- ఉమ్మడి గోదావరి జిల్లాల సమావేశం, కాకినాడ
- సాయంత్రం 5గం.కు కాకినాడలో జనసేన వారాహి విజయ యాత్ర.
- అనంతరం సర్పవరం జంక్షన్ లో నిర్వహించిన బహిరంగ సభ.
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్
- యువతను ఓట్లకోసం వాడుకుంటున్నారు, వారి భవిష్యత్తును ఒదిలేస్తున్నారు, నేను యువతకు నా వంతుగా సాయం చేద్దామని నేను వచ్చాను.
- ఎంతో ప్రశాంతమైన నగరం కాకినాడ, రిటైర్డ్ ఉద్యోగులకు ఒకప్పుడు స్వర్గం లాంటి ప్రదేశం
- నిన్న జనవాణి కార్యక్రమంలో పిటిషన్లు తీసుకుంటుంటే స్థానిక MLA మీద చాలా పిర్యాదులు వచ్చాయి. ఇలాంటి కౌన్ కిస్కా గాల్ల మీద నాకు వ్యక్తిగత కోపం ఉండదు.
- క్రిమినల్స్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మనల్ని పాలిస్తామంటే నాకు నచ్చదు. అంబేద్కర్, గాంధీ, భగత్ సింగ్ లాంటి వారి గురించి చదువుకోమని చెప్పి, క్రిమినల్స్ MLA, ముఖ్యమంత్రిగా వస్తే ఎలా
- నేను ఆవేశంగా మాట్లాడటం లేదు, ఆలోచించి మాట్లాడుతున్నాను, నా మాటలకు బాధ్యత తీసుకుంటాను, రెండున్నర సంవత్సరాల క్రితం స్థానిక MLA గెలిచిన మత్తులో, బాగా తాగి, అహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడాడు
- చాలా దిగజారుడు మాటలు తిడుతుంటే, మా నాయకులు చెప్పారు. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనే వ్యక్తి MLA, వాళ్ళ తాతల నుండి గూండాలు, వాళ్ళ దగ్గర కత్తులు పెట్టుకుని తిరుగుతారు, బియ్యం స్మగ్లింగ్ చేసే వ్యక్తి అని చెప్పారు.
- మన జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటి దగ్గర నిరసనకు వెళ్తే, ఈ MLA రౌడీలు మా నాయకులు పంతం నానాజీ, సందీప్ పంచకర్ల, ఇంతర నాయకులు, మహిళల మీద దాడులు చేశారు, నేను ఢిల్లీ నుండి ఇక్కడకు వస్తే 144 సెక్షన్ పెట్టారు ఆరోజు నేను నోరు ఇప్పి ఉంటే ఈ డెకాయిట్ చంద్రశేఖరరెడ్డి ఉండేవాడు కాదు
- 2014 లోనే రాష్ట్రానికి వైసీపీ పార్టీ కరెక్ట్ కాదు అని చెప్పాను, మాజీ ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తాం, కులాల వారిగా విభజిస్తాం అంటే ఊరుకునే వ్యక్తిని కాదు
- క్రైమ్ చేసేవాడు ఏ కులమైన వదిలేది లేదు, మర్చిపోను, నేను కోరుకునేది రాష్ట్రంలో క్షేమం, భద్రత ఉండాలి, కులాలకు అతీతంగా, కుల చిచ్చు లేకుండా ఉండాలి అని
- ఈ రౌడీ, గూండా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కి చెప్తున్నాను, నిన్ను గెలవనివ్వను, ఇక్కడే మంగళగిరికి వచ్చేశా ఇక్కడే ఉంటా, ఏ గూండా వచ్చినా ఎదుర్కొంటా
- నిన్న బాపట్లలో ఒక అబ్బాయి ని వాళ్ళ అక్కను ఏడిపిస్తున్నడని అడ్డు వెళ్తే. పెట్రోల్ పోసి తగలబెట్టారు, ఎంత దారుణమైన పరిస్థితులున్నాయి.
- పిఠాపురంలో ల్యాండ్ మాఫియా నడుస్తుంది, ఎవరో భీమాస్ రెడ్డి అనేవాడు తుపాకులు పట్టుకుని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. ఒక్క బియ్యం సంగ్ లో 10వేల కోట్లు సంపాదిస్తున్నారు ఈ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
- గోదావరి జిల్లాలకు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అని చెప్తున్నారు
- కులాన్ని అంటి పెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు తప్ప, కులం ఎదగడం లేదు.
- గవర్నమెంట్ మారినప్పుడల్లా కాపు రిజర్వేషన్ల విషయంలో మాట మార్చకూడడు, ఒకే మాట మీద ఉండాలి.
- ఒక దళిత డ్రైవర్ ను MLC చంపి డోర్ డెలివరీ చేస్తే దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు.
- నిన్న ఒక BC బిడ్డను చంపేస్తే BC MP లక్ష రూపాయల కట్ట పట్టుకుని వచ్చి భేరాలు ఆడుతున్నారు. ఒక ప్రాణాన్ని చంపేసి విలువ కడతారా
- నేను మహేశ్ బాబు గారు, తారక్ గారు, రవితేజ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గార్లు, ఇతర హీరోల అభిమానులకు ఒక్కటే చెప్తున్నాను. వారందరూ నాకు ఇష్టమే, మేమంతా కలిస్తేనే చిత్ర పరిశ్రమ. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి, భవిష్యత్తు కోసం అడుగెయ్యండి.
- నిన్న ఒక మహిళ వచ్చి చెప్పింది, నేను వస్తున్నానని పోస్టర్లు అతికిస్తుంటే కొంతమంది ద్వారంపూడి అనుచరులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు వేసుకుని వచ్చి చంపేస్తాం అని బెదిరిస్తున్నారు అంట
- ద్వారంపూడి ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావ్, మారేందుకు అవకాశం ఇస్తున్నా, మారకపోతే మీ తాతకు పట్టిన గతే పడుతుందని, SP TT నాయక్ మీ తాతకు బేడీలు వేసి లాక్కెళ్ళిన్నట్లు నీకు భీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ ఇస్తా జాగ్రత్త
- గుర్తుపెట్టుకో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నీ పతనం మొదలైంది, నీ సామ్రాజ్యం కూలదొయ్యక పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు
- కాకినాడ రూరల్ నుండి కాకినాడ సిటీకి పైప్ లైన్ ద్వారా నీరు వస్తున్నాయి, కానీ అక్కడి వారికి నీరు లేదు. ఏమైనా మాట్లాడితే రూరల్ కన్నబాబు బాధపడతాడు, ఆయనను మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పుచేసా
- ఈ ద్వారంపూడి అనుచరులు సర్వే పేరుతో వచ్చి భూములు కబ్జాలు. చేయడం, చివరకు స్వచ్ఛంద సంస్థలు వేసిన మొక్కలు కూడా వీళ్ళే వేయించినట్లు బిల్లులు తీసుకోవడం, మడ అడవులు ధ్వంసం చేసి ఆ భూములు లాక్కోవడం చేస్తున్నాడు
- మొన్న అమిత్ షా గారు వైజాగ్ వచ్చి లా& ఆర్డర్ అధ్వాన్నంగా ఉంది. అన్నారు, అర్ధం చేసుకోండి ఎందుకు అన్నారో. ఈ ద్వారంపూడి మీద ఢిల్లీలో పెద్ద అవినీతి ఫైల్ ఉంది. రాష్ట్రంలో గంజాయి ఈ ద్వారంపూడి అధ్వర్యంలో ఎలా సరఫరా అవుతుందో తెలుసుకున్నారు.
- NCRB డేటా ప్రకారం 31,177 మంది ఆడపిల్లల మిస్సింగ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో, DGP గారు ఈ లెక్కలు ఏంటి? క్రైమ్ లేదు రాష్ట్రంలో అని మీరు కూడా క్రిమినల్స్ కి వత్తాసు పలికితే ఎలా
- రాష్ట్రంలో పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమైతే, ఒక యువకుడు ఉపరాష్ట్రపతికి రక్షణ కోసం లెటర్ రాయాల్సిన దుస్థితి ఉంది.
- నన్ను ఉన్నత స్థానంలో మీరు కూర్చోబెట్ట గలిగితే నేను రాష్ట్రం కోసం పనిచేస్తాను, లా & ఆర్డర్ సమస్య పరిష్కరిస్తాను
- గతంలో కాకినాడ పోర్ట్ నుండి 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసేవారు, వైసీపీ పార్టీ ప్రభుత్వం వచ్చాక 56లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అవుతోంది, రేషన్ వెహికిల్స్ ద్వారా అక్రమ రవాణా చేస్తున్నాడు. ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దాదాపు అక్రమ రవాణా ద్వారా 10వేలకోట్లు సంపాదించాడు.
- గోదావరి రైతులు గిట్టుబాటు ధర లేక కన్నీరు పెట్టుకుంటుంటే, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం వేల కోట్లు సంపాదిస్తుంది.
- ఇక్కడ ఉన్న తోట త్రిమూర్తులు గారు, కన్నబాబు ఏం చేస్తున్నారు, భయపడుతున్నారా
- ఒక సినిమా టిక్కెట్ కోసం లైన్లో నిల్చున్నారు, కానీ ఓటు కోసం రాకపోతే ఎలా? మధ్యతరగతి వారు ఆలోచించండి, నోటాకు వేసే 3-4% కూడా మాకు ఓటు వేయండి
- ద్వారపూడి వాళ్ళ నాన్న వీరభద్రారెడ్డి పౌర సరఫరాల శాఖ చైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, ఎగుమతి చేసేది మానస క్వాలిటీ ఎంటర్ ప్రైజేస్, మూకుమ్మడిగా 15వేల కోట్లు దోచేశారు.
- రేపటి నుండి ఈ రౌడీ బ్యాచ్ నా మీద పడతారు, నేను హైదరాబాద్ పారిపోను, ఇక్కడే ఉంటాను ద్వారపూడి వాళ్ళ నాన్న వీరభద్రారెడ్డి రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, రైతుల కన్నీళ్ళ మీద కోట్లు సంపాదిస్తున్నారు.
- నేను ద్వారపూడి లాంటి డెకాయిట్, ఒక నటోరియస్ క్రిమినల్ మైండ్ ఉన్న వైయస్ జగన్ లాంటి ముఖ్యమంత్రితో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను
- ఆఖరికి ఈ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మనుషులు కోవిడ్ సెంటర్ లోని బెడ్స్ కూడా పట్టుకెళ్ళిపోయారు.
- ఈ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మనుషులు పక్కన యానాం నుండి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు.
- ఎన్నికలు రాబోతున్నాయి, కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు అంటున్నారు, కానీ
PLR ఇన్ఫ్రా – మిథున్ రెడ్డి కంపెనీకి 600 కోట్లు,
రాఘవ కన్స్ట్రక్షన్ – శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి 300 కోట్లు,
MRKR – రఘునాథ రెడ్డి కంపెనీకి 250 కోట్లు
BPR ప్రభాకర్ రెడ్డి కంపెనీకి 50 కోట్లు,
మాక్స్ ఇన్ఫ్రా ఫణి కుమార్ వాళ్లకు అందరికీ కలిపి 1,500 కోట్లు విడుదల చేసింది
- YCP వచ్చాక 33 వేలకు పైగా మిస్సింగ్ కేసులు ఉన్నాయి, 40% ఆడపిల్లల ఆచూకీ తెలియడం లేదు, 2021 లో CM ఇంటి సమీపంలో, సీతానగరం లో ఒక యువతిపై సామూహిక హత్యాచారం జరిగితే ఈరోజుకి ప్రసన్నా రెడ్డి అనే నిందితుడు దొరకలేదు.
- రాణి అనే కళ్ళు లేని యువతిని గంజాయి మత్తులో అత్యాచారం చేశాడు, తల్లి నిలదీస్తే గంజాయి మత్తులో ఆ యువతిని చంపేశారు. పోలీసులు అతను గంజాయి సేవించలేదు అని సర్టిఫికేట్ ఇస్తే ఎవరికి చెప్పుకోవాలి.
- అనంతపురం జిల్లా, గౌరంట్లలో ఒక యువతిని అత్యాచారం చేసి చంపేశారు. గత నెలలో నెల్లూరులో ఒక యువతిని అత్యాచారం చేసి చంపేశారు. పోయిన మే నెలలో భర్త పక్కన ఉండగా కొట్టి, మహిళపై సామూహిక హత్యాచారం చేస్తే, హోం మంత్రి వచ్చి దొంగతనం కోసం వచ్చారు, కావాలని అత్యాచారం చేయలేదు అని చెప్తే ఏం చేయాలి.
- నిన్న ఒక దివ్యాంగులు వచ్చి చెప్పారు, పెన్షన్ తీసేశారు అని, ఈ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లాంటి వ్యక్తులు వేల కోట్లు దోచేయచ్చు కానీ దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడానికి మాత్రం మనసు రాదా
- ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మత్స్యకారులు, కాపులు, బీసీలు అందరినీ దోచేస్తున్నారు, ఆఖరికి శివాలయం భూములు కూడా దోచేశారు.
- ద్వారంపూడి దగ్గర మహా అయితే 500 మంది గూండాలు ఉంటారు, ఒక్కసారి ఊహించుకోండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు మీలో ధైర్యం లేదా .
- నీ రోజులు దగ్గర పడ్డాయి గుర్తు పెట్టుకో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి మీ జగన్ మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను, జైహింద్.