- భారతదేశానికి జాతీయ పతాకం అందించిన పింగళి వెంకయ్య గారిని స్మరించుకుంటున్నాను
- నా జీవితాన్ని ప్రభావితం చేసిన తత్వవేత్త, శ్రీ ఉప్పలూరి కృష్ణమూర్తి గారు మన మచిలీపట్నంలో పుట్టారు, ఆయన పాద పద్మాలకు నా నమస్కారం
- ఇక్కడ ఇంతమంది యువత ఉన్నారు, వారికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా దేశ సంపద అయినా ఈ యువతకు ఉపాధి కల్పిస్తాం. ఇంతటి ప్రకృతి వనరులున్న ప్రాంతంలో ఉపాధి లేకపోవడం భాదగా ఉంది
- ఇక్కడ ఉన్న MLA వారాహి ఎలా వస్తుందో చూస్తాను అన్నాడు, నీ తాటాకు చప్పుళ్లకు భయపడతానా? ఆకు రౌడి మాటలకు భయపడతానా? అతని కొడుకు ఎంఎల్ఏ అభ్యర్థి అంట ఇప్పుడు, కొడుకేమైనా దిగొచ్చాడా? రక్తం ఏమైనా బ్లూ రంగులో ఉందా? అతను దాడులు చేస్తే భరించాలా
- మొన్న తెనాలిలో మాట్లాడుతూ చెప్పాను, జగన్ కు గాయం అయితే రాష్ట్రానికి గాయమైంది అంటున్నారు, ఇంతమంది యువతకు ఉపాధి లేకపోతే అది రాష్ట్రానికి గాయం కాదా? మత్స్యకారులకు ఉపాధి లేదు, చేనేత,కలంకారీ కార్మికులకు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బాపట్లలో 15 ఏళ్ల అమర్నాథ్ అనే అబ్బాయి తన సోదరిని యేడిపిస్తున్నారని అడ్డుకుంటే పెట్రోల్ పోసి వైసీపీ పార్టీ నాయకులు తగలబెట్టారు ఇవి రాష్ట్రానికి గాయం అయినట్లు కాదా జగన్
- జగన్ తలకి రాయి ఎలా తగిలిందో, ఆయనే కొట్టిచ్చుకున్నాడో తెలియదు, మాకేమైన సరదానా నీ మీద దాడి చెయ్యడానికి, మీ లాగ క్రిమినల్స్ కాదు మేము, అందరి మీద దాడి చేసే నీ మీద ఎవరు దాడి చేస్తారు? సొంత బాబాయ్ ను అడ్డంగా నరికించిన వాడివి, నరికేసిన వారిని వెనకేసుకొచ్చే వ్యక్తి నువ్వు
- కేంద్రం మెడలు వంచుతాడంట, అంటే నరేంద్రమోదీ గారి మెడ వంచుతావా? అసలు ఆయనతో మాట్లాడగలవా? రాష్ట్ర విభజన అప్పుడు సోనియా గాంధీ ముందు స్పెషల్ స్టేటస్ గురించి చిన్న ప్లకార్డ్ పట్టుకునే దమ్ము లేక మూలన దాక్కున్న నీకు దమ్ము, ధైర్యం ఉందా వైయస్ జగన్
- సినీరంగంలో మెగాస్టార్ చిరంజీవి గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అల్లుఅర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూ.ఎన్‌టిఆర్ గారు ఇలా ఎంతోమంది కథానాయకులు ఉన్నారు, కానీ ఏరోజు చిత్రపరిశ్రమ ను ఎవరూ వేదించలేదు
- మేము సుభాస్ చంద్రబోస్ గారి స్ఫూర్తి నింపుకున్న వాడిని, మీ లాంటి ఆకు రౌడిలకు భయపడతామా? మా సైన్యం రోడ్లమీదకు వస్తే తట్టుకోగలరా మీరు, 10 మంది ఆకు రౌడీలను వేసుకుని తిరిగితే భయపడతామా
- అంబేద్కర్ గారు బలమైన రాజ్యాంగం ఇచ్చారు, హక్కులు ఇచ్చారు, మీరు భయపడితే ఎలా, జై భీం అంటే సరిపోదు, బలంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులు ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి
- అధికారం పరమావధి కాదు, మార్పు పరమావధి
- నిన్న వైయస్ జగన్ భీమవరంలో మాట్లాడుతూ పెళ్ళాం అని అంటున్నాడు, జగన్ సతీమణి భారతి గారి గురించి అనడానికి మాకు ఎంతో సేపు పట్టదు, పెళ్ళాం అని మేము దిగజారి మాట్లాడం, ఈ దిగజారుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ఎన్నికల కమీషన్ కు పిర్యాదు ఇవ్వనున్నాం
- సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వాడు, గోడకేసి కొట్టేవాడు వైయస్ జగన్ , మరో చెల్లి డాక్టర్ సునీత గారి గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తి ఈ జగన్
- చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు, జగన్ లా వ్యవహరించి ఉంటే అసలు వైయస్ జగన్ రోడ్ల మీద తిరిగేవాడా, ప్రజాస్వామ్యం గౌరవించే వ్యక్తి ఆయన, కానీ జగన్ అలా కాదు
- జగన్ ను రాజకీయాల నుండి పక్కన పెట్టకపోతే అతని లాంటి వ్యక్తులు రాష్ట్రానికి, దేశానికి చీడ పురుగులు, మా భవిష్యత్తు కోసం మాట్లాడటం లేదు, మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను
- రాష్ట్ర భవిషత్తు కోసం 3 పార్టీలు తగ్గి వచ్చాం, మనకు ఓటు శాతం పెరిగినా, బందరు బలమైన స్థానం అయినా సరే కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి వచ్చాం
- మీ భవిష్యత్తు కోసం పనిచేసేవారు, యువతకు ఉపాధి, మత్స్యకారులకు ఉపాధి కల్పించేవారు కావాలి, అసెంబ్లీలో బూతులు తిట్టేవారు మీ భవిష్యత్తు కోసం ఎందుకు మాట్లాడుతారు, అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ముందుకొచ్చాం
- జగన్ మాట్లాడితే మండదా అంటున్నాడు, రాయి వేసినందుకు మండింది అంట, మీకు రాయి తగిలినందుకు మండితే నీపాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం
పోలవరం రాకుండా చేసావు మండదా
రాజధాని లేకుండా చేసావు మండదా
అంబేద్కర్ విదేశీ విద్య ఆపేసావు మండదా
15 ఏళ్ల అమర్నాథ్ ను కాల్చి చంపిన వారికి బెయిల్ ఇప్పించావు మండదా
దళిత డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి చంపించావు మండదా
దళిత డ్రైవర్ ను చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే మండదా
30 వేల మహిళలు అదృశ్యం అయితే ప్రజలకు మండదా
అంగన్వాడీ టీచర్లను కాళ్ళతో తొక్కిస్తే మండదా
ఆశా వర్కర్లను జైల్లో పెట్టిస్తే మండదా
నిరంకుశపాలన చూస్తే మండదా
అన్ని విధాలుగా మండిపోయి ఉన్నారు జనాలు - వై నాట్ 175 అంటున్నాడు జగన్, జగన్ కు 15 చాలు, మీ భవిష్యత్తు కోసం అంతకంటే ఎక్కువ అవసరం లేదు
- ఇక్కడి ఆకు రౌడి ఎంఎల్ఏ నేను కాపును కాబట్టి మావాడే అని తిడతాడంట, కులం కులం ఒకటైతే నోటికి ఎంతొస్తే అంత మట్లాడుతావా? నువ్వు వెళ్ళి కుక్క పిల్లలా కూర్చుని వైయస్ జగన్ కు ఊడిగం చేసుకో, ఎక్కువ మాట్లాడకు, తమాషలుగా ఉంది ఒక్కొక్కడికి, మర్యాదగా మాట్లాడుతాను, మర్యాద ఇస్తాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ప్రజాస్వామ్యం మీద గౌరవంతో ఊరుకుంటున్నాను, కసి లేక కాదు
- నేను పాతిక సంవత్సరాలు నాజీవితాన్ని రాజకీయాలకు అంకితం చేశాను, రాష్ట్రం కోసం, దేశ బాగు కోసం, తెలుగు ప్రజల ఐక్యత కోసం వచ్చాను, నాతో గొడవలు పెట్టుకోకు, నాతో గొడవలు పెట్టుకోవడం అంటే వచ్చే పాతిక సంవత్సరాలు నీ బిడ్డలతో కూడా గొడవ పెట్టుకునేలా ఉంటుంది గుర్తు పెట్టుకో పేర్ని నాని
- చంద్రబాబు గారికి కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన తప్పులకి ఎప్పుడో జైల్లో పెట్టించేవారు, ఆయన పెద్ద మనసు వదిలేసింది, కానీ అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రం అంతా కెలికేసి రాజకీయం చేస్తారు, వారి ప్రాంతంలో మాత్రం ఎవరూ రాకూడదు అంట
- యువత కులాన్ని, జిల్లాను, ప్రాంతాన్ని దాటి రండి, కుల గణాంకాల కంటే ముందు యువత నైపుణ్య గణాంకాలు తీయమని చంద్రబాబు గారికి కూడా చెప్పాను, వారికి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వారి అభిరుచికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి
- మత్స్యకారుల ఒలంపిక్స్ కు వెళ్లగలిగే సామర్థ్యం ఉన్న గజ ఈతగాళ్లు ఉండి ఉండొచ్చు, వారిలోని సామర్థ్యం వెలికి తీయాలి, ప్రోత్సహించాలి
- చంద్రబాబు గారు ఒక దార్శనికుడు, 1998 లో మాదాపూర్ ప్రాంతానికి ఇప్పటికీ ఎంతో మారింది, ఆయన ఆరోజు విజనరీ గా విజన్ 2020 అని ఆలోచించడం వల్ల గొప్ప నగరంగా ఎదిగింది, సంపద సృష్టించగలిగారు
- నాకు చిరంజీవి గారు సంపద సృష్టించే మార్గం చూపించబట్టే నేను ఎదిగాను, కౌలు రైతులకు అండగా నిలబడి సాయం చేయగలిగాను
వచ్చే పాతిక సంవత్సరాలు మీ కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్న, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి - నా దగ్గర పోరాట పటిమ ఉంది, బలం ఉంది, చంద్రబాబు గారి దగ్గర అనుభవం ఉంది, నరేంద్రమోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజా కోసం పనిచేయాలనే భాధ్యత తో వచ్చాం, ఆశీర్వదించి గెలిపించండి
- మచిలీపట్నం MP గా జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారిని గాజు గ్లాస్ గుర్తు పై, MLA అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను