దుష్ట పాలన అంతమొందించి ధర్మ పాలన తీసుకొద్దాం

ధర్మ పాలన

• రాష్ట్ర క్షేమం కోసం ఏర్పడిన కూటమిని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలి
• మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫాంలు అందించిన శ్రీ పవన్ కళ్యాణ్
          ‘ధర్మానికి ప్రతీక శ్రీరాముడు. ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి పర్వదినాన వచ్చే ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేయబోయే జనసేన పార్టీ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేయడం ఆనందంగా ఉంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రాష్ట్రానికి మళ్లీ రామ రాజ్యం తీసుకొచ్చేలా పాలన అందిస్తామని అన్నారు. బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతామని అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా ఎదుర్కొని కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై ధర్మమైన పాలన రావాలన్నదే నా ఆకాంక్ష. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే దృఢ సంకల్పంతో ఏర్పడిన కూటమికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారికి పూర్తి స్థాయిలో జవాబుదారీతనం వహించేలా పాలన ఉంటుందని అన్నారు.
• వందశాతం విజయం సాధించాలి : శ్రీ నాదెండ్ల మనోహర్
          పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో అన్ని కోణాల నుంచి ఆలోచించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్ధులను ఎంపిక చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం మేరకు వందశాతం విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి ఒక్కరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్