జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు సతీమణి శ్రీమతి పద్మ గారు ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనిలోని 22, 23, 27 వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన మ్యానిఫెస్టోను ప్రజలకు అందజేస్తూ జనసేనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా చేపట్టదలచిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. బీజేపీ కన్వీనర్ శ్రీ కృష్ణం రాజు గారి సతీమణి శ్రీమతి దివ్య రాజు, శ్రీమతి చల్లా లక్ష్మీ, శ్రీమతి గంటా స్వరూపా, శ్రీమతి కడలీశ్వరి, శ్రీ శంకర్ గౌడ్, శ్రీ రంగ బాబు, శ్రీ అల్లం కిషోర్, శ్రీ తేజ, శ్రీ చంద్ర శేఖర్, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.