శ్రీ నాగబాబు రోడ్ షోకు భారీ జన సందోహం

నాగబాబు

• గ్రామ వీధుల్లో కాలినడకన ప్రచారం చేసిన శ్రీ నాగబాబు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు గురువారం పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామంలో చేపట్టిన రోడ్ షోకు భారీ జన సందోహం తరలి వచ్చారు. గ్రామ వీధుల్లో అక్కడక్కడ శ్రీ నాగబాబు గారు కాలి నడకన ప్రచారం చేపట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గం శాసన సభ్యులుగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ శ్రీ ఎస్.వీ.ఎస్.ఎన్ వర్మ, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ బుర్రా వరుణ్ కృష్ణంరాజ్, ప్రముఖ సినీ నటులు శ్రీ హైపర్ ఆది పాల్గొన్నారు. దుర్గాడ గ్రామంలో ఉదయం 9 గంటలకు గొల్లపేట దగ్గర బయలుదేరిన రోడ్ షో ఆటో స్టాండ్, బాబు హౌస్, వేవర్స్ కాలనీ, రైల్వే స్టేషన్, పల్లపు వీధి మీదుగా తిరిగి ఆటో స్టాండ్ వద్దకు చేరింది. దారి పొడవునా మహిళలు హారతులతో, జన సైనికులు గజ మాలలతో శ్రీ నాగబాబు గారికి స్వాగతం పలికారు. జనసేన పార్టీ కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, దుర్గాడ గ్రామం పరిధిలోని జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్