- కైకలూరు నుండి మాకు అండగా 2019 లో ఓట్లు వేసిన ప్రజలను నా గుండెల్లో పెట్టుకున్నాను, ఇక్కడికి వస్తుంటే దారి పొడవునా స్వాగతం పలికారు, వారికి నా ధన్యవాదాలు
- 151 ఎమ్మెల్యే లు, 30 ఎంపీలు ఉన్న బలమైన పార్టీ వైసీపీపార్టీ, ఏ పదవి లేని, కేవలం జనసైనికుల బలం ఉన్న పార్టీ జనసేనపార్టీ, మేము ఎవరికి బయపడం, ఈరోజు టీడీపి వారికి కూడా మేమున్నాం అని బలం ఇచ్చాం
- ఈరోజు మీడియాలో NDA కూటమి నుండి బయటకు వచ్చాం అని అంటున్నారు, మేము ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి, పథకాలు డబ్బులు ఇచ్చి కూడా మాకు భయపడుతున్నారు అంటే మీరు ఓడిపోతున్నరని అర్దం, మీరు ఇంకా భయపడాలి
- స్థానిక ఎమ్మెల్యే, అతని కొడుకు బాగా దోచుకుంటున్నారు అని తెలిసింది, ఇంకొక 6 నెలల్లో మీ భవిష్యత్తు తెలుస్తాము
- కొంతమంది వైసీపీ మద్దతు దారులు బెదిరిస్తున్నారు, రేపు ఎలక్షన్ లో మనం ఓడిపోతే నీ అంతు చూస్తాం అని, నేను మీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తండ్రి నే ఎదుర్కొన్నాను, ప్రజారాజ్యం ఓడిపోయినా ఎక్కడకు పారిపోకుండా హైదరాబాద్ లో ఉండి ధైర్యంగా మళ్ళీ పార్టీ పెట్టాను, మీ ఉడత ఒప్పులకు ఏం భయపడను
- 2014 లో ఒక వేళ బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో టీడీపి అధికారంలోకి రాకపోతే నా పరిస్థితి అర్దం చేసుకోండి, అయినా భయపడకుండా నిలబడి ఉన్నాను, 2014 లో వైసీపీ ఓడిపోయాక మా ఆఫీస్ దగ్గర వైసీపీ రౌడీలు వచ్చారు
- రేపు ఎన్నికల తరువాత వైసీపీ ఉంటుందో ఉండదో మీరు తేల్చుకోండి, మేము గెలుస్తున్నాం
- కైకలూరు లో మా నాయకులు, కార్యకర్తలపై SC, ST అట్రాసిటీ కేసులు పెట్టారు, మేము మర్చిపోము, మేము కులాలకు అతీతంగా ఉండే వాళ్ళం, జై భీమ్ అని గుండెల్లో పెట్టుకున్న పార్టీ మాది
- కైకలూరు 35 కిలోమీటర్లు, కానీ చుట్టూ తిరిగి 65 కిలోమీటర్లు తిరిగి వచ్చాం, అలా ఉన్నాయి రోడ్లు, కనీసం రోడ్లు వేయలేని ముఖ్యమంత్రిని నువ్వు వైయస్ జగన్, ఏ మొహం పెట్టుకుని 175 అడుగుతావు, కనీసం వంతెన నిర్మించలేక పోయావ్, మీ MLA, MLA కొడుకు వచ్చి బెదిరిస్తాడు, అందరి లెక్కలు తెలుస్తాము
- ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మా నాయకులను కూర్చోపెట్టి సెటిల్మెంట్ చేస్తావా MLA, MLA కొడుకు, రేపు మేము అధికారంలోకి వచ్చాక అదే పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కూర్చోబెడతాం జాగ్రత్త
- మంగళగిరి కార్యాలయానికి ఇక్కడి ఎమ్మెల్యే కుటుంబ దోపిడీ గురించి కొల్లేరు అక్రమాల గురించి మాకు రిపోర్ట్ వస్తున్నాయి, మీ అందరి సంగతి బయటపెడతాను
- కనీసం ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ వచ్చినా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేని ప్రభుత్వం, వెహికిల్ రిజిస్ట్రేషన్ చేస్తే RC ఇవ్వలేరు, ఆస్తి పేపర్లు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి అంట, దోచేయడానికా
- అంచెలంచెలుగా మీ అందరి జీవితాలు వైసీపీ దగ్గర పెట్టుకుంటున్నారు, 5 యేళ్లు అధికారం ఇస్తే MLA కొడుక్కు కొమ్ములు వచ్చాయి, ఆ కొమ్ములు ఇరిచేస్తాం, 10 గ్రామాలు వైసీపీ గ్రామాలు వేరే పార్టీ ఉండకూడదు అంటున్నారు, వైసీపీ రహిత గ్రామాలు గా మారుస్తాం
- హేయ్ జగన్, ఎమ్మెల్యే, నేను రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని, నువ్వెంత నీ బ్రతుకేంత, రేపు మేము అధికారంలోకి వచ్చాకా మొత్తం కక్కిస్తా, ఇక్కడ కొల్లేరు అక్రమాలు బయటకు తీస్తా
- ఆఖరికి మొన్న వినాయక చవితి లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బు తో ప్రజలు రోడ్డు వేసుకుంటాము అంటే, లేదు మేమే వేస్తాం అని అది కూడా చేయలేదు, రోడ్లు కూడా వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం
- ముదినేపల్లి మండలం దగ్గర ఒక గ్రామం వారు 6 వేల మంది ఉన్నారు, చుట్టూ కొల్లేరు సరస్సు ఉంది, కానీ త్రాగునీరు లేదు, నీరంతా పొల్యూషన్ అయింది, శుద్ది చేసి వ్యవస్థ లేదు, చర్మవ్యాధులు వస్తున్నాయి,
జనసేన – టీడీపి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో నీటి సమస్య తీరుస్తాం - మొన్న పంచాయితీ సర్పంచులు నన్ను కలిసి, 8,600 కోట్ల నిధులు జగన్ దోచేశారు, దారి మళ్ళించాడు అని చెప్పారు
- జగన్, వైసీపీ నాయకుల్లారా మీ బ్రతుక్కి ఏరోజైనా ఒక్క రూపాయి జేబులోంచి తీసి ప్రజల కోసం ఖర్చుపెట్టావా? నేను కౌలు రైతుల కోసం ఖర్చుపెడుతున్నాను, భారతి సిమెంట్స్, సాక్షి ఉన్నాయి కాదా? మీరా క్లాస్ వార్ గురించి మాట్లాడేది
- 1200 కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధి కాజేసాడు ఈ జగన్, ఇతను క్లాస్ వార్ అని మాట్లాడుతాడు
- పొద్దున్నే పథకం క్రింద డబ్బులు ఇస్తాడు, సాయంత్రం మద్యం క్రింద పట్టకెళ్తాడు ఈ జగన్
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగిన వారికి చాలా ప్రమాద కరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, కల్తీ మద్యం అమ్ముతున్నారు, మధ్య నిషేదం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతున్నారు
- మద్యనిషేధం సాధ్యం కాదు, మహిళలు కోరుకున్న చోట నిషేదిస్తాం, మేము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం అందేలా చూస్తాం, అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తాము, మద్యం వద్దు అన్న చోట మధ్య నిషేదం చేసి, అధిక నిధులతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పథకం తీసుకొస్తాం
- కొల్లేరు పక్షులకే కాదు, మనుషులకు కూడా ఉపయోగపడేలా, 52 నిర్వీర్యమయిన మత్స్యకార సంఘాలను తిరిగి ఇక్కడ చేపలు పట్టుకునేలా చేస్తాం
- కృష్ణా జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లా వరకు వ్యాపించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు, దాదాపు 17 వేల టన్నుల కాలుష్యం కలుస్తుంది దీనిని అరికట్టేలా చర్యలు తీసుకుంటాం
- ఇక్కడ విదేశీ పక్షులు వలస వస్తాయి, ఎకో టూరిజం లా మారుస్తాం, పర్యాటక రంగంగా అభివృద్ది చేస్తాం, కనీసం కైకలూరు ను నగర పంచాయితీ కూడా చేయలేదు, దీనిని మంచి పట్టణంగా తీర్చిదిద్దుతాం
- దాదాపు ఇక్కడ 20 గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు, దాదాపు 66 వేల కోట్ల ఆక్వా వ్యాపారం , దేశంలో 40 శాతం మన రాష్ట్రం నుండి వస్తుంది. కానీ కనీసం కోల్డ్ స్టోరేజ్ లేదు, క్వాలిటీ సీడ్ ఉత్పత్తి లేదు, వారికి పూర్తి కరెంట్ లేదు, మేము అధికారంలోకి వచ్చాక ఆక్వా సాగును లాభసాటిగా మారుస్తాం
- ఆక్వా మీద 12 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు, దీనిని లాభసాటిగా మార్చే చర్యలు తీసుకుంటాం
- దారిపొడవునా జూ. ఎన్‌టిఆర్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి, రాజనీకాంత్ గారి అభిమానులు, ఇతర హీరోల అభిమానులు స్వాగతం పలికారు అందరికీ ధన్యవాదాలు
- ఆఖరికి రజనీకాంత్ గారిని కూడా ఈ వైసీపీపార్టీ నాయకులు వదలలేదు, ఆయన్ని తిట్టారు. వీళ్ళ దృష్టిలో ఎవరు ఎవరిని పోగడకూడదు, ఎంత గొప్పవారు అయినా సరే వారిని తిడతారు ఈ వైసీపీ నాయకులు
- 2009 లో మీకు ప్రజారాజ్యం ద్వారా మాట ఇచ్చాం కానీ నిలబెట్టుకోలేకపోయాం, కానీ 2024 లో జనసేన ద్వారా నిలబెట్టుకుంటాను
- తొలిప్రేమ సినిమా దగ్గర నుండి రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నాను. మీకు నా మీద పిచ్చి, నాకు దేశం మీద, నా ప్రజల మీద పిచ్చి. అందుకే ఉంటే ఉంటాను పోతే పోతాను అని రాజకీయాల్లో వచ్చాను, దెబ్బ తిన్నా సరే నిలబడ్డాను, నిలబడతాను, ప్రభుత్వాన్ని స్తాపిస్తాను, ప్రభుత్వాన్ని స్థాపించాను
- నేను NDA నుండి బయటకు రావాలి అనుకుంటే నేనే చెప్తాను, మీరు చెప్పకండి మేము బయటకు వచ్చేశాం అని, మేము NDA లో ఉన్నాం, మీరు ఎందుకు మా గురించి భయపడుతున్నారు
- నేను నా మతాన్ని ఆరాధిస్తాను, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ మతాలను గౌరవిస్తాను. నేను సనాతన ధర్మాన్ని గౌరవించేవాడిని. అలాంటిది 219 దేవాలయాలను, దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తే, అమ్మవారి వెండి రథం సింహం దొంగతనానికి గురైతే కనీసం వైయస్ జగన్ స్పందించలేదు, తప్పు అని చెప్పలేదు
- జనసేన అన్ని మతాలను గౌరవిస్తుంది, అందుకే బలంగా నా మతం గురించి , ఇతర మతాల గురించి మాట్లాడగలను
- నేను మీ అందరినీ నా కుటుంబంగా, నా అన్నతమ్ములు, అక్కాచెల్లెళ్ళు లా చూస్తాను, కులాల వారిగా విడదీసి చూడను.
- జగన్ సంక్షేమ పథకాలకు మీ డబ్బు నుండి ఇస్తున్నాడు, ఆయన జేబు నుండి ఇవ్వడం లేదు, నేను ఇంకో 10 వేలు అదనంగా ఇవ్వాలి అని, మీకు ఉద్యోగాలు ఇవ్వాలి అని కోరుకునే వాడిని, నేను పథకాలకు వ్యతిరేకం కాదు, కానీ సంపద సృష్టించకుండా కేవలం పథకాలు మాత్రమే ఇస్తే దానికి నేను వ్యతిరేకం
- 2014 లో నేను టీడీపి కి అండగా నిలబడినప్పుడు, మీరు ప్రభుత్వం స్థాపించినప్పుడు ఏరోజు నేను నా వల్లనే గెలిచింది అని చెప్పలేదు, నేను అన్నది ఏంటి అంటే మా మద్దతు ఇచ్చాం, ఏమీ ఆశించలేదు, ఒక్క ఓటు మా వల్ల పడినా దానికి కృతజ్ఞత ఉండాలి
- ఈరోజు @ncbn గారు జైల్లో ఉన్నారు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు, చంద్రబాబు గారు త్వరలోనే బయటకు వస్తారు అని అనుకుంటున్నాను. వైయస్ జగన్ పై 38 కేసులు ఉన్నాయి, ఈయన ఇతర పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తాడు
- జనసేన – టీడీపి కలిసి కనీసం 10 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంది. 2014 లో నేను మద్దతు ఇచ్చాక మాట నిలబెట్టుకొలేకపోతే నన్ను ప్రజలు శ్రీకాకుళంలో ప్రశ్నించారు. నేను బయటకు వచ్చాను, మాట మాట అనుకున్నాం, విడిపోయాం, ఇప్పుడు రాష్ట్రం కోసం కలిసి వెళ్తున్నాం
- 2014 తరహాలో జనసేన – టిడిపి – బీజేపీ కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది అని నేను అమిత్ షా గారికి, నడ్డా గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెప్పాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడడు అని కోరుకుని ప్రయత్నం చేసి ముందుకు వచ్చాను
- రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, వెనకబడి పోయింది, స్కూల్స్ మూతపడుతున్నాయి, వలసలు పెరుగుతున్నాయి, అందుకే నేను మాత్రం రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణం పోయే వరకు మీ కోసం అభివృద్ది కోసం పనిచేయాలి అని కోరుకుంటున్నాను
- తెలుగుదేశం నాయకులు అర్దం చేసుకోవాలి, మేము మీకు స్నేహ హస్తం ఇచ్చాము, మీరు అదే విధంగా మా వారితో స్నేహంగా ఉండండి, గతంలో గొడవలు పక్కన పెట్టండి. నేను చంద్రబాబు గారితో విభేదాలు ఉన్నా సరే నేను రాజమండ్రి జైలుకు వెళ్లి కలిశాను
- నేను NDA తోనే ఉన్నాను, అమిత్ షా, నడ్డా గార్లపై, ప్రధాని నరేంద్ర మోదీ గారిపై అపారమైన గౌరవం ఉంది. అందరం కలిసి వెళతాం అని అనుకుంటున్నాను
- కోడూరు రోడ్డు, కైకలూరు రోడ్డు, పెడన టెక్స్టైల్ పార్క్, కైకలూరు డంపింగ్ యార్డ్, RTC ఉద్యోగుల సంక్షేమం, మెగా DSC, బందర్ పోర్ట్, దళితులను చంపి బయట తిరిగే నాయకులు, అభివృద్ధికి నోచుకోని రాష్ట్రం, మూటబడిన బడులు, అప్పుల ఆంధ్రప్రదేశ్, పూర్తికాని పోలవరం ఇవన్నీ వైయస్ జగన్ నొక్కని బటన్స్
- మసీద్ నుండి నమాజ్ వస్తే ప్రసంగం ఆపమని నా సనాతన ధర్మం నేర్పింది, అలాంటి నేల ఇతర మతాలపై దాడులు చేయమని చెప్పదు
- జగన్ ను పంపించే సమయం అయింది, ఇక జగన్ కు టాటా చెప్దాము