంటి మురళీకృష్ణ, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ శ్రీ పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంఛార్జ్ శ్రీ మేకల సతీష్ తదితరులు ప్రసంగించారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్