రాష్ట్రంలో ఊపు చూస్తుంటే… కూటమి విజయం వన్ సైడ్ అయిపోయింది

కూటమి

• మైనార్టీలకు కూటమి ప్రభుత్వంలో ఏ లోటు రాదు
• 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తాం
• 33 మంది వృద్ధుల చావుకు కారకుడు జగన్
• పింఛను పంపిణీ కావాలనే క్లిష్టం చేస్తున్నాడు
• పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే ఉద్యోగులు వందశాతం కూటమికి అండగా నిలవాలి
• నెల్లూరు ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘జగన్ కు శవ రాజకీయాలు బాగా వంట బట్టాయి. ఎన్నికల కమిషన్ పింఛను పంపిణీ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని చెబితే, జగన్ 33 మంది వృద్ధుల ప్రాణాలు తీసి రాజకీయాలు చేస్తున్నాడు. ఇంటింటికి వెళ్లేందుకు, పింఛన్లు పంపిణీ చేసేందుకు 1.50 లక్షల మంది సచివాలయ ఉద్యోగులున్నా, వారిని వినియోగించుకోకుండా వృద్ధుల ప్రాణాలు తీసి జగన్ ఆనందపడుతున్నాడ’ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఓ బందిపోటుకీ, ఐదు కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం. విధ్వంసానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న యుద్ధం. రాతియుగం పోయి రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలి అంటే రాష్ట్రం నుంచి సైకో పారిపోయేలా చేయాలన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లో ఉద్యోగులు 100 శాతం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్ డబ్బు, కుట్రలతో రాజకీయం చేయాలని చూస్తున్నారని, ఎన్ని అబద్దాలు చెప్పినా వైసీపీకి ఓటు వేయొద్దని కోరారు. కూటమి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామన్నారు. నెల్లూరు నగరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ… “రాష్ట్రాన్ని పాలిస్తున్న దొంగను ఈ నెల 13వ తేదీన ఓటుతో అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. 25కి 25 పార్లమెంటు స్థానాల్లో, 165కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్ధులు గెలుస్తారని అర్ధం అవుతోంది. రాష్ట్రంలో ఏ ప్రాంతం వెళ్లినా ప్రజల ఉత్సాహం చూస్తే వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. కూటమి విజయం ఖాయం అయిందని తెలుస్తోంది. రాష్ట్ర యువత బాధ్యత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను తీసుకుంటాం. ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ ఖర్చు పెట్టే డబ్బు ప్రజల డబ్బే. భూ మాఫియాలో, మద్యం విక్రయాల్లో మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బు. పది రూపాయిలు ఇచ్చి 100 దోచుకున్నాడు. మీ ఆస్తుల పత్రాల మీద జగన్ ఫొటో వేసుకున్నాడు. ఇప్పుడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తున్నాడు. ఈ చట్టంలో మీ ఆస్తి పత్రాలు మీ దగ్గర ఉండవు. పత్రాలన్నీ ఆన్ లైన్ లోనే ఉంటాయి. మీ ఆస్తి అమ్మాలన్నా జగన్ అనుమతి కావాలి. ఇలాంటి వ్యక్తి వస్తే ప్రజలకు భవిష్యత్తు ఉండదు. మీ ఆస్తి మీ చేతుల్లోనూ ఉండదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్పీ మీద పెడితే, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు ఫైలు మీద పెడతాం.
• ముస్లిం మైనార్టీలకు లోటు లేకుండా చూస్తాం
గత తెలుగుదేశం పార్టీ ఎన్టీఏ ప్రభుత్వంలో ఉన్నా, ముస్లిం సోదరులకు ఎన్నో పథకాలు ఇచ్చాం. అప్పటిలాగానే ఇప్పుడు కూడా వారి అభ్యున్నతికి ఏ మాత్రం లోటు రానివ్వకుండా చూసుకుంటాం. ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం జరగదు. కూటమి ప్రభుత్వంలో ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తాం. హజ్ హౌస్ పూర్తి చేస్తాం. ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి మక్కా వెళ్లే వారికి లక్ష ఆర్థిక సాయం చేస్తాం. దుల్హన్ పథకం పునరుద్ధరిస్తాం. రంజాన్ తోఫా మళ్ళీ తెస్తాం. మౌలాలు, ఇమామ్ లకు నెలవారీ గౌరవ వేతనం రూ. 5 నుంచి రూ. 10 వేలకు పెంచుతాం. మసీదులకు ఆర్థిక సాయం చేస్తాం. కూటమి మేనిఫెస్టో ప్రజల భవిష్యత్తుకు మేలు చేస్తుంది. జగన్ రూ. 13 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచాడు. కూటమి ప్రభుత్వంలో సంపద పెంచి మెరుగైన సంక్షేమం అందిస్తాం. పేదల ఆదాయం పెంచుతాం. ఆడబిడ్డ నిధి కింద నెలకి రూ. 1500 చొప్పున ఐదేళ్లలో రూ. 90 వేలు ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం పథకం కింద చదువుకునే ప్రతి బిడ్డకి రూ. 15 వేలు ఇస్తాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందచేస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తాం. యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. రైతుని రాజుగా చేస్తాం. ఏడాదికి రూ. 20 వేలు పంట సాయం చేస్తాం. సామాజిక పింఛన్లు ఏప్రిల్ నుంచి రూ. 4 వేలు ఇచ్చే బాధ్యత మాది. దివ్యాంగులకు రూ. 6 వేలకు పింఛన్ పెంచుతున్నాం. ఈ జగన్ పింఛన్లు తీసేస్తామని దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తాం. చంద్రన్న బీమా కింద సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే రూ. 10 లక్షలు ఇస్తాం. బీసీలకు న్యాయం చేస్తాం. వచ్చే ఐదేళ్లలో బీసీల సంక్షేమానికి రూ. 1. 50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. కాపు సంక్షేమానికి రూ 15 వేల కోట్లు ఖర్చు చేస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు యువతకు ప్రతిభ గణన చేపడతాం. అలా చేస్తే మన యువత ప్రపంచాన్ని జయిస్తారు. నెల్లూరు పార్లమెంటు బరిలో ఉన్న శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, విజయ సాయిరెడ్డికి పొంతనే లేదు. సేవ చేయాలని వచ్చిన వ్యక్తి శ్రీ వేమిరెడ్డి, నెల్లూరుని పూర్తిగా దోచుకోవాలని వచ్చిన వ్యక్తి విజయసాయిరెడ్డి. శ్రీ నారాయణ మంత్రిగా నెల్లూరులో రూ.5,200 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరూపాయి ఖర్చు చేసింది లేదు. జగన్ అరాచకాలు చూసి తిరుగుబాటు చేసిన వ్యక్తి శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సమర్ధవంతమైన నాయకత్వాన్ని గెలిపించండి’’ అని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్