3వ రోజు ( హైలెట్స్ ) – పిఠాపురం వారాహి సభ

పిఠాపురం
  • ఉదయం 10 గంటలకు కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వారితో సమావేశమైన అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు (సత్యకృష్ణ ఫంక్షన్ హాల్, గొలప్రోలు)
  • పిఠాపురం ని. గొల్లప్రోలు మ. దుర్గాడ గ్రామంలో ప్రభుత్వమిచ్చిన 425 ఇళ్ళస్థలాలకుగాను ప్రతీ లబ్ధిదారుడి నుండి ₹21,000 రూపాయలు దోచుకున్న అవినీతి వై.సీ.పీ నాయకులు.
  • పిఠాపురం నాయకులతో సమావేశమైన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
  • పిఠాపురంలో నాయకుడుని ఆశీర్వదించిన దత్త ఉపాసుకులు 
  • బహిరంగ సభ ( ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్, పిఠాపురం. )

 

పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 

  • శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురం రావడం
  • ఒక దశాబ్ద కాల ప్రయాణం నేను ఎందుకు నిలబడ్డాను అంటే మీ భవిష్యత్తు కోసం, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం:
  • గోదావరి తల్లి ఈ నేలను ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో, నేను ఈ నేలను అంటిపెట్టుకుని ఉంటాను
  • ఒక వయసు వచ్చాక మనకు కావలసింది ఉపాధి అవకాశాలు, అభివృద్ధి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లా ఏదో చేసేస్తా అని చెప్పను, కానీ ఒళ్ళు వంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తాను.
  • సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీకు బ్రాహ్మణ సమాజానికి ప్రత్యేక నమస్కారాలు. పిఠాపురం వస్తే నాకు దేవతా విగ్రహాల ద్వంసం గుర్తొస్తుంది.
  • ఇక్కడ దేవతా విగ్రహాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తే పిచ్చోల్లు చేశారు. అని చెప్పారు. 2019 నుందినిప్పటి వరకు అన్ని విగ్రహాలు పిచ్చోల్లే చేశారా? హిందూ వర్గాలను ఇతర వర్గాలతో గొడవలు పెట్టించి మళ్ళీ ఓట్లు చీల్చి అధికారంలోకి రావాలి అని చచ్చు ఆలోచన ఈ ముఖ్యమంత్రిది గుర్తింపు కోసం, అందరూ తన గురించి మాట్లాడుకోవాలనే విగ్రహాలు ధ్వంసం చేశారేమో? 219 దేవాలయాల్లో విగ్రహాలను పిచోల్లే ధ్వంసం. చేశారా?
  • హిందువులు గ్లోబల్ మైనారిటీలు. విదేశాల్లో దేవాలయాలు విద్వంసం చేస్తుంటే చూస్తూ కూర్చొని, ఇక్కడా చూస్తూ కూర్చోవాలా? 219. దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తే పట్టుకొలేని సచ్చు ప్రభుత్వం ఇది. సచ్చు ముఖ్యమంత్రి వైయస్ జగన్
  • నేను సనాతన హిందువును, అన్ని మతాలను గౌరవించే వ్యక్తిని. కానీ ఈ సచ్చు వైసీపీ పార్టీ ప్రభుత్వం మతాల విద్వేషం రెచ్చకొడుతుంది.
  • జనసేన అధికారంలోకి వచ్చాక లా & ఆర్డర్ సమస్య పరిష్కరిస్తాము.
  • కాకినాడలో కూర్చొని ఇక్కడ కోట్ల రూపాయల మట్టిని దోచుకుంటున్నారు. వైసీపీ పార్టీ MLA
  • గత 2 రోజులుగా గొల్లప్రోలు లో కూర్చుని మేధావులు, పెద్దలలో రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఏం చేస్తే బాగుంటుంది అనేది చర్చించాను.
  • తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న శివశ్రీ అనే ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి వైసీపీ నేతలు పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని చెప్పుకుంటే, అందుకు ఆమె అన్నను చంపించింది వైసీపీ పార్టీ ప్రభుత్వం. ఏ పోలీసు అధికారి ఈ విషయంపై మాట్లాడలేదు.
  • క్రిమినల్స్ ను పెంచి పోషిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. సొంత పార్టీ విశాఖ ఎంపీ కొడుకు, భార్యను కిడ్నాప్ చేయించారు. గంజాయి మత్తుతో రాష్ట్రం తూలుతుంది.
  • రానున్న ఎన్నికల్లో జనసేన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. నేను ఈ నేలను విడిచి వెళ్ళను అని మాట ఇస్తున్నాను.
  • వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని ఇంకోసారి రాణిస్తే ఏ ఒక్కరినీ బ్రతకనివ్వదు ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం
  • MP ను కొడతారు, పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే లా & ఆర్డర్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.
  • జనసేన ప్రభుత్వం అధికారంలోకి తీసుకురండి, పిఠాపురం పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం
  • హిందూ దేవాలయాలపై వైసీపీ పార్టీ ప్రభుత్వం కన్నేసింది. TTD ఆదాయంపై కన్నేశారు. శ్రీవాహి ట్రస్ట్ అని పెట్టి విరాళాలు దోచేస్తున్నారు.
  • మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే నాకు ఇష్టమైన చెప్పులు దొంగతనం చేశారు. ఎవరు చేశారో పట్టుకోండి ప్లీజ్. వైసీపీ పార్టీ ప్రభుత్వం చెప్పులు దొంగతనం చేసే స్థాయికి వచ్చింది.
  • వైసీపీ ప్రభుత్వం గూండాలకు నిలయం. జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తా జాగ్రత్త
  • నాకు క్రిమినల్స్ అంటే చిరాకు, క్రిమినలైజేషన్ పాలిటిక్స్ అంటే నచ్చదు. గూండాలా మనల్ని పాలించేది?
  • సన్నాసులు, ఈ దరిద్రులా మనల్ని పాలించేది? గూండా గాల్లు, రౌడీ గాళ్లు, హంతకులు ఇలాంటి వారిచేత పాలింపబడటానికి సిగ్గుండాలి మనకి
  • ఈ పెద్దమనిషి వైయస్ జగన్ కు నేనంటే, మన పార్టీ అంటే భయం. మనం ప్రశ్నించకూడదు అంట
  • ఈరోజు ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఇంతమందిని 5 మంది గూండాలు కంట్రోల్ చేయగలరు. అదే మీరు బలంగా ఉంటే గూండాలను త్రొక్కేయగలరు, బలంగా ఉండాలి, నేను మీకోసం నిలబడతాను, కులాలకు అతీతంగా కలిసి నడుద్దాం,
  • అక్కడ కాకినాడ MLA రోజుకు 2 కోట్ల రూపాయల మట్టిని తోటిస్తున్నారు. ఆయన అనుచరుడు ఎవరైనా ప్రశ్నిస్తే పిస్టల్ తీస్తాడు.
  • నేను మీ బిడ్డల భవిష్యత్తు కోసం నా బిడ్డలను తిడుతున్నా భరిస్తున్నాను..
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి అసుక కాంట్రాక్ట్ తీసుకొని 10వేల కోట్లు. దొచేస్తున్నాడు, నేను అదే 10 వేల కోట్లు మన యువత కోసం ఖర్చు పెట్టి పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తాను.
  • సొంత బాబాయి రక్తాన్ని తుడుచుకుని చంపిన వ్యక్తులను రక్షించే వ్యక్తి
  • వైయస్ జగన్ , అలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారు A మన కులపోడా ? కాదా అని కాదు, మన కోసం పనిచేసేవాడా కాదా అని ఆలోచించాలి.
  • మత్స్యకారులారా నేను మీ మనిషిని. మీరు గుజరాత్ వద్ద చేపల వేటకు వెళ్ళి తీరం దాటి అనుకోకుండా పాకిస్తాన్ వారికి దొరికితే మీకోసం నేను కేంద్ర మంత్రి మురళీధరన్ గారితో మాట్లాడాను. మీకు ఏ పదవి లేనప్పుడు కూడా అండగా నిలబడ్డాను.
  • నాకు ఎవరూ స్పీచులు రాయరు. నేను సమస్యలను తెలుసుకుంటాను, అర్ధం చేసుకుంటాను, మాట్లాడుతాను.
  • నేను ముఖ్యమంత్రిని అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
  • 2019 లో కూడా ఇంత బలంగా చెప్పలేదు. కానీ శ్రీ పాద వల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. నేను ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు పూర్తిగా మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నాను.
  • అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను. నాకు అధికార పీఠం ఇవ్వండి. నేను సిద్ధంగా ఉన్నాను.
  • గుడిలో నా చెప్పులు ఎత్తకెల్లే ఎదవలు కూడా మనల్ని విమర్శిస్తారు.
  • నిన్న చేబ్రోలు లో పట్టుపరిశ్రమ సమస్యలపై మాట్లాడడానికి వెళ్తున్నా అంటే ఎప్పటికప్పుడు వైసీపీ పార్టీ ప్రభుత్వం నిధులు ఇస్తాం అని ప్రకటించింది.
  • ఈ-2 దశాబ్దాల్లో నేను ఒక్క ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, ఒకే ఒక్క సారి ప్రకటన చేశాను కానీ నేను ఆ తరవాత నేను వాణిజ్య ప్రకటనలు చేయలేదు. కేవలం చేనేత వర్గాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను.
  • నాకు జూనియర్ NTR, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, అందరూ హీరోలు ఇష్టం. వారి సినిమాలు చూస్తాను. మీ అభిమాన నటులను అభిమానించండి. కానీ సినిమా వేరు రాజకీయం వేరు అర్ధం చేసుకోండి. అండగా నిలబడండి.
  • గోదావరి జిల్లాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తాయి. నేను ఇక్కడే ఉంటాను. రాష్ట్రాన్ని వదలను, మంగళగిరి లో కేంద్ర కార్యాలయం ఉంటుంది. రాజమండ్రిలో కార్యాలయం ఏర్పాటు చేశాం. త్వరలో పిఠాపురంలో కూడా పెడతాను.
  • వైసీపీ గ్రామ వాలంటీర్లు మహిళలను వేధిస్తున్నారని పిర్యాదులు. వస్తున్నాయి, వారిపై చర్యలు తీసుకుంటాం.
  • నేను వకీల్ సాబ్, భీమా నాయక్ లాంటి సినిమాలు చేయడం వల్ల దాదాపు 600 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాను. ఆ సంపాదనతో పార్టీని నడుపుతున్నాను, రైతులకు అండగా ఉన్నాను.
  • నేను 14 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 14 ఏళ్ల వనవాసం ముగిసింది, ఇక కురుక్షేత్ర సంగ్రామం చేద్దాం. ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. జైహింద్

 

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్