- రాష్ట్రం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది, సభ పెట్టాలంటే ప్రత్యేక అనుమతులు, రాష్ట్రంలోకి అడుగుపెట్టాలి అంటే అడ్డంకులు వీసా అడుగుతున్న పరిస్థితి ఉంది
- వైసీపీ దాష్టీకానికి జనసైనికులు, ఈ నేల తాలూకు పౌరుషం ఉంది, వారు చూపించారు. ఇక్కడ అక్రమ మట్టి త్రవ్వకాలు చేస్తుంటే జనసైనికులు అడ్డుకుంటే వారిని అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి కొట్టారు
- ఇక్కడ ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు నుండి వెళ్ళాలన్నా జనసైనికులు నమస్కారం పెట్టి వెళ్లాలి అనే నిబంధనలు ఉన్నాయంట, అవన్నీ తీసేద్దాం
- వైసీపీ నవరత్నాలకు జరిగేదానికి పొంతన లేదు, ఓట్లు వేయించుకొడానికి నవరత్నాలు అని మోసం చేశారు, వైసీపీపార్టీ ప్రభుత్వం రూపాయి పావలా ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్ ను విభజించిన రోజు మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ గారి మీద దాడి జరిగింది, అది మర్చిపోను
- 2014 లో బీజేపీ – టీడీపి కూటమికి మద్దతు పలకడానికి కారణం ఒక 10 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం, కొన్ని పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు, ఇప్పుడు మరోసారి కలిసి వస్తున్నాం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అని కోరుకున్నాను
- జగన్ అద్భుతాలు సాధించా అని చెప్తాడు…
రూరల్ డెవలప్మెంట్ మంత్రి సాద్వి నిరంజన్ గారు మాట్లాడుతూ, అత్యంత అవకతవకలు జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పారు. నిధులు మళ్లించారు. ఈయన జాతీయ ఉపాధి పథకం క్రింద కార్మికుల పొట్ట కొట్టాడు ఈ పెద్ద మనిషి వైయస్ జగన్ - జాతీయ ఉపాధి పథకం క్రింద 337 కోట్లు మళ్ళించాడు వైయస్ జగన్, కేవలం 6.22 కోట్ల డబ్బు మాత్రమే ఖర్చు జరిగింది, మిగతావి దారి మళ్లించారు
- అక్రమ తవ్వకాలు అడ్డుకుంటే మా వల్ల మీద అక్రమ కేసులు, హత్య కేసులు పెట్టారు, NCRB డేటా ప్రకారం, ప్రభుత్వ తప్పిదాలపై ఎదురు తిరిగినందుకు అత్యధిక కేసులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు ఈ వైయస్ జగన్ ప్రభుత్వం
- ఈ జగన్ అనే దుష్ట వ్యక్తి, అన్యాయంగా కేసులు పెట్టించారు, మర్దర్లు చేసిన వారిని గద్దెనెక్కించిన మీకు లేని భయం, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్దంగా ఉన్న నేను ఎందుకు భయపడతాను
- మాట్లాడితే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అంటారు,
RTC ప్రభుత్వంలో విలీనం చేసి వారినే ఉద్యోగాలు ఇచ్చాం అంటాడు, ఔట్ సోర్సింగ్ వార్డ్ వాలంటీర్లు నియమించి వారే మేము ఇచ్చిన ఉద్యోగాలు అంటారు. నిజంగా ఉద్యోగాలు ఇస్తే అవనిగడ్డలో మెగా DSC కోసం ఎదురుచూసిన అభ్యర్థులు ఎందుకు వస్తారు - పెడన MLA జోగిరమేష్ అవినీతి
కొత్త పాస్ బుక్ కావాలి అంటే 10 వేలు, చేపల చెరువు కోసం 1.5 లక్ష, మోటార్ ఆయన చెప్పిన షాప్ లో కొనాలి, చేపల దాణా షాప్ పెట్టాలి అంటే 2-3 లక్షల లంచం ఇవ్వాలి అంట, మడ అడవులు ద్వంసం చేశాడు, అక్రమ మట్టి, ఇసుక త్రవ్వకాలు త్రవ్వేశాడు - జగన్… మీ రూపాయి పావలా ప్రభుత్వంలో,
మొదటి దశలో 60 వేలు, 2 వ దశలో లక్ష ఇల్లు అని చెప్పి, తరవాత ప్రతీ పండగకు ఇళ్లే ఇల్లు అని చెప్పి, ఇప్పుడు ఎన్ని ఇల్లు నిర్మించారు? కేవలం 8,808 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు, ఇందులో సగానికి పైగా దోచేశారు - పండగలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ జగన్ చెప్పిన 28 లక్షల లు ఎక్కడ ఉన్నాయో, ఏమయ్యాయో తెలీదు, ఈయన క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు
- జగనన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన విపత్తు
- యువతకు ఉపాధి ఎక్కడ? ఉద్యోగాలు ఎక్కడ? పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వస్తే జగన్ కు పర్యావరణం గుర్తొస్తుంది, ప్లాస్టిక్ నిషేధం అంటాడు, వారి ఉపాధి దెబ్బ తీస్తాడు, తరవాత మళ్లీ మామూలే, పవన్ కళ్యాణ్ సినిమా వస్తే పెదాలు గుర్తొచ్చి టిక్కెట్ ధర తగ్గిస్తాడు
- ఈ ప్రాంతాన్ని చతుర్ముఖ నగరాలుగా అభివృద్ది చేస్తాము, ఆంధ్రప్రదేశ్ లో కుల భావన ఎక్కువ, జాతి భావన తక్కువ, తెలంగాణలో ప్రాంత భావన ఎక్కువ కుల భావన తక్కువ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి దగ్గర దేహీ అని అడుక్కునే పరిస్థితి ఉండకూడదు, దానికోసం నన్ను తిట్టిన వారి దగాగ్రకు వెళ్లి కూడా చేయి కలపడానికి సిద్దంగా ఉన్నాను
- కనీసం రాజధాని కూడా సాధించుకొలేక పోయాం, ఇలానే ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి
- మూడు నెలలు కర్రసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మ ను కొట్టినట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు ఉంటే రాష్ట్రం కోసం పోరాడకుండా, వచ్చి మాపై దాడులు చేస్తావా
- జగన్ దగ్గర పావలా దమ్ము కూడా లేదు, కనీసం పార్లమెంట్ లో గళం ఎత్తలేదు, ఆరోజు సోనియా గాంధీ గారికి కనిపించకుండా మూలకు వెళ్లి ప్లకార్డ్ పట్టుకున్నాడు
- కేంద్రం దగ్గరకు వెళ్లి నా మీద కేసులు కొంచెం లేకుండా చేయండి అని కాళ్ళు పట్టుకుంటాడు ఈ ముఖ్యమంత్రి వైయస్ జగన్
- నేను మిమ్మలని కులాల వారిగా చూడను, మీరు అందరూ నా వాళ్ళు, ప్రజలను కులాల వారీగా విభజించే సంస్కృతి తీసేస్తున్నాను
- నన్ను మీరు కులం చూసి అభిమానించలేదు, నేను కూడా మిమ్మల్ని కులాల వారీగా చూడను
- నన్ను కుల నాయకులతో విమర్శించే చచ్చు సలహాలు నా దగ్గర పనిచేయవు జగన్
- నిజంగా చేనేత కళాకారులకు అండగా ఉంటే వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? కలంకారీ పరిశ్రమకు ప్రోత్సాహం ఎక్కడ ఉంది ? ఇదేనా మీరు వారికి చేసిన అభివృద్ది జగన్
- జగన్ ది కుటుంబ పాలన, అందరూ వారి కుటుంబ సభ్యులు, బంధువులే, వారు కాకుండా, ఇతర కులస్తులతో తిట్టిస్తారు, కులాల మధ్య గొడవలు సృష్టిస్తారు
- తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు, మీ అనుభవం అవసరం అని మా జనసేన బలం, పోరాట పటిమ ఉన్న యువ రక్తం మీకు అవసరం, కలిసి నడిస్తే వైసీపీపార్టీ ను భూస్థాపితం చేయొచ్చు అని మద్దతు ఇచ్చాను
- మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆశీసులతో ఈ వైసీపీపార్టీ ప్రభుత్వాన్ని కూల్చెద్దాం
- పాలించేవాడు మనకు అండగా లేనప్పుడు, అతడిని కోల్చేయడానికి, తిరుగుబాటు చేయడానికి అన్ని పార్టీలు కలిసి రావాలి, రేపు 2024 ఎన్నికల్లో అతడిని తీసేద్దాం, రాజకీయాల్లో జగన్ అనే వ్యక్తి అనర్హుడు, అతడిని రాజకీయాల్లో లేకుండా చేద్దాం
- 38 కేసులు ఉన్న వ్యక్తి వైయస్ జగన్ పాలించేందుకు అనర్హుడు
- పోలీస్ అధికారులు నాకు నోటీసులు ఇస్తున్నారు, గతంలో కోనసీమలో గొడవలు జరుగుతాయి అని చెప్పాను, అది జరగలేదా? మీరు రాజకీయ పార్టీలకు అండగా మాట్లాడకండి, నాకు సమాచారం ఉంది
- పోలీసులు నన్ను సమాచారం ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మొన్న నేను మంగళగిరి వస్తుంటే కోర్టుకు వెళ్తున్నాను అని సమాచారం వచ్చింది అని ఫ్లైట్ ఆపరు, మీకు ఎవరు సమాచారం ఇచ్చారో ముందు చెప్పండి
- స్వయంగా ప్రధానమంత్రి గారు కలిసిన వ్యక్తిని మీరు రాష్ట్ర సరిహద్దులో ఆపెస్తారా మీరు? మీరు నాకే ఇన్ని ఇబ్బందులు పెడితే మరి సాధారణ పెడన పౌరుడికి ఏం రక్షణ కల్పిస్తారు?
- SP గారు రాజకీయాల్లో తలదూర్చకండి, మీరు రాజకీయ పార్టీకి కొమ్ము కాయకండి. నేను ఏరోజు మా జనసైనికులను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు
- కడప జిల్లా, పులివెందుల నుండి వచ్చి, ఆ ప్రాంతాన్ని గొడవలకు అడ్డా గా మార్చి, ఇప్పుడు ఆ సంస్కృతిని రాష్ట్రం అంతా వ్యాపించావు, జగన్ నేను నువ్వు అనుకున్నంత పిరికివాడిని కాదు, మీ నాన్నతో గొడవ పెట్టుకున్న వాడిని, నువ్వేం చేయగలవు
- నువ్వు ఎవరితో అయినా పెట్టుకో, నాతో పెట్టుకోకు, తొక్కి పట్టి నారా తీస్తా జాగ్రత్త, నేను సాధారణ రాజకీయ నాయకుడిని కాదు విప్లవ స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకుడిని జాగ్రత్త
- వాలంటీర్లతో కేసులు పెట్టించాలని చూస్తున్నావ్, ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకో, రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థ అది, కోర్టులో తేల్చుకుందాం
- జగన్, నేను అప్పటి ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను, నువ్వు రాజకీయాల్లో కూడా లేవు, నువ్వు పరీక్ష పేపర్లు కొట్టేసినప్పుడు నేను దేశం కోసం ఆలోచించాను నువ్వు SI ను కొట్టినప్పుడు భగత్ సింగ్ స్ఫూర్తి అర్దం చేసుకున్నాను, నువ్వేం చేస్తావు నన్ను జగన్
- జగన్ లాల్ బహదూర్ శాస్త్రి గారిలా, మహాత్మా గాంధీ గారిలా, అటల్ బిహారీ వాజపేయి గారిలా అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది, అడ్డగోలుగా లక్ష కోట్లు తినేసిన జగన్ కు ఓటేసినప్పుడే అవినీతిని అందరూ సమర్డించినట్లు అయింది
- ఓటుకు 509 నుండి 2 వేలు తీసుకున్న మనం రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడటం ఎలా ఉంటుందో ఆలోచించండి
- నేను మీ నుండి ఏమీ దొచుకొను, నా దగ్గర డబ్బు లేదు, ఇవ్వలేను, కానీ మంచి భవిష్యత్తు ఇస్తాను
- 2047 సమయానికి బలమైన నాయకత్వం రావాలి, తయారు చేయాలి అనేదే నా ఆలోచన
- లక్షకోట్ల అవినీతి చేసిన వైయస్ జగన్ ముందు చిన్నపాటి కరప్షన్ చేసే అధికారులది ఏముంది
- లక్ష కోట్లు అవినీతి చేసిన ఈ వైయస్ జగన్ , అవినీతిని అంతం చేస్తాను, ACB ను నడిపిస్తా అనటం హాస్యాస్పదం
- 900 చేనేత సహకార సంఘాలకు ఆప్కో భాకీ ఉన్న డబ్బు ఎందుకు ఇవ్వడం లేదు
- 20 లక్షల మందికి మత్స్యకార భరోసా ఇవ్వాలి కానీ కేవలం 1 లక్ష మందికి మాత్రమే ఇస్తున్నారు
- త్వరలో తెలుగుదేశం వారితో కూడా చర్చించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి మానిఫెస్టో విడుదల చేస్తాం
- సినిమాల్లో మాత్రమే ఉంటే కోట్ల సంపాదన ఉండేది, కానీ దేశం కోసం పనిచేయాలి అని రాజకీయాల్లోకి వచ్చాను
- అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలను చతుర్ముఖ ప్రాంతాలుగా అభివృద్ది చేస్తాం
- అవనిగడ్డ ప్రాంతం ఆధ్యాత్మిక నేల, మచిలీపట్నం పోర్ట్ రవాణకు, పెదన చేనేత, కలంకారీ కళ కు, కైకలూరు ఆక్వా కల్చర్ కు అభివృద్ది చేస్తాం
- దివిసీమ అనగానే తుఫాన్ కాకుండా గ్రోత్ కారిడార్ గా తీర్చిదిద్దాలి అని ఆలోచిస్తున్నాను
- దివిసీమ లో మంచి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి శిక్షణా ఇస్తాం , మెరైన్ టూరిజం అభివృద్ది చేస్తాం
- గతంలో ఉద్దానం సమస్యలపై బలంగా పోరాడాం, రాజధాని భూసేకరణ కొన్ని గ్రామాల్లో ఆపించాను, ఏ సమస్యలపై అయినా బలంగా పోరాడే సత్తా ఉంది నాకు
- రాష్ట్రానికి 900 పై కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది, ఇది రాష్ట్ర అభివృద్ది కోసం ఉపయోగించాలి
- బలమైన యువత ఉంది, వారికి ఉపాధి అవకాశాలు ఉండాలి, మీకు శిక్షణా సంస్థలు ఏర్పాటు చేసి ఉద్యోగాల్లో చాయిస్ ఉండేలా ప్రణాళికలు వేస్తాం
- జగన్ మెడికల్ సీట్లు అమ్మేసుకున్నాడు. బీసీ, SC, ST వర్గాలకు రావలసిన సీట్లు డబ్బులకు అమ్మేసుకున్నారు ఈ వైయస్ జగన్
- ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం బలంగా నిలబడి అన్ని ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డాను, అనుభవం తెచ్చుకున్నాను, జనసేన – టీడీపి కలిసి రానున్నాం, బీజేపీపార్టీ కూడా కలిసి ఉంటుంది అని ఆశిస్తున్నాను
- ఎవరు ఏమి అనుకున్నా నా ప్రయారిటీ నా రాష్ట్రం, నా ప్రజలు, దానికోసం ఎవరు ముందుకు వచ్చినా కలిసి పోరాడుతామని చెప్తున్నాను
- మా సభల్లో మేము జనసేనను ముందు పెట్టి టీడీపి ను తరవాత పెడతాను, మీ సభల్లో మీరు ముందు మీ పార్టీని పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు. నేను మా జనసైనికులకు, వీర మహిళలకు విలువ ఇస్తాను, ఇది ఎవరిని తక్కువ చేసినట్లు కాదు, విభేదాలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం కలిసి పనిచేయండి
- భవిష్యత్తులో ఖచ్చితంగా స్థానిక MLA జోగిరమేష్ తను చేసిన తప్పులకు విచారణ ఎదుర్కోవాలి, జైలుకు వెళ్లాలి, అది రాజమండ్రి కంటే మంచి జైలుకు పంపిస్తాం
- అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి
అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి
జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి
“హలో ఏపీ – బై బై జగన్” - ఒక ప్రజా కంఠకుడు మనల్ని హింసిస్తున్నాడు అందరం కలిసి పోరాటం చేయాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి