4వ రోజు ( హైలెట్స్ ) – కాకినాడ జనవాణి

కాకినాడ
  • 10 గం. – కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో భేటీ 
  • మ.12 గం. – కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాల జనవాణి : ( 30 కి పైగా అర్జీలు స్వీకరణ ) 

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలానే ఉంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. పేషెంట్లకు కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. వైద్య పరీక్షలు బయట చేయించుకోండి అని పంపిస్తున్నారు – శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కాకినాడ యువతి.
  • మా రజకులకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం లేదు, 50 గజాల స్థలాన్ని ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు, అక్కడకు వెళ్లి ఎలా పనిచేయాలి – శ్రీ పవన్ కళ్యాణ్ గారితో జనవాణి కార్యక్రమంలో రజక సామాజిక వర్గ యువకుడు.
  • మేము పిఠాపురం నుండి కాకినాడ వచ్చి ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్నాం. కానీ మా వల్ల ఓట్లు ఆయనకు రావు అని షాపులు ఖాళీ చేయాలి అని MLA ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులతో బెదిరిస్తున్నారు – శ్రీ పవన్ కళ్యాణ్ గారితో జనవాణి కార్యక్రమంలో వ్యాపారులు
  • దేశంలో అన్ని రాష్ట్రాల్లో మేదర కులాన్ని SC వర్గంలో ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మమ్మల్ని BC జాబితాలో ఉంచారు, దీని వల్ల మాకు ఏ ప్రయోజనాలు – శ్రీ పవన్ కళ్యాణ్ గారితో జనవాణి కార్యక్రమంలో మేదర యువకులు
  • న్యాయవాదులకు 5 వేల సహకారం ఇస్తాం అన్నారు, బటన్ నొక్కారు, కానీ ఇప్పటి వరకు కాకినాడలో ఒక్క న్యాయవాదికి కూడా ఆ డబ్బు పడలేదు. న్యాయవాదులపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు – శ్రీ పవన్ కళ్యాణ్  గారితో జనవాణి కార్యక్రమంలో న్యాయవాదులు
  • క్రైస్తవ పక్షపాతి అని చెప్పి అధికారంలోకి వచ్చి క్రైస్తవులకు ఏ విధమైన న్యాయం చేయలేదు.  మేము ఈసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో నడవాలని, మీరు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము – జనవాణి కార్యక్రమంలో క్రైస్తవ ప్రభోదకులు.
  • అర్చకులకు 5 వేల గౌరవ వేతనం అని ప్రభుత్వం చెప్పింది. కానీ 5 వేలు ఎలా సరిపోతాయి. ఈ సారి రామన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ రావణ సైన్యాన్ని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ గారి తరపున జన సైన్యంగా పనిచేసి గెలిపిద్దాం – శ్రీ పవన్ కళ్యాణ్  గారితో జనవాణి కార్యక్రమంలో అర్చకులు
  • రైల్వే ఉద్యోగులకు, RTC ఉద్యోగులకు పాస్ ఉచితంగా ఇస్తారు, వైసీపీ పార్టీ ప్రభుత్వం మాత్రం చెత్త క్లీన్ చేసే శానిటరీ వర్కర్స్ నుండి కూడా చెత్త పన్ను వసూలు చేయడం దారుణం, రెల్లి కులస్థులకు కనీస గౌరవం ఇవ్వడం లేదు – జనవాణి లో రెల్లి సోదరి.
  • కాకినాడలో ఎంతో ప్రాముఖ్యమైన శివాలయం మధ్యలో ప్రహరీ గోడ కట్టించి, దేవాలయ భూములన్నీ పోర్ట్ కోసం అని తీసేసుకున్నాడు MLA ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. మా మత్స్యకారులను రోడ్డున పడేసాడు – శ్రీ పవన్ కళ్యాణ్ గారితో జనవాణి కార్యక్రమంలో మత్స్యకారులు.
  • BC ల కులగణన జరగాలి, BC లకు జనసేన ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది అని భావిస్తున్నాము – శెట్టిబలిజ జన జాగృతి సభ్యులు
  • కులాల ఐక్యత కోసం సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, మీకు అండగా ఉంటానునని హామీ ఇచ్చిన జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు.

 

  • 5 గం. – ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో సమావేశం
  • 6 గం  – ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశం Venue : ముత్తా క్లబ్, కాకినాడ 

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్