జగన్ అరెస్ట్.. మోడీ గ్యారెంటీ..

జగన్

• 30 కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి
• ఎన్నికల తర్వాత తిరిగి జైలుకి వెళ్లడం ఖాయం
• వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెచ్చుమీరాయి
• శాంతిభద్రతలు క్షీణించాయి
• ఐదు కోట్ల ఆంధ్రులకి భరోసా కల్పించేందుకే కూటమిగా వస్తున్నాం
• జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం సుస్థిర పాలన అందిస్తుంది
• కాకినాడ ఎంపీ అభ్యర్ధి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
తప్పు చేసినవారంతా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని బల్మార్ ఎన్నికల సభలో ప్రధాని శ్రీ మోదీ గారు చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 30కి పైగా కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఎన్నికల తర్వాత జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. ఇది శ్రీ మోదీ గారి గ్యారెంటీ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు ఐదేళ్ల కోసం కాదు.. భావితరాల భవిష్యత్తు కోసం అని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి, అవినీతి, అరాచకాలు పెచ్చుమీరాయన్నారు. ఈ పరిస్థితుల్లో 5 కోట్ల ఆంధ్రలకు భరోసా ఇవ్వడానికే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా వస్తున్నట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి సుస్థిర పాలన అందిస్తామన్నారు. బుధవారం కాకినాడ పార్లమెంటు కూటమి బలపర్చిన జనసేన అభ్యర్ధి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు వెంట రాగా శ్రీ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ..
• కాకినాడ కకావికలం అయిపోయింది
వైసీపీ పాలనలో ప్రశాంతమైన కాకినాడలో రౌడీయిజం పెరిగిపోయింది. కాకినాడను గంజాయికి క్యాపిటల్ గా మార్చారు. చిన్న పిల్లలు కూడా గంజాయికి బానిసలుగా మారుతూ తల్లిదండ్రులకు క్షోభ మిగిల్చే పరిస్థితులు వచ్చాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది. గత ఎన్నికల్లో ప్రజలు జగన్ కు అద్భుత మెజారిటీ ఇస్తే.. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని క్షీణ దశకు తెచ్చారు. ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే పట్టించుకునే నాధుడు లేడు. అవినీతి పెరిగిపోయింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం లేదు. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమి అవసరం అయ్యింది. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద నమ్మకాన్ని ఇచ్చేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ కలసి వస్తున్నాం. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించి స్వీప్ చేయబోతున్నాం.
• కాకినాడకు బ్రాండ్ తేగలిగే వ్యక్తి ఉదయ్
టీ టైమ్ ఉదయ్ గా ప్రాచుర్యం పొందిన శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూటమి పక్షాల మద్దతుతో కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ బ్యాలెట్ పత్రంలో టీ టైమ్ ఉదయ్ అని పేరు వచ్చేలా చూడాలని రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేశాము. అందుకు అధికారుల సమ్మతి లభించింది. కాకినాడ నుంచి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గెలుపు, నగర ఎమ్మెల్యేగా శ్రీ కొండబాబు గెలుపు కీలకం. దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన శ్రీ ఉదయ్ టీ టైం ద్వారా దేశ వ్యాప్తంగా 25 వేల మందికి ఉపాధి కల్పించారు. 10 వేల మంది మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించారు. మధ్య తరగతి నుంచి వ్యాపారస్తులు తయారయ్యేలా చేశారు. ఉప్పాడ చీరలకు, వివిధ వృత్తులకు బ్రాండ్ తేగలిగిన వ్యక్తి. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని గెలిపించాలి.
• ఈ ప్రశ్నలకు బదులిచ్చాకే సునీల్ ఓటడగాలి
వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న చలమలశెట్టి సునీల్ రూ. 400 కోట్లతో కాకినాడ అభివృద్ధి అంటూ హామీలు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు గత నాలుగు నెలల్లో దోచేసిన డబ్బు సిద్ధం చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఎన్నికల సమయంలో వచ్చి ఎన్నికలు అయిన తర్వాత వెళ్లిపోయే వ్యక్తి సునీల్. గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఒక్క పార్టీ నుంచే పోటీలో ఉంటే కనీసం ప్రజల్లో జాలి అయినా ఉండేది. కాకినాడ పార్లమెంట్ స్థానానికి చలమలశెట్టి సునీల్ సరైన వ్యక్తి కాదు, టీ టైం ఉదయ్ సరైన వ్యక్తి. ఓట్లు అడిగే ముందు చలమలశెట్టి సునీల్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. కాపు రిజర్వేషన్లు ఇవ్వలేను అన్న వైసిపి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? 27 దళిత పథకాలు తీసేసి దళితులకు అన్యాయం చేసిన వైసీపీ అభ్యర్ధిగా దళిత సోదరులకు ఏం సమాధానం చెప్తారు? స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి స్థానిక బీసీలను రాజ్యాధికారానికి దూరం చేశారు. బీసీ వర్గాలకు ఏం సమాధానం చెబుతారు? అలాగే రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. వీటన్నింటికీ సమాధానం చెప్పిన తర్వాత ప్రజలను ఓటు అడిగితే బాగుంటుంది. ఓటుకు రూ. 10 వేలు ఇచ్చి కొంటాం. ఎన్నికల కోసం రూ. 400 కోట్లు ఖర్చు చేస్తాం అంటే సరిపోదు. డబ్బులు ఇచ్చి జనసేన నాయకుల్ని కొనుక్కుంటున్నారు. వారంతా పట్టుమని పది ఓట్లు వేయించలేని నాయకులు. ఏ పదవి లేకపోయినా పదేళ్ల పాటు ప్రజల మధ్యే ఉన్నాం. ప్రజా క్షేత్రంలో నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పిన మాట నిలబెట్టుకున్నాను అని అన్నారు.
• జనహారతుల మధ్య భారీ రోడ్ షో
అంతకు ముందు కూటమి బలపర్చిన ఎన్డీఏ అభ్యర్ధిగా నామినేష్ దాఖలు చేసేందుకు బయలుదేరిన శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ రోడ్ షో నిర్వహించారు. ఉదయం చేబ్రోలు లోని నివాసం నుంచి బయలుదేరి ఆడపడుచుల హారతులు, జనసైనికుల జేజేల మధ్య ర్యాలీగా తరలివెళ్లారు. జైత్ర యాత్రను తలపించేలా ఈ ర్యాలీ సాగింది. చేబ్రోలు నుంచి జాతీయ రహదారి మీదుగా కాకినాడ గుడా సర్కిల్, సర్పవరం జంక్షన్, భానుగుడి సెంటర్ మీదుగా కలెక్టరేట్ కి చేరుకున్నారు. దారిపొడుగునా ఆడపడుచులు హారతులు పట్టగా, మూడు పార్టీల కార్యకర్తలు జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో ర్యాలీ తీశారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. అనంతరం కలెక్టరేట్ లో కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి, కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్ధి శ్రీ కొండబాబు, న్యాయవాదులతో కలసి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందచేశారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్