జైలుకీ.. బెయిలుకీ మధ్య జగన్ జీవితం ఊగిసలాడుతోంది

జగన్

• ఆయన్ని జైలుకు పంపించే రోజులు దగ్గరపడ్డాయి
• రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్న జగన్ కు అండగా నిలబడితే ప్రజలకు ద్రోహం చేసినట్లే
• 2024లో వచ్చేది జనసేన- తెలుగుదేశం- బీజేపీ కూటమే
• మా విజయాన్ని ఎవడూ అడ్డుకోలేడు
• కోనసీమ కొబ్బరి రైతులకు అండగా ఉంటాం
• కోనసీమలో రైలు కూత వినపడేలా చేస్తాం
• అమలాపురం ప్రజాగళం బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘జగన్ జీవితం జైలుకు బెయిల్ కు మధ్య ఊగిసలాడుతోంది. ఆయన్ను జైలుకు పంపించి… వైసీపీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేసే రోజులు దగ్గరపడ్డాయ’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నన్ను అకారణంగా దూషించే వైసీపీ నాయకులు కోనసీమ రైతాంగం క్రాప్ హాలీడే ప్రకటించినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్న జగన్ లాంటి వ్యక్తికి అండగా నిలబడితే ప్రజలకు ద్రోహం చేసినట్లేనని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేది జనసేన- తెలుగుదేశం- బీజేపీ కూటమేనని… జోడెద్దుల మాదిరి సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అమలాపురం వస్తే సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. ఆడపడుచులు చూపిస్తున్న ప్రేమాభిమానులు వెలకట్టలేనివి. 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పడానికి కారణం… పచ్చగా కొబ్బరిచెట్లతో కళకళలాడుతున్న కోనసీమను కలహాల సీమగా వైసీపీ మార్చేసింది. కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూసింది. నిజమైన జైభీమ్ ఫాలోవర్ గా చెబుతున్నాను… అన్ని కులాలు బాగుండాలి. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తే సహించేది లేదు. 2024లో వచ్చేది కూటమి ప్రభుత్వమే. మన ప్రభుత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. లా అండ్ ఆర్డర్ పటిష్టం చేస్తాం. రైతులు క్రాప్ హాలీడే ప్రకటించకుండా చర్యలు తీసుకుంటాం.
• కూటమి విజయాన్ని ఆపేదెవడ్రా!
నేను ఏ రోజూ ఏ ఒక్క నాయకుడినీ వదులుకోవడానికి ఇష్టపడను. ప్రలోభాలకు తలొగ్గి పార్టీని వదిలి వెళ్లిపోతే నేను ఏం చేయలేను. అమలాపురం క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా… జనసేన పార్టీలోకి నాయకులు వస్తారు… వెళ్తారు. జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం, ప్రజాక్షేమం కోసం నిలబడతారు. వైసీపీ ప్రభుత్వం మన సినిమాల్ని ఆపేస్తే ఆ రోజునే చెప్పాను.. మనల్ని ఎవడ్రా ఆపేది… అని ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను మన కూటమి ప్రభుత్వంలోకి రాకుండా ఎవడ్రా మనల్ని ఆపేది. వచ్చేది ముమ్మాటికి జనసేన- తెలుగుదేశం-బీజేపీ ప్రభుత్వమే.
• భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తాం
వైసీపీ అధికారంలోకి రాగానే 40 లక్షల మంది భవననిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి కార్మికులను రోడ్డునపడేలా చేశారు. జేపీ వెంచర్స్ పేరుతో మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి ఒక ముఠాగా ఏర్పడి ఇసుకను అక్రమంగా దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భవననిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. వారికి భరోసా కల్పిస్తాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిస్తాము. ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి ఇంటి నుంచే వర్క్ చేసి సంపాదించేలా చర్యలు తీసుకుంటాం. కొన‌సీమ అంటే కొబ్బరి సాగుకు పెట్టింది పేరు. కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకులా భావిస్తారు. కోనసీమలో లక్షల హెక్టారుల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. లక్ష మందికి పైగా రైతులు, వేలమంది వ్యాపారులు, కార్మికులు దీనిపై ఆధార‌ప‌డి జీవనోపాధి కొన‌సాగిస్తున్నారు. కోనసీమ కొబ్బరికి మంచి డిమాండ్ ఉంది. ధరల పతనం వల్ల రైతులు నష్టపోతున్నారు. కోనసీమ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తాం. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య రైలు కూత వినాలని కోనసీమ వాసుల కల. ఆ కల సాకారం చేసేలా ప్రయత్నాలు చేస్తాం. అమలాపురం లోక్ సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ గంటి హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలబడితే కోనసీమ రైలు గురించి పార్లమెంట్ లో గళం వినిపిస్తారు. అలాగే నాకు ప్రధాన మంత్రితో సాన్నిహిత్యం ఉంది. ఆయన నోటి ద్వారా రైల్వే లైన్ వచ్చేలా ప్రకటన చేయిస్తాం. వైసీపీ నాయకులు దళితులను చంపి డోర్ డెలివరి చేశారు. అలాంటి వాళ్లకు అండగా నిలబడితే జైభీమ్ స్ఫూర్తికి విఘాతం కల్పించినవారమవుతాం. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కూటమికే పట్టం కట్టాలి.
• తప్పులు చేసేవారిని ఏమనాలి?
జగన్ రెడ్డిని ఏదో అన్నానని ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఏ పరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చిందో కచ్చితంగా వివరిస్తాను. తప్పులు చేసే వాడిని తప్పులు చేసే వాడనే అంటాం. 30వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ ముఖ్యమంత్రి. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలను అందిస్తాం. అమలాపురం శాసనసభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ అయితాబత్తుల ఆనందరావు, లోక్ సభ స్థానం నుంచి శ్రీ గంటి హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాల”ని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్