9వ రోజు ( హైలెట్స్ ) – అమలాపురం వారాహి సభ

అమలాపురం
  • ఉదయం 10 గం. స్థానిక ప్రముఖులతో భేటీ 
  • ఉదయం 11 గం.: జనవాణి , శ్రీ సత్యనారాయణ గార్డెన్స్, అమలాపురం. 
  • జనవాణి కార్యక్రమంలో ఈరోజు పాఠశాలల్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ సమస్య నుండి, దివ్యాంగుల పెన్షన్లు, నిరుద్యోగులకు5 లక్షల ఉద్యోగాల భర్తీ, 50వేల టీచర్ల భర్తీ సంబంధించి, కోనసీమ అల్లర్ల ఘటనలో అమాయకుల 250 మంది మీద కేసులు పెట్టారు, ఈ సమస్యలపై పిటిషన్లు వచ్చాయి, వీటిపై సాయంత్రం సభలో మాట్లాడుతాను – జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • సాయంత్రం 5 గం.: భారీ ర్యాలీ
  • అమలాపురం బహిరంగ సభ (గడియార స్తంభం దగ్గర) 

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్

  • Dr బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు నా నమస్కారాలు
  • కోనసీమ ప్రజల్లో ఘాటు ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ఈ ప్రాంత భూమిలో అగ్ని ఉంది
  • గుడిలో చెప్పులు జాగ్రత్త ఇసుక, సిమెంట్ దోపిడీలు చేసే వైసీపీ పార్టీ నాయకులకు, ఆఖరికి గుడిలో చెప్పులు కూడా దోచే స్థాయికి వచ్చారు
  • సినిమాలు మాత్రమే చేస్తే మీ అభిమానం, గోల, కటౌట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ మీ కష్టాలు చూసి కోసం వచ్చాను
  • మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ ప్రభాస్ NTR, నితిన్, రవి తేజ గారి అభిమానులకు నా నమస్కారం
  • నేను పదే పదే సినీ పరిశ్రమ గురించి మాట్లాడటానికి కారణం, మాలో ఎవరం సినిమా చేసినా వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది, థియేటర్లలో పరోక్షంగా, థియేటర్ బయట త్రోపుడు బండ్ల వ్యపాడంరాలు ఇలా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది సినీ పరిశ్రమ, కానీ వైసీపీ పార్టీ   ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఉపాధి కరువైంది
  • నిజంగా వైసీపీ పార్టీ వారు అంబేద్కర్ గారి పేరు కోనసీమ జిల్లాకు పెట్టాలి అనుకున్నప్పుడు.ప్రజలకు నేరుగా చెప్పి ప్రజాభిప్రాయం చేయాల్సింది. వద్దు అన్నవారితో మాట్లాడే కన్విన్స్ చేయాల్సింది. కానీ కావాలనే గొడవలు పెట్టారు
  • ఒక్క అవకాశం అని అడిగారు వైయస్ జగన్ , విద్య అవకాశం ఇస్తే జీతాలు సమయానికి లేకుండా చేశారు. CPS రద్దు చేయలేదు. రైతులకు సకాలంలో బీమా లేదు. పంట సాయం లేదు. ఉద్యోగాలు లేవు. పెన్షన్లు లేవు. ఇంకెందుకు ఇవ్వాలి మీకు ఛాన్స్
  • గొడవలు తగ్గించే వాడు నాయకుడు, గొడవలు పెంచేవాడు. నాయకుడు కాదు
  • దాదాపు 250 మందిపై ఇంకా కేసులు ఉన్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారిపై కేసులు పెట్టి జీవితాలు నాశనం చేసింది 93 ప్రభుత్వం DGP గారికి విజ్ఞప్తి, దయచేసి వారిపై కేసులు తీసేయండి
  • 175 సీట్లు అన్ని MP లు గెలుస్తామని నాయకులు అంటున్నారు. మరి ఎందుకు మా గురించి ప్రతీరోజూ విమర్శలు, ఏదో ఒక వారాహి వాహనంపై వెళ్తుంటే ఎందుకు భయపడుతున్నారు?.. అంటే మన బాలు వారికి తెలుసు
  • నేను హైదరాబాద్ నుండి మాట్లాడను. రాజమండ్రిలో పార్టీ ఆఫీస్ పెట్టాను, కాకినాడలో అమలాపురంలో, పిఠాపురంలో ఆఫీస్ పెడతాను నేను ఉంటాను. మా ఇంచార్జులు అందుబాటులో ఉంటారు, ఈసారి గోదావరి జిల్లాలు జనసేనకు అండగా నిలబడింది
  • జనసేన ప్రభుత్వం రాగానే కోనసీమ కొబ్బరి రైతులకు నష్టపోకుండా మీకు లాభసాటిగా ఉండేలా అండగా ఉంటాము. రాష్ట్రానికి పట్టిన YSRCPParty తెగులును తీసేసేందుకు అండగా నిలబడండి
  • యువత ఆలోచించి ఓటేయండి. గత ఎన్నికల్లో నిజంగా మీరు ఆలోచించి ఓటిసి ఉంటే, నేను MLA గా గెలిచి ఉంటే వైయస్ జగన్ చెప్పినట్లుగా5 లక్షలు కాకపోయినా కనీసం లక్ష ఉద్యోగాలు మీకు వచ్చేలా చేసేవాడిని
  • ఇంకోసారి ఈ వైసీపీ పార్టీ నాయకుడు నవ్వుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ రోడ్డుపై వస్తే నిలదీయండి. 2.3 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 6 వేల పోలీస్ ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించండి
  • నేను వస్తున్నాను అంటే రాత్రికి రాత్రి ధాన్యం కొంటారు. రైతులకు డబ్బులు చేస్తారు. మాట్లాడగానే లాయర్లకు డబ్బులు చేస్తారు. అందుకే ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఈ సారి అధికార పక్షంగా మాకు అవకాశం ఇవ్వండి
  • ఒక్క అవకాశం అని అడిగి రైతులను రోడ్డున పడేసింది వైసీపీ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఎందుకు గెలిపించామా అని రైతులు బాధపడుతున్నారు.
  • CPS రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు OPS, GPS అని మాటలు మార్చారు.
  • ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు సలహాలు ఇచ్చే పెద్దమనిషి సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చి మా జగన్ పసి పిల్లాడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. CPS అంటే ఏంటో తెలియక హామీ ఇచ్చాడు అని కబుర్లు చెప్తాడు
  • జనసేన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా CPS రద్దు కోసం కృషి చేస్తాను. నాకు ప్రభుత్వ ఉద్యోగుల బాధలు తెలుసు
  • మొన్న 24 ఏళ్ల ఆడబిడ్డ పాము కాటుకు గురై ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు లేక సకాలంలో వైద్యం అందక మరణించింది. సాయంత్రం 5 తరవాత డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. వైద్య శాఖా మంత్రి విడదల రజినీ ఏం చేస్తున్నారు.
  • ఇక్కడ ప్రధాన ఆసుపత్రి లేదు. ఇక్కడ ఆయిల్, గార్డెన్ నిక్షేపాలు తీసుకెళ్తున్నారు, కానీ ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు
  • ఇక్కడ కల్తీ సారా సమస్య ఉంది, ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పాపం పసివాడు వైయస్ జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చి ప్రజల ప్రాణాలను తీసే మందును తీసుకొచ్చారు.
  • బూమ్ బూమ్ అంటూ కొత్త బ్రాండు తీసుకొన్నారు. 40-50 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ 150 చేసి కల్తీ మందు అమ్ముతున్నారు. దాదాపు 25 వేల కోట్లు మద్యం మీద సంపాదించారు. ఇదేనా వైయస్ జగన్ చెప్పిన మద్యపాన నిషేధం
  • ప్రజల ప్రాణాలను తీసే కల్తీ మందును అమ్ముతున్నారు ఈ వైయస్ జగన్ ప్రభుత్వం.
  • సంపూర్ణ మద్యపాన నిషేధం అసాధ్యం అని నేను మొదటి నుండి చెప్తున్నాను. మహిళలు వద్దు అన్న ప్రదేశాల్లో మాత్రమే నిషేదం చేస్తాను అని నేను చెప్పాను. వైయస్ జగన్ లాగా తప్పుడు హామీలు ఇవ్వలేదు
  • ఆంధ్రప్రదేశ్ లో దొరికే మద్యం ప్రాణాలకు హానికరం అని డాక్టర్లు చెప్తున్నారు
  • ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆడపడుచుల తాళిబొట్లతో ఆడుకుంటున్నారు. వారి కన్నీరుకు కారణం మీరు
  • కాకినాడ గంజాయి కి గేట్ వే గా మారింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. వీటి వెనుక ఎవరు ఉన్నారు? అధికార పక్షం అండ లేకుండా జరుగుతుందా
  • గత DGP గౌతమ్ సవాంగ్ గారు గంజాయి పట్టుకుని తగల బెడితే 3 రోజుల్లో ఆయనను పదవి నుండి మార్చేశారు. గంజాయి అడ్డుకోవడం ఆయన చేసిన నేరమా
  • 14 ఏళ్ల బిడ్డ తన అక్కను ఏడిపిస్తున్నారు అని అడ్డుకుంటే పెట్రోల్ పోసి తగలబెట్టారు బాపట్ల దగ్గర, రాజు నీతి తప్పిత సమాజం గతి తప్పుతుంది.
  • ఎన్నికల ముందే వైసీపీ పార్టీ క్రైమ్ మొదలైంది.
  • సొంత బాబాయ్ హత్యకు గురైతే ముందు హార్ట్ ఎటాక్ అన్నారు, తరవాత గొడ్డలి పోటు అన్నారు. కేసులో ఉనన వారు ఒక వ్యక్తి చనిపోయెలా చేశారు, ప్రధాన నిందితుడు గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నారు, సొంత చెల్లికి న్యాయం అందకుండా చేస్తున్నారు
  • సొంత చిన్నాన్న కేసులో ముద్దాయి ఆరెస్ట్ కాకుండా చేస్తున్నారు. కానీ తప్పు చేయని కోనసీమ యువతను మాత్రం అరెస్ట్ చేస్తారు
  • దివ్యాంగులు పెన్షన్లు రాక మొన్న నా దగ్గరకు ఒక అబ్బాయి వస్తే, అతనిపై దివ్యాంగుడు అని కూడా చూడకుండా వారిపై జోకులు చేస్తున్నారు. ఇబ్బందులు పెడుతున్నారు.
  • కోనసీమలో కనీసం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు అద్దె కట్టలేక ఆ కౌంటర్ తీసేశారు. 1.6 మిలియన్ ప్రజలు ఉన్న కోనసీమలో రిజర్వేషన్ కౌంటర్ లేకుండా చేశారు. 30 మంది ఎంపీలు ఉండి ప్రయోజనం ఏంటి?
  • ఈ పెద్దమనిషి వైయస్ జగన్ దళితులకు మేనమామ అంటాడు. దయచేసి ఇలాంటి కబుర్లు చెప్పద్దు, నిజంగా దళితులపై ప్రేమ ఉంటే రాజ్యాంగ బద్దంగా ఉన్న హక్కులను రక్షించండి. 23 దళిత పథకాలు ఎందుకు తీసేసారు చెప్పండి, ఇదేనా దళితులపై మీకు ఉన్న ప్రేమ.
  • ఎప్పటి నుండో ఉన్న అంబేద్కర్ విద్యా పథకం పేరు మార్చి జగనన్న విద్యా పథకం అని పేరు మార్చారు. అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా జగన్ మోహన్ రెడ్డి l , నేను అమలాపురం నుండి ప్రశ్నిస్తున్నాను, సమాధానం చెప్పు
  • కోనసీమ కు అంబేడ్కర్ గారి పేరు పెట్టడం విషయంలో గొడవలు జరిగాయి. మరి అంబేద్కర్ విద్యా దీవెన పథకానికి జగనన్న విద్యా దీవెన పథకంగా పేరు మార్చితే ఎందుకు ప్రశ్నించలేదు.
  • GMP గా ఉన్నప్పుడు, కోనసీమకు మంచి జరిగింది. పూర్తిగా కాకపోయినా, కనీసం నరసాపురం వరకు రైల్వే లైన్ వచ్చింది. మరి ఈ వైసీపీ పార్టీ MP లు ఏం చేస్తున్నారు
  • అన్నం పెట్టే రైతు దగ్గర నుండి బస్తాకు 200 రూపాయల లంచం కాకినాడ లో దళారులు తీసుకుంటున్నారు
  • ఇక్కడ ఉన్న GAIL, ONGC, రిలయన్స్, వేదాంత లాంటి కంపెనీలు ఇక్కడి ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు తీసుకుంటున్నారు, వారితో ఎందుకు మీరు ఈ ప్రాంత అభివృద్ధిపై పనిచేయించలేక పోతుంది ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం. 75% స్థానికులకు ఉద్యోగాలు అన్నావు, ఎందుకు కేవలం కూలి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి? ఆయిల్ డ్రిల్లింగ్ లాంటి పనుల్లో శిక్షణ ఇప్పిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి కదా? విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసుకోగలరు కానీ ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వదు
  • ఆరోగ్య శ్రీ కొన్ని వ్యాధులకు మాత్రమే వర్తిస్తుంది. జనసేన ప్రభుత్వం వస్తే ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఒక్క జనసైనికుడు ప్రాణం కోల్పోతే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, అధికారంలోకి వస్తేనే మీకోసం ఇన్సూరెన్స్ ఇవ్వలేమా
  • జనసేన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత విద్యా, వైద్యం
  • నేను ఉన్న సంపాదన నుండి టాక్సులు కట్టి 30 కోట్ల పైగా కౌలు రైతులకు ఖర్చు పెడితే నేను క్లాస్ వార్ చేస్తున్నా అంటాడు ఈ వైయస్ జగన్
  • అక్రమంగా డబ్బు సంపాదించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ , ఇసుక, సిమెంట్, గనులు అన్ని దోపిడీలు చేసిన వ్యక్తి ఈయన. నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు
  • క్లాస్ వార్ చేస్తుంది వైయస్ జగన్ . క్లాస్ వార్ కు ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి, 24 దళిత పథకాలు రద్దు చేశాడు. భవన నిర్మాణ కార్మికుల నిధి మళ్ళించాడు. ఉద్యోగుల పెన్షన్ సొమ్ము మళ్లించిన వ్యక్తి క్లాస్ వార్ అని మాట్లాడే హక్కు లేదు
  • జనసేన ఎన్నికల నినాదం

                   అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి.

                   అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి.

                   జనం బాగుండాలంటే జగన్ పోవాలి..

                     Hello AP – Bye Bye YCP

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్