8వ రోజు ( హైలెట్స్ ) – ముమ్మిడివరం వారాహి సభ

ముమ్మిడివరం

ఉదయం 10 గం. : రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వాణిజ్య వర్గాల ప్రతినిధులతో సమావేశం  

ఉదయం 11 గం.: వీర మహిళలతో సమావేశం  

సాయంత్రం 5 గం.: వారాహి యాత్ర 

బహిరంగ సభ ( కూరగాయల మార్కెట్ సెంటర్, ముమ్మిడివరం ) 

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్

  • అంబేద్కర్ కోనసీమ అని పేరు మార్చిన తరువాత మొదటిసారి జిల్లాకు వచ్చాను, నాకు ఎంతో ఘనస్వాగతం పలికారు. ముమ్మిడివరం ప్రజలందరికీ నా ధన్యవాదాల
  • ఈరోజు ఉదయం రైతులు, మేధావులతో సమావేశమై ఈ ప్రాంత అభివృద్ధి గురించి చర్చించాను
  • నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ జాతీయ నాయకులు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజుల్లో 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష ద్వారా రాష్ట్రాన్ని సాధించారు
  • మన కోనసీమలో ఇప్పటికీ త్రాగునీటి సమస్య ఉంది. సరైన వైద్యసేవలు లేవు, మన కోనసీమలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అవసరం ఉంది, దానిని ఎడండి, మీకు నేను పట్టించుకోవడం లేదు, జనసేన ప్రభుత్వం రావడానికి అండగా ఉండండి
  • అందరూ కోనసీమ జనసేనకు బలం అని చెప్తారు, నాకు మాత్రం భయం వేస్తుంది, ఎందుకంటే చిన్నపాటి తప్పు జరిగినా ఇక్కడి ప్రజలకు విపరీతమైన కోపం వస్తుంది, ఈ నేలలో ఉన్న పెట్రోలియం కి ఉంది కదా అందుకేనేమో, కానీ మీలో ఉన్న ప్రేమ అంతకంటే ఎక్కువ
  • అందరూ నమ్మి జగన్ రెడ్డి కి అవకాశం ఇచ్చారు. కానీ వైసీపీ పాలన 70- 30 నిష్పత్తి ప్రభుత్వం. వీరు నవరత్నాల పేరిట ఇచ్చే పథకాలు అన్ని కూడా 100 మంది కష్టాన్ని తనకు కావలసిన 30మందికి మాత్రమే ఇస్తున్నాడు. ఇది మన అందరి ఉమ్మడి శ్రమ
  • ఈ మధ్య జనసేన కథాకళి కార్యక్రమంలో ఉప్మా సీఎం అని మా ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు, అజయ్ గారు అందరూ విడిపోయి ఓట్లు వేయడం వలన వైయస్ జగన్ లాంటి ఉప్మా సీఎం అధికారం లోకి వచ్చాడు.
  • 151 మంది MLA లు, ఎంపిలు ఇన్ని కోట్ల మంది ప్రజలను భయపెడుతున్నారు, కారణం మనలో ఉన్న భయం, పిరికితనం, అనైక్యత, నా పోరాటం సమాజంలో ఉన్న అనైక్యత పైన
  • కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అనింపెరు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక మాట వద్దు అంటున్న వారితో మాట్లాడి వారికి అర్థమయ్యేలా చెప్పిఉంటే గొడవలు జరిగేవా ? కావాలని వైయస్ జగన్ ప్రభుత్వం గొడవలు సృష్టించింది అని నిఘా వర్గాలు చెప్పాయి
  • GMC బాలయోగి లాంటి గొప్ప వ్యక్తి స్పూర్తితో కోనసీమ అభివృద్ధి కోసం పనిచేస్తాను.
  • ఒక MLC డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అలాంటి వ్యక్తిని శభాష్ అని భుజం తట్టే రకం
  • రైతు రుణాలపై వడ్డీ మాఫీ అన్నాడు, కేంద్ర వాట వచ్చింది కానీ రాష్ట్ర వాట ఇవ్వకపోవడం వలన రైతులే ఆ భారం మోయాల్సి వచ్చింది. ఆ తరవాత కేవలం ఈయనకు అనుకూలంగా ఉన్న 30మందికి ఇచ్చి ఈ పెద్దమనిషి వైయస్ జగన్ తన బుద్ది బయట పెట్టాడు.
  • కోనసీమ రైతులు ఒక పక్క నష్టపోతుంటే ప్రతీ ఎకరాకు ఒక బస్తా ద్వారంపూడి కుటుంబానికి వెళ్తుంది, రైతు కన్నీరు మీద ద్వారంపూడి కుటుంబీకులు వ్యాపారం చేస్తున్నారు.
  • నేను మాట్లాడితే కులం గురించి మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ నాయకులు. కానీ అమరావతి ఒక కులానికి అంటగట్టి మాట్లాడింది ఎవరు? వైసీపీ నేతలు కాదా? ఈ వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడేయచ్చు . కానీ నేను ఏమైనా మాట్లాడితే గింజుకుంటారు.
  • నేను కులాల అభివృద్ధి కోసం మాట్లాడుతాను, యాదవ సమాజం, అగ్నికుల క్షత్రియులు, శెట్టి బలిజలు, మత్స్యకారులు, దళిత సోదరులు, కాపులు అందరూ అభివృద్ధి చెందాలనేది నా ఉద్దేశం, రెండు మూడు కులాల దగ్గర అభివృద్ధి ఆగిపోకూడడు
  • నేను మాట్లాడేది వైసీపీ పార్టీ నాయకులకు ఇబ్బంది ఉంటుందేమో, కానీ తప్పదు భరించండి
  • రైస్ మిల్లులు, సివిల్ సప్లై, మిల్లర్ అసోసియేషన్ అన్ని ద్వారంపూడి కుటుంబం చేతుల్లో ఉన్నాయి.
  • జనసేన ప్రభుత్వం వస్తే రైతు భరోసా కేంద్రాలను నిజంగా భరోసా కల్పించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతాము
  • రాజమండ్రి లో జనసేన పార్టీ ఆఫీస్ పెట్టాను, ఇకపై గోదావరి జిల్లాలకు అ అందుబాటులో ఉండాలని పెట్టాను.
  • ఒక మనిషి గెలుపు ఉన్నప్పుడు కాదు, ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నది అని అప్పుడు నిర్ణయించుకోండి వాడు ఎలాంటి వాడు అని. వైయస్ జగన్ కి పూర్తి మెజార్టీ ఇచ్చారు, వారు ఎలాంటి పాలన ఇస్తున్నారో చూసారు. జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి
  • గత ఎన్నికల్లో పితాని బాలకృష్ణ గారిని గెలిపించి ఉంటే ముమ్మిడివరంలో పరిస్థితి వేరేలా ఉండేది. ఆయన మీకోసం బలంగా పనిచేసేవాడు.
  • రైతులకు విజ్ఞప్తి
  • ఒకసారి పవన్ కళ్యాణ్ మీ వాడు అనుకొని అవకాశం ఇవ్వండి, మీకు అండగా నిలబడి చూపిస్తా
  • కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయగలరు ఆలోచించండి. ఏ కేసులు లేని, కేంద్ర నాయకులతో మంచి సంబంధాలు ఉన్న నేను ఏ విధంగా పనిచేయగలనో అర్ధం చేసుకోండి
  • ఇసుక ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు, ఇసుక దోపిడి అరికడతాను
  • మత్స్యకారులకు బోట్లు కొనుక్కునేందుకు జనసేన ప్రభుత్వం సాయం చేస్తుంది. యువతకు 10లక్షల పెట్టుబడి సాయం చేస్తాం.
  • రైతుల ధాన్యం చెల్లింపు, ఆత్మహత్యలు పరిహారం వైసీపీ పార్టీ ప్రభుత్వం సకాలంలో వేయకపోతే నేను వస్తాను అని చెప్పగానే ఒక్కరోజు ముందు వేసింది. నేను నా సొంత డబ్బు నేను 3 వేల పైగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఇచ్చాను.
  • ప్రజలకు ఆంధ్రా అనే భావన ప్రజల్లో రావాలి, రాష్ట్రం కోసం ఆలోచించండి
  • యాదవులు, క్షత్రియులు, వెలమలు, శెట్టి బలిజలు, మత్స్యకారులు ఇంకా చాలా కులాలు ఉన్నా సరే ఎందుకు పదవులు అన్ని ఒక్క కులానికి మాత్రమే ఇస్తున్నారు అనేది నా ఆవేదన, ఎందుకు మీకు ఈ కులాలు గుర్తు రావడం లేదు వైయస్ జగన్
  • యువతా… మీ కోసం నేను చెమట చిందిస్తున్నాను, అర్ధం చేసుకోండి
  • కొంతమంది తారక్ గారి అభిమానులు నా అభిమానులు సినిమా పరంగా గొడవలు పడుతున్నారు అంటున్నారు. సినిమా వేరు రాజకీయం వేరు. రైతులకు కులం లేదు, ఆలోచించండి
  • నాకు మహేశ్ బాబు, అల్లుఅర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, తారక్ గార్లు అందరి హీరోల అభిమానులకు విజ్ఞప్తి. నాకు వారందరూ ఇష్టమే, నేను వారి సినిమాలు చూస్తాను, మీరు వారిని అభిమానించండి. కానీ రైతులకు, ప్రజా సమస్యలకు కులం లేదు, నేను రాష్ట్రం కోసం పనిచేస్తున్నాను ఒక్కసారి అండగా నిలబడండి
  • మహేష్ మహేశ్ బాబు గారు, ప్రభాన్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. రామ్ చరణ్, తారక్ గార్లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియకపోవచ్చు, కానీ వారు తెలుసు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఈగో లేదు. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండి. 

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్