జనసేనలోకి మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి లక్ష్మీ శివకుమారి

జనసేన

            రెండు దఫాలు శాసనమండలి సభ్యురాలుగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీమతి అంగూరి లక్ష్మీ శివకుమారి జనసేన పార్టీలో చేరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం విశాఖలో నిర్వహించిన జనవాణి కార్యక్రమం అనంతరం పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి లక్ష్మీ శివకుమారి చేరిక కార్యక్రమం జరిగింది. ఇదే వేదికపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయూసీ మాజీ అధ్యక్షులు శ్రీ గంధం వెంకట్రావు, అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలానికి చెందిన శ్రీ బుదిరెడ్డి చిన్నా, శ్రీ బుదిరెడ్డి మోహన్, విశాఖ కార్పొరేటర్ గా పోటీ చేసిన శ్రీ బలిరెడ్డి నాగేశ్వరావు, మాజీ సర్పంచ్ సింహాచలం నాయుడు, బోదివలస ఎంపీటీసీ శ్రీ ఉగిని రాము, మాడుగులకు చెందిన శ్రీ కాలంగి చిన్నబ్బాయి(బలరాం), గాజువాకకు చెందిన వైసీపీ నాయకుడు శ్రీ బాలిరెడ్డి అప్పారావు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్