ఓటమి భయంతో ముఖ్యమంత్రి ఎన్నికల వాతావరణాన్ని చెడగొడుతున్నారు

ముఖ్యమంత్రి

• అరాచక పరిస్థితులు సృష్టించి లబ్ది పొందాలని చూస్తున్నారు
• శ్రీ పవన్ కళ్యాణ్ మీద సీఎం చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనే
• ఎన్నికల సంఘం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
• శ్రీ జగన్ వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్టోరల్ అధికారికి జనసేన నేతల ఫిర్యాదు
“ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల వాతావరణాన్ని చెడగొడుతున్నారు. అరాచక పరిస్థితులు సృష్టిస్తున్నార”ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని భీమవరం సభలో శ్రీ జగన్ మాట్లాడిన భాష గర్హనీయమన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఏ మాత్రం చట్టం మీద గౌరవం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి యధేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ నెల 16వ తేదీన భీమవరం సభలో ముఖ్యమంత్రి చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనాకు శ్రీ శివశంకర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీ శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. “శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి మహిళలను తప్పుదోవ పట్టించడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు. ఇలాంటి భాష వల్ల ఎన్నికల వాతావరణం చెడిపోతుంది. రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టించి తద్వారా తిరిగి గెలవాలని కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాము. ఇటువంటివి పునరావృతం కాకుండా నిరోధిస్తారని భావిస్తున్నామ”ని అన్నారు.
• తొలి రెండు రోజుల్లో 7 స్థానాల్లో నామినేషన్లు
నామినేషన్ల ప్రక్రియ మొదలైన తొలి రెండు రోజుల్లో ఏడు స్థానాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని శ్రీ శివ శంకర్ తెలిపారు. జనసేన నాయకులు, శ్రేణులతోపాటు మిత్ర పక్షాలయిన టీడీపీ, బీజెపీ నేతలు, కార్యకర్తలు సమధికోత్సాహంతో పాల్గొన్నారన్నారు. నామినేషన్ల వేళ ప్రజల నుంచి వస్తున్న అశేష స్పందన చూస్తుంటే కూటమి గెలుపు కళ కనిపిస్తోంది అన్నారు.
• తొలి రెండు రోజుల్లో జనసేన అభ్యర్థుల నామినేషన్ల వివరాలు
నెల్లిమర్ల – శ్రీమతి లోకం మాధవి
అనకాపల్లి – శ్రీ కొణతాల రామకృష్ణ
యలమంచిలి – శ్రీ సుందరపు విజయ్ కుమార్
కాకినాడ రూరల్ – శ్రీ పంతం నానాజీ
తాడేపల్లిగూడెం – శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
నిడదవోలు – శ్రీ కందుల దుర్గేష్
రైల్వే కోడూరు – శ్రీ అరవ శ్రీధర్

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్