33వ రోజు ( హైలెట్స్ ) – అవనిగడ్డ బహిరంగ సభ

అవనిగడ్డ
  • సభకు విచ్చేసిన జనసైనికులు, వీర మహిళలతో పాటుగా, మద్దతు ఇచ్చి విచ్చేసిన తెలుగుదేశం తెలుగు తమ్ముళ్లకు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నాను
  • నిన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కురుక్షేత్రం ప్రారంభం అయింది అన్నాడు, నిజమే కానీ ఈ కురుక్షేత్రంలో కౌరవులు వైసీపీపార్టీ వారు, 100 మంది పైగా ఉన్నారు కాబట్టి వారే కౌరవులు, మీరు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే, మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారం లోకి రావడం, DSC అభ్యర్థులకు న్యాయం చేయడం డబుల్ ఖాయం
  • DSC ట్రైనింగ్ కు అవనిగడ్డ ఆయువు పట్టు, దాదాపు రాష్ట్రంలో 30 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అయ్యారు, మెగా DSC ఇప్పటి వరకు ఇవ్వలేదు వైసీపీపార్టీ ప్రభుత్వం
  • పాదయాత్ర అని వచ్చి అందరినీ కలిసి హామీలు ఇచ్చి ఎవరికి న్యాయం చెయ్యలేదు, హామీలు నిలబెట్టుకోలేదు
  • 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, అనుభవం సంపాదించాను, మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని నిలబడ్డాను
  • కురుక్షేత్ర యుద్ధం కావాలో David vs Goliath కావాలో తేల్చుకో వైయస్ జగన్
    మీ ఓటమి ఖాయం
    మా గెలుపు డబుల్ ఖాయం
    మెగా DSC ట్రిపుల్ ఖాయం
  • పోలీస్ వారు నా సోదరులు లాంటి వారు, వారి కష్టాలు నాకు తెలుసు, వారి సమస్యలు పరిష్కారం చేస్తాను, యువత పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, మన ప్రభుత్వం రాగానే పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తాం, మీకు ఉద్యోగాలు కల్పిస్తాం
  • ఇది పింగళి వెంకయ్య గారికి జన్మనిచ్చిన నేల, జాతీయ పతాకాన్ని ఇచ్చిన నేల
  • నేను 2014 లో BJP, TDP కి మద్దతు ఇచ్చిన తరవాత కొన్ని హామీల విషయంలో, ప్రత్యేక హోదా అమలు చెయ్యకపోతే, నేను వారితో విభేదించి బయటకు వచ్చాను, నేను ప్రజా సమస్యలపై, మీకు ఇచ్చిన హామీల పట్ల అంత నిబద్దతగా ఉంటాను. ఈరోజు మళ్ళీ ప్రత్యేక పరిస్థితుల్లో మళ్ళీ మద్దతు ఇస్తున్నాం
  • పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గెలిచి ఉంటే ఈరోజు DSC అభ్యర్థులు ప్లకార్డులు పట్టుకుని నించోనే అవసరం వచ్చేది కాదు
  • ఈ సారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వను అని అంటున్నాను, వైసీపీపార్టీ ను అధికారంలోంచి దించేయడమే జనసేన లక్ష్యం. జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం స్తాపిస్తాం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం
  • జగన్ లాంటి వ్యక్తి వేల కోట్లు దోచేసిన తరవాత కూడా ఇంకా ఇసుక దోచేస్తూ ఉన్నాడు
  • మీకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కారణం మీ దగ్గర డబ్బులు ఉండకూడదు అని, నా సినిమాలకు టిక్కెట్లు 5 రూపాయలు చేయడానికి కారణం నా దగ్గర డబ్బులు ఉండకూడదు అని, ఇలా ఆలోచిస్తాడు వైయస్ జగన్, అందరూ ఆయన దగ్గర దేహీ అని ఉండాలి అనుకుంటాడు
  • 2024 లో వచ్చేది జనసేన – తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం. జగన్ లాంటి అధికార మదంతో ఉన్న నాయకులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, కానీ నా దగ్గర ఓట్లు కొనడానికి డబ్బులు లేవు, ఈ ఒక్కసారి ఆలోచించండి, 500, 2 వేలకు ఓట్లు వేయకండి
  • వేలాది కోట్లు ఉన్నవాడితో, ప్రైవేట్ సైన్యం ఉన్న వాడితో, అనుభవజ్ఞులైన వారిని కూడా కటకటాల్లోకి పంపించిన వ్యక్తితో నేను తలపడుతున్నాను అంటే ఎంత బలంగా మీ కోసం నిలబడ్డాను అనేది అర్దం చేసుకోండి
  • వైసీపీ సన్నాసులు నేను డబ్బు తీసుకున్నాను అని వాగుతున్నారు, పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు, వేళ్ళు డబ్బులు తీసుకుంటారు అని నేను తీసుకుంటాను అనుకుంటున్నారు, నా కష్టార్జితం తో పార్టీ నడుపుతున్నాను, డబ్బు ఆశ ఉంటే మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో 10 ఏకరాలు కోనే వాడిని
  • రేపు ఎన్నికల్లో నాకు ముఖ్యమంత్రి స్థానం వచ్చినా, ఏ స్థానం వచ్చినా సరే నా ఆలోచన మాత్రం మీ అభివృద్ది, ఆడపడుచుల నుండి పారిశ్రామిక వేత్తలు రావాలని కోరుకుని దానికోసం పనిచేస్తాను
  • GER సర్వే లో 3 లక్షల 17 వేల 2 వందల కుటుంబాలు రాష్ట్రం నుండి వలస వెళ్లిపోయాయి అని తేలింది. 3 లక్షల 88 వేల విద్యార్థులు స్కూల్స్ నుండి డ్రాప్ అయ్యారు, 62,754 మంది పిల్లలు చనిపోయారు అని తేలింది. మేము అడిగితే ఆంధ్రప్రదేశ్ కార్యాలయం పసలేని సమాధానం ఇచ్చింది. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాను
  • అవనిగడ్డ, దివిసీమ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పట్టిసీమ నుండి ఇంతకు ముందు నీరు వచ్చేవి, 900 క్యూసెక్కుల నీరు అవసరం అయితే సుమారు 300 క్యూసెక్కుల నీరు మాత్రమే వైసీపీపార్టీ ఇస్తుంది. పంట ఎండిపోతున్నాయి, నేను కనుక అసెంబ్లీలో ఉండి ఉంటే దీనిపై బలంగా ప్రశ్నించి విడుదల అయ్యేలా చూసేవాడిని
  • నాకు రైతులు అంటే ప్రేమ, అందుకే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా డబ్బులు ఇచ్చిన వాడిని, ఒకసారి మాట ఇచ్చాను అంటే మీ కోసం ప్రాణం పోయేవరకు నిలబడేవాడిని
  • గత ఎన్నికల్లో గుడ్డిగా వైసీపీపార్టీ ను నమ్మి ఓటువేసారు, వారు అందరినీ మోసం చేశారు, నేను మిమ్మల్ని మోసం చేయను, అద్భుతాలు చేస్తా అని తప్పుడు హామీలు ఇవ్వను, కానీ మీ కోసం పనిచేస్తాను, మీ అభివృద్ది కోసం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం పనిచేస్తాను
  • 10 ఏళ్లుగా మీ కోసం నిలబడి ఉన్నాను, ఎక్కడకు పారిపోలేదు, మీ మీద, నా నేల మీద ఉన్న ప్రేమ ఇలా ఓడిపోయినా సరే నిలబడి ఉన్నాను. ఒక్కసారి మీ భవిష్యత్తు కోసం మాకు అవకాశం ఇవ్వండి
  • మీ 5 సంవత్సరాలు కోల్పోతే తిరిగిరాదు, జగన్ కు ఒక 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా పర్లేదు, మీ విలువైన 5 సంవత్సరాల కాలం కోసం నాకు అవకాశం ఇవ్వండి, మీకు ఉపాధి అవకాశాలు కల్పించి చూపిస్తాను
  • లక్షలాది కోట్లు ఉన్నవాడితో, ప్రైవేట్ సైన్యం ఉన్న వాడితో, అనుభవజ్ఞులైన వారిని కూడా కటకటాల్లోకి పంపించిన వ్యక్తితో మీకోసం నేను తలపడుతున్నాను అంటే నా నైతిక బలం ఎంత అనేది అర్దం చేసుకోండి.
  • నేను వెళ్లి నా సినిమా విడుదల అవుతుంది, కొంచెం టిక్కెట్లు రెట్లు పెంచండి అని అంటే, వైయస్ జగన్ కు ఆనందంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చాడు అని, నాకు ఒక పొగరు ఉంది జగన్, సినిమాలు ఆపుకుంటే ఆపుకో, భయపడతా అనుకుంటున్నావా? ఏం చేయగలవ్ జగన్ నన్ను
  • నేను భగత్ సింగ్ వారసుడిని, నీకు భయపడే వాడిని కాదు జగన్
  • ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీరు అండగా నిలబడండి, మళ్ళీ మీరు వైసీపీపార్టీ ను గెలిపించి తప్పు చేస్తే ఎవరూ ఏం చేయలేరు, నేను మాత్రం ఎక్కడికి పారిపోను, ఇక్కడే మంగళగిరి లో ఉంటాను
  • 10 ఏళ్లు ముద్దులు పెడుతున్నాడు, తిరుగుతున్నాడు అని వైయస్ జగన్ ను గెలిపిస్తే, దయ్యమై రాష్ట్రాన్ని పీడిస్తున్నాడు
  • పింగళి వెంకయ్య గారు పుట్టిన నేల మీద ఎలాంటి వ్యక్తులు ఎమ్మెల్యే లుగా ఉన్నారో అర్దం చేసుకోండి
  • 2024 లో వోట్లు చీలకూడదు, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అండగా నిలబడండి
  • నేను కులాల మధ్య వైషమ్యాలు దూరం చేయడానికి కులాల గురించి, వారికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతాను, వైయస్ జగన్ లా ప్రధాన పదవులు అన్నీ ఒకే కులానికి కట్టబెట్టే మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాదు
  • నా అభిమానుల్లో, జనసైనికుల్లో అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని కులాల వారికి న్యాయం జరగాలని ఆలోచించే వ్యక్తిని
  • ఆంధ్రప్రదేశ్ ను పట్టి పీడిస్తున్న, ఉద్యోగాలు ఇవ్వకుండా చేసిన, ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వైసీపీపార్టీ మహమ్మారికి వ్యాక్సిన్ జనసేన – టీడీపి కూటమి విజయం
  • గొంతుకు దాహం తీర్చే జనసేన “గ్లాస్”, నేలను అంటిపెట్టుకుని ఉండే తెలుగుదేశం “సైకిల్” రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నాయి, ప్రభుత్వాన్ని స్తాపిస్తాం, కరెంట్ కోత మోగించే వైసీపీపార్టీ ఫ్యాన్ ను పీకేద్దాం
  • నన్ను కాపులతో తిట్టించే పిల్ల వేషాలు వేస్తాడు వైయస్ జగన్, నన్ను ఎవరితో తిట్టించినా ఏం ఫరక్ పడదు జగన్, ఇలాంటి పిల్ల వేషాలు, సచ్చు సలహాలు ఇవ్వడం ఆపి, మెచ్యూర్ గా ఆలోచించు
  • పార్టీలోకి నాదెండ్ల మనోహర్ గారిలా బలంగా గెలుపోటములకి అతీతంగా నిలబడే నాయకులు ఎవరైనా రావొచ్చు, అలాంటి వారికి జనసేన స్వాగతం పలుకుతుంది
  • 2047 సమయానికి మీలోంచి బలమైన నాయకులను తయారు చేయడమే నా లక్ష్యం, స్వాతంత్య్రం సమయంలో యువ నాయకులను తయారు చేయలేకపోయాము అని వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు, అలాంటి పరిస్థితి నేను రానివ్వను
  • మన ఆస్తి పేపర్లు కూడా ప్రభుత్వం దగ్గర ఉంచుకుని, సర్టిఫికెట్ ఇస్తాం అంటుంది వైసీపీపార్టీ ప్రభుత్వం, మన ఆస్తి పేపర్లు ప్రభుత్వం దగ్గర ఎందుకు? బ్లాక్ మెయిల్ చేయడానికా? లేక దొచేయడానికా
  • జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో పని చేద్దాం, పని చేయిద్దాం. ముఖ్యమంత్రి పదవి వేస్తే సంతోషంగా స్వీకరిస్తాను, మరింత బలంగా పనిచేస్తాను
  • రాజకీయాల్లో పట్టువిడుపు ఉంటుంది. వైయస్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు పట్టువిడుపు ఉన్న వ్యక్తి. కానీ జగన్ కు అదిలేదు, వైసీపీపార్టీ నాయకులు ఈ విషయం ఆలోచించండి, జగన్ ఉన్నాడని మీరు తప్పు చేస్తే రేపు రక్షించాల్సిన వ్యక్తి నేనే
  • గతంలో చంద్రబాబు గారితో రాజధాని, ప్రత్యేక హోదా అంశాలపై విభేదించాను, ఈసారి అలాంటి విభేదాలు రావని నేను బలంగా నమ్ముతున్నాను
  • ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, అలాగే నారాలోకేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు
  • అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి.
    అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి
    జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి
    “హలో ఏపీ – బై బై వైసీపీ”
  • ఇంకోసారి జగన్ వస్తే మనం పారిపోవాలని అనకండి, కృష్ణా నది ఈ నేల విడిచి వెళ్ళదు, అలాగే మనం కూడా పారిపోవద్దు, జగన్ ను పంపించేద్దాం

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్