• విజయ జనార్ధన స్వామి జాతర ఘనంగా నిర్వహిస్తాం
• మధ్య తరగతి కుటుంబాల బాధలు మాకు తెలుసు
• జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు
రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారం చేసి, ఎవరు ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకునే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున భరోసాగా అందజేసిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. యూ కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ వర్మ గారి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాన్ లోకల్ అని దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రతీ ప్రాంతం నాది అని భావించి సేవ చేసే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంను నా కుటుంబం అని భావించి సేవ చేస్తారని వెల్లడించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం శాసనసభ్యులుగా గెలిచిన వెంటనే యూ కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో విజయ జనార్ధన స్వామి దేవాలయం జాతర వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. స్వతహాగా మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన తమకు మధ్య తరగతి కుటుంబాల బాధలు తెలుసునని మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనకరమైన విధానాలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పని చేస్తారని అన్నారు. బీజేపీ పిఠాపురం నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ శ్రీ బుర్రా వరుణ్ కృష్ణంరాజ్, జనసేన నాయకులు శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, స్థానిక నాయకులు శ్రీ తెలగంశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీ సూర్య, తెలుగుదేశం నేతలు శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ సత్యానందరెడ్డి, శ్రీ బాబీ తదితరులు పాల్గొన్నారు.