- పంచాయితీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, మాకు నిధులు ఇవ్వకుండా ఇచ్చాం అని వైసీపీపార్టీ ప్రభుత్వం చెబుతోంది, 8,660 కోట్లు దోచుకున్న దొంగలు ఎవరు? వైసీపీ ప్రభుత్వమే దొంగ. పంచాయితీ నిధులు పంచాయితీలకు మాత్రమే వాడాలి, కనీసం గ్రామ సచివాలయంలో సర్పంచ్ కు స్థానం లేదు. జనసేన – టీడీపీ ప్రభుత్వం వచ్చాక గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తాం.
- తీర ప్రాంతానికి రక్షణగా ఉండే సహజ సిద్దంగా ఏర్పడిన ఇసుక దిబ్బలను వైసీపీ నాయకులు దోచేస్తున్నారు, దీని వలన పంట భూముల్లోకి ఉప్పు నీరు చేరి పంటలు పండకుండ నాశనం అవుతున్నాయి. ఇసుక దిబ్బలు జాతీయ ఆస్తి, ప్రకృతిని ద్వంసం చేస్తున్నారు, IAS అధికారులు కూడా నాయకుల ఒత్తిడికి లొంగీ పనిచేయడం బాధాకరం. జనసేన ప్రభుత్వం వచ్చాక దీనిపై తీవ్ర చర్యలు తీసుకుంటాం
- కృష్ణా నది పరివాహక ప్రాంతం గ్రామాలకు కనీసం 10 బిందెల నీళ్ళు ఇవ్వలేని వైసీపీపార్టీ ప్రభుత్వం.
కేంద్రం ఇంటింటికీ కుళాయి పథకం కోసం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వక పోవడం వలన కుళాయి కనెక్షన్లు అమలు కావడం లేదు. నీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది - చేనేత కళాకారులకు వైసీపీపార్టీ ప్రభుత్వం కనీస ప్రోత్సాహం ఇవ్వడం లేదు. అప్పుల భాదతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమస్యలు మాకు చెప్పుకుంటే ఇక్కడ పెన్షన్ తీసేస్తారు అని భయపడుతున్నారు, చేనేత ను ఒక కళగా గుర్తించి ప్రోత్సాహం ఇవ్వాలి. నేను చేనేత కళకు బ్రాండ్ అబాసిడర్ అని చెప్పాను, అది నాకు వారిపై ఉన్న గౌరవం
- బధిరుల సమస్యలను ప్రభుత్వాలు అర్దం చేసుకోవాలి. వారికి కార్పొరేషన్ ఉన్నా నిధులు వారి అభివృద్ది కోసం ఖర్చుపెట్టడం లేదు, వారికి ఉపాధి అవకాశాలు కానీ, శిక్షణ కానీ కల్పించలేదు. కనీస పింఛన్ అందడం లేదు. వారికి అర్థమయ్యే సైన్ లాంగ్వేజ్ తెలిసిన వారు సమస్యలు అర్దం చేసుకోవడం కోసం ప్రభుత్వం తరపున ఎవరూ లేరు.
- వైసీపీ కార్యాలయం కోసం స్థలం ఉంటుంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణం అయిన ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి రామయ్య గారి స్మారక భవనానికి, బ్యాంక్ CSR నిధుల నుండి నిర్మిస్తాం అన్నా సరే స్థలం కేటాయించడం లేదు వైసీపీపార్టీ ప్రభుత్వం. యూనియన్ బ్యాంక్ లో విలీనం సమయంలో కూడా కనీసం వైసీపీ ఎంపీలు ప్రతిఘటించలేదు
- దివ్యాంగులకు గౌరవం కల్పించేలా SC, ST అట్రాసిటీ తరహా చట్టం తీసుకురావాలి, వారి కి అవకాశాలు కల్పించాలి, వారి ధృవీకరణ పత్రాలను సత్వరమే అందించేందుకు ప్రత్యేక క్యాంపులు జనసేన ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం.
- క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు వైయస్ జగన్ కు లేదు. దోపిడీ చేసే వారికి అండగా జగన్ ఉన్నాడు, నంద్యాల నుండి వారి ఇళ్లు కూలగొడుతున్నారని, 1000 మందిని ఇళ్ళ నుండి తరిమేశారు. ఖచ్చితంగా వీరికి అండగా నిలబడతాం, వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుంటాం
- సకాలంలో ఆస్తిపన్ను, విద్యుత్ బిల్ కడుతున్నారు సరే పెనాల్టీలు, వడ్డీలు వేసి దోచుకుంటున్న వైసీపీపార్టీ ప్రభుత్వం
- వైసీపీ ప్రభుత్వంలో న్యాయమూర్తుల స్థలాలకు రక్షణ లేదు
జడ్జ్ గా పనిచేసిన తన కుమారుడి స్థలాన్ని ఆక్రమించిన మంత్రి జోగిరమేష్ అనుచరులు, దీనిపై వైసీపీపార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిఈరోజు ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి, ల్యాండ్ కబ్జా, దివ్యాంగుల సమస్యలు, కరెంటు మీటర్ రీడర్స్ సమస్యలు, మహిళల సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వచ్చాయి, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతాం - రేపు పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నాం. రేపటి సభలో దాడులు చెయ్యడానికి కొంతమంది వైసీపీపార్టీ కిరాయి గూండాలు ప్రయత్నిస్తున్నారు అనే సమాచారం ఉంది, దయచేసి జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
- జగన్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మాపై రేపు పెడన సభలో కత్తులు, రాళ్లతో దాడులు చేయించాలని చూస్తున్నావ్, ఏదైనా జరిగితే బాధ్యత నీదే, రాష్ట్ర డీజీపీ, జిల్లా SP, అధికారులకు, కలెక్టర్లకు చెప్తున్నాను శాంతి భద్రతలు కాపాడాల్సిన మీరు వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం సరి కాదు, ఖచ్చితంగా గూండాలను ఎదుర్కొంటాము.
- అమలాపురం నుండి అడుగడుగునా వారాహి విజయ యాత్ర అడ్డుకోవడానికి వైసీపీపార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రేపు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత.
- రేపు జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి, వైసీపీపార్టీ కిరాయి రౌడీలు దాడులకు ప్రయత్నిస్తే మీరు ప్రతిదాడి చెయ్యకుండా అడ్డుకుని పోలీసులకు అప్పగించండి