ఏలూరుకు జనసేనాని….పార్టీ శ్రేణుల ఘన స్వాగతం

ఏలూరు

                 మలి విడత వారాహి విజయ యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏలూరు చేరుకున్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టిన జనసేనానికి ఏలూరు ఇంఛార్జ్ శ్రీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కలపర్రు టోల్ గేట్ వద్ద జిల్లాలో ప్రవేశించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై జన సైనికులు పూల వర్షం కురిపించగా, ఆడపడుచులు హారతులతో స్వాగతించారు. జాతీయ రహదారి నుంచి ఏలూరు వైపు వెళ్లే కూడలి వద్ద గజమాలలతో సత్కరించారు. అక్కడి నుంచి వందలాది జనసైనికుల జేజేల మధ్య ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి బస ఏర్పాటు చేసిన క్రాంతి ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. అంతకు ముందు హనుమాన్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులు పట్టారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్