31వ రోజు ( హైలెట్స్ ) – విశాఖపట్నం జనవాణి కార్యక్రమం

జనవాణి
  • జనవాణి లో 4350 రిప్రజెంటేషన్ లు వచ్చాయి , వాటిని ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు పంపించడం జరిగింది – శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8 కోట్ల 53 లక్షల రూపాయలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందించడం జరిగింది
  • LG పాలిమర్స్ గ్యాస్ లీకేజీ సమయంలో మా పాపను కోల్పోయాను, నేను దీనిపై భాదతో ప్రశ్నించడానికి వెళ్తే నాపై అక్రమ కేసును పెట్టి వేధిస్తున్నారు, అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ వచ్చి కోటి రూపాయలు ఇచ్చాం కదా ఎందుకు ఇంకా గోల చేస్తావ్ అని మాట్లాడుతున్నారు – LG పాలిమర్స్ ఘటనలో పాపను కోల్పోయిన మహిళ
  • వైసీపీ ప్రభుత్వంలో ప్రాణాలకు వెల కడతారు. పాప ప్రాణాలు కోల్పోయినా, మానభంగం జరిగినా డబ్బులు ఇచ్చాం కదా కనీసం ఇంకెందుకు గోల చేసి కేసులు అని అంటారు అని మాట్లాడుతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు 
  • వైసీపీ మహిళా MLA లు, ముఖ్యమంత్రి సతీమణి ఒక్కసారి LG పాలిమర్స్ ఘటనలో చనిపోయిన గ్రీష్మ కుటుంబాన్ని చూడండి. పాపను కోల్పోయిన తల్లితో డబ్బులిచ్చాం గోల చేయకండి అని మాట్లాడుతున్నారు మీ మంత్రులు, MLA లు
  • వైసీపీ ప్రభుత్వం చేయగలిగిన ఏకైక సాయం కనీసం గ్రీష్మ తల్లితండ్రులపై అక్రమ కేసులు తొలగించండి, చిన్నారిని కోల్పోయి భాదలో ఉన్న తల్లిపై కేసులు పెట్టడం ఏంటి
  • నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్, కేవలం నీ పార్టీకి ముఖ్యమంత్రివి కాదు. కులం చూడం, మతం చూడం అని చెప్పి ఇప్పుడు చేస్తుంది ఏమిటి
  • మానసిక వికలాంగులైన పిల్లలకు ఇచ్చే పెన్షన్ తీసేసింది వైసీపీపార్టీ ప్రభుత్వం. వీరికి ఏ ఆర్థిక భరోసా లేకుండా చేసింది
  • జగనన్న కాలనీల కోసం ప్రజల భూములు కబ్జా చేసి, కనీసం పరిహారం చేయకుండా వైసీపీపార్టీ ఇబ్బంది పెడుతుంది, స్థానిక MLA అవంతి శ్రీనివాస్ దగ్గరకు వెళ్తే బెదిరించడం, అపహాస్యం చెయ్యడం చేస్తున్నారు. నేను పదే పదే ఉత్తరాంధ్ర దోపిడీ గురించి మాట్లాడటానికి కారణం ఇదే
  • చోడవరం నియోజకవర్గంలో రెల్లి కులానికి చెందిన యువకుడిని చంపి రోడ్డుపై పడేస్తే కనీసం ఈరోజు వరకు న్యాయం చెయ్యలేదు. పోలీసులు కనీసం సరైన దర్యాప్తు చేయటం లేదు
  • కనిపించేది రుషికొండ దోపిడీ, కానీ బయటకు రాకుండా పెందుర్తి లో దాదాపు 10 చిన్న కొండలు వైసీపీపార్టీ గ్రావెల్ కోసం దొచేస్తున్నారు. ఉత్తరాంధ్ర దోపిడీ అంటే ఇదే
  • TTD ఆధ్వర్యంలో హియరింగ్ సమస్య ఉన్నవారికి వినికిడి పరికరాలు ఇచ్చేవారు, కానీ వైసీపీపార్టీ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం ఆపేశారు. అవి చాలా ఖరీదైనవి, భక్తుల విరాళాలతో చేసే కార్యక్రమాల్లో ఇదొకటి, ఎందుకు చేయడం లేదు? నూతనంగా వచ్చిన టీటీడీ చైర్మన్ దీనిపై దృష్టి పెట్టాలి.
  • పోల్యుషన్ కు బలవుతున్న తాడి గ్రామం తరలించడం చేతకాదు కానీ విశాఖను రాజధాని చేస్తాడట ఈ జగన్, ముందు తాడి గ్రామ ప్రజలను కాలుష్యం నుండి రక్షించు జగన్
  • క్రిమినల్ రహిత ఆంద్రప్రదేశ్ మా ధ్యేయం. అలాంటి పరిస్థితి రావాలంటే క్రిమినల్స్ ను వెనుకేసుకొచ్చే వైసీపీపార్టీ ప్రభుత్వం ఉండకూడదు
  • ఆడబిడ్డ తాలూకు భూమిని ఆన్లైన్ లో వేరే వారి పేరుకు మార్చేశారు, అదేమిటని RDO ఆఫీస్ లో అడిగితే మీకు వేరే D పట్టా భూములు ఇస్తాం అని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంత దారుణంగా దోపిడీలు చేస్తున్నారు
  • స్పోర్ట్స్ స్కూల్స్ పెంచాల్సింది పోయి, ఉన్నవాటిని తగ్గిస్తున్నారు. విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ మూసేసావు జగన్ వైయస్ జగన్, ఇదేనా ఉత్తరాంధ్ర పై నీకున్న ప్రేమ? స్టేడియం లో పిల్లలకు పే & ప్లే అని డబ్బులు వసూలు చేయడం ఏంటి? ఈ విధానం ఆపెయ్ జగన్

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్