- జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఇద్దరు మహనీయులకు నివాళి అర్పిస్తున్నాను
- స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో మహాత్మా గాంధీ గారు మన మచిలీపట్నం ప్రాంతానికి పలుమార్లు వచ్చారు, ఇక్కడి నేషనల్ కళాశాల కు వచ్చారు, అలాంటి కళాశాల నేడు శిధిలావస్థలో ఉండటం బాధాకరం
- పింగళి వెంకయ్య గారు, అడవి బాపిరాజు గారు, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాత్మా గాంధీ లాంటి మహనీయులు విచ్చేసిన మచిలీపట్నం నేషనల్ కళాశాల శిధిలావస్థలో ఉండటం, దానిని పట్టించుకోకపోవడం దురదృష్టకరం
- గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహం, సహాయనిరాకరణ ఉద్యమం స్వాతంత్ర్య సంగ్రామంలో చాలా కీలక పాత్ర పోషించాయి
- జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారు పుట్టిన ప్రాంతం, ఆయన తిరిగిన ప్రాంతం మచిలీపట్నం, ఇది జాతీయ భావాలు ఉన్న నేల. మార్చ్ 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ అనంతరం జాతీయగీతం వచ్చినప్పుడు 10 లక్షల మంది నిలబడి జాతీయగీతం ఆలపించారు
- మన రాష్ట్రంలో సంపద దొచేసి, విదేశాలకు తరలిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎలా తరలిస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం
- వచ్చే సంవత్సరం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాంధీ జయంతి వేడుకలు మచిలీపట్నంలో జరుపుకుందాం
- గాంధీ గారి గొప్పతనం ఏంటంటే ప్రస్తుత సమకాలీన రాజకీయ నాయకుల్లాగా, ముఖ్యమంత్రి వైయస్ జగన్ లా ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాల పై అక్రమ కేసులు పెట్టినట్లు కాకుండా తనతో అభిప్రాయ విభేదాలు ఉన్నప్పటికీ, దేశ ప్రజల శ్రేయస్సు కోసం అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాణ కమిటీ లోకి తీసుకున్నారు
- గ్రామ పంచాయతీ వ్యవస్థ విశిష్ట అధికారాలు తీసేసి, గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం ఆలోచనకు తూట్లు పొడిచాడు వైయస్ జగన్, గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది వైసీపీ పార్టీ ప్రభుత్వం
- జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన నినాదంతో ఎంతోమంది ఒక పూట భోజనం మానేసి సైనికులకు యుద్ద సమయంలో అండగా నిలబడ్డారు, ఆయన స్ఫూర్తి మనకు ఆదర్శం