- ఆసియా ఖండంలో కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంక లో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం ఈ ఎర్రమట్టి దిబ్బలు, దాదాపు 20వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ప్రాంతం, వీటిని కాపాడుకోవాలి
- 32 భారత వారసత్వ ప్రదేశాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఒకటి. 1200 ఎకరాల్లో ఉండే ఈ మట్టి దిబ్బలు ఈరోజు కేవలం 292 ఎకరాలు మాత్రమే మిగిలాయి. తెలిసో, తెలీకో కొంత ప్రాంతం రక్షణ శాఖకు ఇచ్చారు. మిగిలిన ప్రాంతాన్ని కూడా దొచేస్తున్నారు
- ఈ మిగిలిన 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల చుట్టూ కనీసం ఒక 30 ఎకరాల రక్షణ భూమి ఉండాలి, కానీ కనీసం 100 అడుగులు కూడా ఉంచలేదు. దీని చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలి, వైసీపీ ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నాం, దీనికి రక్షణగా చర్యలు తీసుకుంటారో లేదో చెప్పాలి.
- చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వల్ల ఈ ఎర్రమట్టి దిబ్బలు కుంగిపోతున్నాయి. వాటికి కనీస రక్షణ లేదు. మట్టి కనపడితే చాలు దొచేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాలు దోపిడీకి గురయ్యాయి, మిగిలిన 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బలు అయిన మనం రక్షించుకోవాలి, ఇది మన వారసత్వ సంపద