జగన్ మూడవ డ్రామా మురిగిపోయింది

జగన్

• జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు
కోడి కత్తి డ్రామాతో ఒకసారి, బాబాయ్ గొడ్డలి పోటు డ్రామాతో మరొకసారి సానుభూతి డ్రామాలు ఆడిన జగన్ ముచ్చటగా మూడవ సారి ఆడిన గులకరాయి డ్రామా మురిగిపోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. జగన్ కు తగిలిన గులక రాయి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనేక మందిని గాయానికి గురి చేస్తోందని, ఈ మధ్య ఎవరి మొహం మీద చూసినా గులక రాయి తగిలిన బ్యాండేజిలే కనిపిస్తున్నాయని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం విరవాడ గ్రామం నుండి స్వచ్చందంగా వచ్చి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె నాగబాబు గారు సమక్షంలో మంగళవారం జనసేన పార్టీలో చేరిన వారితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్ కు తగిలిన గాయం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రక్తం కారిందని వాపోయిన వైసీపీ మంత్రికి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమర్ నాథ్ అనే బాలుడు తమ అక్క ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రతిఘటిస్తే ఆ బాలుడిని సజీవదహనం చేసినప్పుడు రక్తం కనబడలేదా అని ప్రశ్నించారు. ఆడ పిల్లలపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు, హత్యలు జరిగినప్పుడు ఎవరికీ పట్టని ప్రభుత్వంలో జగన్ కు గాయం జరిగినప్పుడే బాధకు గురి చేయడం బాధాకరమని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అమలు చేయకుండా తమ జేబులో డబ్బు దానం చేసినట్లు ప్రవర్తించిన తీరు బహిర్గతమైందని తెలిపారు. మత్స్యకారులు, చేనేత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, కుల సంఘాల కార్పొరేషన్ లు ఇలా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక విషయంలో కొర్రి పెట్టి తమకు రావాల్సిన కనీస ఆదాయ మార్గాలను కూడా విధ్వంసం చేసిన ఘనత ఘనకీర్తి మూట కట్టుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు తరిమి కొట్టాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసన సభ్యులుగా చేపట్ట దలచిన అభివృద్ధిని, మ్యానిఫెస్టోను వివరించారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్